Dhanashree Verma Telugu Debut: టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న క్రికెటర్ యుజ్వేంద్ర చహల్ భార్య - ఏ సినిమాలో నటిస్తుందో తెలుసా?
క్రికెటర్ యుజ్వేంద్ర చహల్ భార్య, ధనశ్రీ వర్మ ’ఆకాశం దాటి వస్తావా’ చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించున్నారు. సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్గా కొరియోగ్రాఫర్ గా ఆమె ఇప్పటికే చాలా ఫేమస్.
యూట్యూబర్, ఇన్‌ఫ్లూయెన్సర్‌గా నెటిజన్లకు బాగా పరిచయమైన డాన్సర్, కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మ త్వరలో తెలుగు వెండితెరకు పరిచయం కానున్నారు. భారత క్రికెటర్ యుజ్వేంద్ర చహల్ భార్యగా మరింత క్రేజ్ ను సంపాదించుకున్న ఆవిడ... త్వరలో ‘దిల్’ రాజు బ్యానర్ నుంచి తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానున్నారని తెలిసింది. కొరియోగ్రాఫర్ యశ్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘ఆకాశం దాటి వస్తావా’. ‘సబా నాయగన్’, ‘సీ.ఐ.ఏ‘ ఫేమ్ మలయాళ నటి కార్తీక మురశీధరన్ లీడ్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ చిత్రంతోనే ధనశ్రీ వర్మను మరో హీరోయిన్ పాత్రకు చిత్ర యూనిట్ ఎంపిక చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో ‘ఎక్స్ ప్రెస్ రాజా’ ఫేమ్ సీరత్ కపూర్ ఓ కీలక పాత్ర చేస్తున్నారు
లాక్ డౌన్ లో లవ్ అండ్ మ్యారేజ్
ఆరేళ్ల వయసు నుంచే భరత నాట్యం నేర్చుకోవడం మొదలుపెట్టిన ధనశ్రీ అనేక నృత్య ప్రదర్శనలతో బాగా ఫేమస్ అయ్యారు. అనంతరం యూట్యూబర్, ఇన్ స్టాగ్రామ్ లతో నెటిజనులకు మరింత దగ్గరయ్యారు. డెంటిస్ట్ గా కూడా ప్రాక్టీస్ చేస్తున్న ధనశ్రీ, 2018లో తన డెంటిస్ట్ ప్రాక్టీస్ ను వదులుకొని పూర్తిగా డ్యాన్స్ పై దృష్టి పెట్టారు. ధనశ్రీ వర్మ కంపెనీ పేరుతో ఓ డ్యాన్స్ ట్రైనింగ్ తో పాటు ఈవెంట్ ఇన్స్టిట్యూట్ ప్రారంభించారు. ‘అపర్ శక్తి ఖురానా’, ‘ఓయే హోయే హోయే’ వంటి కూడా హిందీ మ్యూజిక్ ఆల్బమ్స్ తో మరింత పేరు సంపాదించుకున్నారు ధనశ్రీ.
డ్యాన్స్ తో పాటు మరి కొంత కాంట్రవర్శీ
లాక్ డౌన్ సమయంలోనే క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ ఆమె దగ్గర డ్యాన్స్ శిక్షణ తీసుకోడానికి వచ్చిన సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఆ లాక్ డౌన్ లోనే వీరి వివాహం జరిగింది. క్రికెటర్ భార్య కన్నా సోషల్ మీడియా ఇన్‌ప్లూయన్సర్ గా ఆమె నెటిజనులకు బాగా టార్గెట్ అవుతూ ఉంటారు. ఆమె ఇటీవలే ఫుడ్ గురించి ఓ పోస్ట్ పెట్టారు. దానికి ఓ నెటిజన్ ‘‘భర్తకు చాలా సార్లు దూరంగా ఉంటావు. ఇక మీరు పెళ్లి చేసుకోవడం దేనికి’’ అంటూ ట్రోలర్ మాట తూలాడు. ఇలాంటివన్నీ ధనశ్రీ కి మామూలే. అంతే కాదు, మార్చిలో తన తోటి కొరియోగ్రాఫర్ ప్రతీక్ ఉటేకర్ తో సన్నిహితంగా ఉన్న ఫోటో పోస్ట్ చేశారు. దాంతో నెటిజన్లు ఆమెను నానా మాటలున్నారు. చివరికి ఆమె ఆ ఫోటోను డిలీట్ చేసి వివరణ ఇచ్చేవరకూ నెటిజన్లు శాంతించలేదు.
Also Read: రెహమాన్ విడాకులపై స్పందించిన పిల్లలు... పేరెంట్స్ సపరేషన్ గురించి ఏమన్నారో తెలుసా?
ఇక 'ఆకాశం దాటి వస్తావా' సినియా విషయానికి వస్తే... డ్యాన్స్ కు ప్రాధాన్యమున్న పాత్ర కావడంతో ఈ ఆఫర్ కు ధనశ్రీ ఓకే చెప్పారట. శశి కుమార్ ముథిల్లూరి దర్శకత్వం వహిస్తున్న ‘ఆకాశం దాటి వస్తావా’ చిత్రానికి గాయకుడు కార్తీక్ స్వరకర్త. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి టీజర్ తో పాటు ఓ పాటను కూడా విడుదల చేసింది చిత్రయూనిట్. హర్షిత్ రెడ్డి, హన్సితా రెడ్డి సంయుక్తంగా దిల్ రాజు ప్రొడక్షన్స్ లో నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది.
Also Read: క్రిస్మస్ బరిలో ఫ్లాప్స్ నుంచి బయట పడేది ఎవరు? హిట్టు కొట్టేది ఎవరు? - అన్నీ క్రేజీ సినిమాలే