Australia Vs India 1st Test Scorecard: పెర్త్ టెస్టులో టీమిండియా బోల్తా - 150 పరుగులకే ఆలౌట్- టాప్ స్కోరర్‌గా నితీశ్
Australia Vs India Test Series:పెర్త్ పిచ్‌పై భారత్ బ్యాట్స్‌మెన్ తేలిపోయారు. తొలుతు బ్యాటింగ్ తీసుకున్న బుమ్రాసేన కేవలం 150 పరుగులకే ఆలౌట్ అయింది.
Australia Vs India Test Series 2024 Updates: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024లో పెర్త్ వేదికగా జరుగుతున్న మొదటి టెస్టులో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ ఘోరంగా విఫలమైంది. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 150 పరుగులకే అలౌట్ అయింది. ఈ టెస్టుతో అరంగేట్రం చేసిన తెలుగు బ్యాటర్ నితీశ్ కుమార్ రెడ్డి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఓవైపు జట్టు సభ్యులంతా విఫలమవుతున్నా కాసేపు నిలకడగా బ్యాటింగ్ చేసి 41 పరుగులు చేశాడు. టీమిండియాలో కేవలం నలుగురు బ్యాట్స్‌మెన్‌లు మాత్రమే రెండు అంకెల స్కోరు సాధించారు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు రెండో ఓవర్‌లోనే భారీ షాక్ తగిలింది. ఓపెనర్ జైస్వాల్ ఎలాంటి పరుగులు చేయకుండానే వెనుదిరిగాడు. మరో ఎండ్‌లో ఉన్న రాహుల్‌కు పడికల్ కాసేపు సహకాం అందించినట్టు కనిపించాడు. కానీ అతను కూడా పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. రెండో స్థానంలో వచ్చిన విరాట్ కొహ్లీ మళ్లీ నిరాశ పరిచాడు. కేవలం ఐదు పరుగులే చేసి హజల్‌వుడ్ బౌలింగ్‌లో ఖాజవాకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అలా క్రమ క్రమంగా ఇండియా వికెట్లు కోల్పోతూ వచ్చింది. ఒక దశలో వంద పరుగులు కూడా చేస్తారో లేదో అన్న అనుమానం కలిగింది.
టాప్ స్కోరర్ నితీశ్
టీమిండియా 73 పరుగుల వద్ద కీలకమైన ఆరు వికెట్లు కోల్పోయిన దశలో తీవ్ర ఒత్తిడిలో ఉన్నప్పుడు తెలుగు బ్యాట్స్‌మెన్ నితీష్‌కుమార్ రెడ్డి బ్యాటింగ్‌కు వచ్చాడు. పంత్‌తో కలిసి ఇన్నింగ్స్ నిలబెట్టే ప్రయత్నం చేశాడు. ఇద్దరూ కలిసి భారీ భాగస్వామ్యం నిలబెడుతున్న టైంలో భారత్‌కు మరో షాక్ తగిలింది. 37 పరుగుల వద్ద పంత్‌ను కమిన్స్ బోల్తా కొట్టించాడు. స్మిత్‌కు క్యాచ్ ఇచ్చి పంత్ అవుట్ అయ్యాడు. తర్వాత వచ్చిన వాళ్లు ఎవరూ కాసేపైనా క్రీజ్‌లో నిలబడలేకపోయారు.
Also Read: టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న క్రికెటర్ యుజ్వేంద్ర చహల్ భార్య - ఏ సినిమాలో నటిస్తుందో తెలుసా?
పెర్త్ టెస్టు ద్వారా టెస్టు క్రికెట్‌లోకి వచ్చి నితీష్ కుమార్ రెడ్డి టీమిండియాలో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. సహచరులంతా అవుట్ అవుతున్నా ధాటిగా అడి 59 బంతుల్లో 41 పరుగులు చేశాడు. ఆరు ఫోర్‌లు ఒక సిక్సర్‌తో దుమ్మరేపాడు. హాఫ్ సెంచరీ చేస్తాడనుకున్న టైంలో కమ్మిన్స్‌కు వికెట్ సమర్పించుకున్నాడు. ఆఖరి వికెట్‌గా వెనుదిరగడంతో భారత్ 150 పరుగలకు అలౌట్ అయింది. తొలి టెస్టు అడుతున్న నితీశ్ విరాట్ కోహ్లీ చేతుల మీదుగా టెస్టు క్యాప్ అందుకున్నాడు.
రాహుల్ వివాదాస్పద అవుట్
పెర్త్ టెస్టులో నిలకడగా ఆడుతున్న టైంలో కేఎల్ రాహుల్ వివాదాస్పద రీతిలో అవుట్ అయ్యాడు. డీఆర్‌ఎస్ ఫలితం చూసి తీవ్ర నిరాశకు లోనయ్యాడు. బ్యాట్‌కు బాల్ తగల్లేదని ఫీల్డ్ అంపైర్‌కు చెప్పి పెవిలియన్‌కు చేరాడు. 23వ ఓవర్‌లో మిచెల్ స్టార్క్ వేసిన బంతిని ఆడేందుకు రాహుల్ ప్రయత్నించాడు. మిస్ అయి కీపర్ చేతిలో పడింది. ఇది అవుట్ అని ఆస్ట్రేలియా ఆటగాళ్లు అప్పీలు చేశారు. బ్యాట్‌కు తాకలేదని ఫీల్డ్ అంపైర్ వారి అప్పీల్‌ను తిరస్కరించాడు. దీంతో వాళ్లు డీఆర్‌ఎస్‌కు వెళ్లారు. అక్కడ బ్యాట్‌కు తాకినట్టు స్పష్టత లేకపోయినా థర్డ్ అంపైర్ అవుటు ఇచ్చాడు. దీంతో రాహుల్ నిరాశగా వెనుదిరిగాడు.
మరోవైపు 26 పరుగులు చేసిన కేఎల్ రాహుల్ టెస్టుల్లో 3వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. 54 టెస్టుల్లో 92 ఇన్నింగ్స్ ఆడాడు. మొత్తంగా ఇప్పటి వరకు 3,007 పరుగులు చేశాడు. ఆయనకు టెస్టుల్లో 8 శతకాలు, 15 అర్థ శతకాలు ఉన్నాయి.
ఆస్ట్రేలియా బౌలింగ్‌లో హజిల్‌వుడ్ నాలుగు వికెట్లు తీసి భారత్‌ను దెబ్బతీశాడు. స్టార్క్, ,కమిన్స్, మార్ష్ తలో రెండు వికెట్లు తీశారు. మొదటి నుంచి పకడ్బంధీగా బౌలింగ్ చేసిన ఆసీస్ బౌలర్లు ఏ దశలో కూడా భారత్‌ను కోలుకోనివ్వలేదు. అనుకూలంగా ఉన్న పిచ్‌ను సద్వినియోగం చేసుకుంటూ భారీ భాగస్వామ్యాలు ఏర్పడకుడా జాగ్రత్త పడి 150 పరుగులకే టీమిండియా మొదటి ఇన్నింగ్స్ పరిమితం చేశారు.
Also Read: రిషభ్ పంత్ కోసం విపరీతమైన పోటీ, కొత్త రికార్డులు సెట్ చేస్తాడా ? ధర గెస్ చేశారా!