Vijay Deverakonda: నేనూ తెలంగాణ వాడినే... 'కోల్డ్ ప్లే' ర్యాపర్ క్రిస్ మార్టిన్ కామెంట్స్‌కు విజయ్ దేవరకొండ రిక్వెస్ట్, ఏమిటో తెల్సా?
Coldplay Chris Martin - Vijay Deverakonda: 'కోల్డ్ ప్లే' అహ్మదాబాద్ కాన్సర్ట్ లో సింగర్ క్రిస్ మార్టిన్ తాను తెలంగాణ వాడినే అంటూ చేసిన కామెంట్స్ పై హీరో విజయ్ దేవరకొండ స్పందించారు.
![Vijay Deverakonda: నేనూ తెలంగాణ వాడినే... 'కోల్డ్ ప్లే' ర్యాపర్ క్రిస్ మార్టిన్ కామెంట్స్‌కు విజయ్ దేవరకొండ రిక్వెస్ట్, ఏమిటో తెల్సా? Vijay Deverakonda reacts to Chris Martin statement about Telangana at Coldplay Ahmedabad Vijay Deverakonda: నేనూ తెలంగాణ వాడినే... 'కోల్డ్ ప్లే' ర్యాపర్ క్రిస్ మార్టిన్ కామెంట్స్‌కు విజయ్ దేవరకొండ రిక్వెస్ట్, ఏమిటో తెల్సా?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/30/edd403c6e0b089acd4eb94460f2e565e17382096245351106_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
పాపులర్ మ్యూజిక్ బ్యాండ్ 'కోల్డ్ ప్లే' సింగర్ క్రిస్ మార్టిన్ తాను తెలంగాణ వాడినే అంటూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా ఆ వైరల్ వీడియోపై విజయ్ దేవరకొండ స్పందిస్తూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
క్రిస్ మార్టిన్ కామెంట్స్ పై విజయ్ దేవరకొండ రియాక్షన్
బ్రిటిష్ టాక్ బ్యాండ్ కోల్డ్ ప్లే ఇండియా టూర్ సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకుంది. ఇండియా టూర్ లో భాగంగా కోల్డ్ ప్లే టీం ముంబైతో పాటు అహ్మదాబాద్ సిటీల్లో కాన్సర్ట్స్ నిర్వహించింది. రీసెంట్ గా గుజరాత్ లోని అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో భారీ కాన్సర్ట్ నిర్వహించగా, 'కోల్డ్ ప్లే' కాన్సర్ట్ లో సింగర్ క్రిస్ మార్టిన్ తాను తెలంగాణ వాడిని అని చెప్తూ చేసిన ర్యాప్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఆయన కామెంట్స్ పై రౌడీ హీరో విజయ్ దేవరకొండ స్పందించారు.
అహ్మదాబాద్ స్టేడియంలో 1 లక్ష మందికి పైగా హాజరైన ఈ కాన్సర్ట్ లో క్రిస్ మాట్లాడుతూ "29 ఏళ్ల నుంచి మేమ సోదరులుగా కలిసి ఉన్నాము. నా బ్యాండ్ లోని మెంబర్స్ అందరికీ థాంక్స్. ఇక చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే మేము నలుగురం భారత్ లోనే జన్మించాము. అంటే మాది ఇండియన్ బ్యాండ్. బెర్రీమాన్ చూడడానికి స్కాట్లాండ్ వ్యక్తిలాగా కనిపిస్తాడు. కానీ అతను తమిళనాడుకు చెందిన వ్యక్తి. నేను తెలంగాణ నుంచి వచ్చానని అందరికీ తెలిసిందే. మా లీడర్ విల్ ఛాంపియన్ మేమంతా కలిసి ఉండేలా చూస్తాడు" అంటూ ఫన్నీగా చెప్పారు. క్రిస్ ఇలా తెలంగాణకు చెందిన వాడిని అని చెప్పి టాలీవుడ్ ప్రేక్షకుల మనసును గెలుచుకున్నారు.
ఇక ఈ వైరల్ వీడియో పై విజయ్ దేవరకొండ స్పందిస్తూ "వెల్కమ్ క్రిస్మస్ మార్టిన్... పొడుస్తున్న పొద్దు సాంగ్, కోల్డ్ ప్లే మీద మాషప్ చేస్తే అదిరిపోతుంది" అంటూ కామెంట్ చేశారు. మరి విజయ్ దేవరకొండ ఐడియా బాగానే ఉన్నప్పటికీ, దాన్ని క్రిస్ మార్టిన్ ఆచరణలో పెడతారో లేదో చూడాలి.
Also Read: ప్రభాస్ ‘సలార్ 2’పై అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన వరదరాజ మన్నార్... ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి పూనకాలే!
అసలు ఈ కోల్డ్ ప్లే అంటే ఏంటి ?
కోల్డ్ ప్లే అంటే ఒక బ్రిటిష్ రాక్ మ్యూజిక్ బ్యాండ్. ప్రపంచవ్యాప్తంగా ఈ బ్యాండ్ కు మంచి పాపులారిటీ ఉంది. 1996లో సింగర్ క్రిస్ మార్టిన్, గిటారిస్ట్ జానీ బక్ ల్యాండ్ యూనివర్సిటీ ఆఫ్ కాలేజ్ లండన్ లో ఉన్నప్పుడే ఈ మ్యూజిక్ బ్యాండ్ ను స్టార్ట్ చేశారు. అప్పట్లో దీన్ని 'పెక్టోరాల్జ్' అని పిలుచుకునేవారు. ఆ తర్వాత బేసిస్ట్ బెర్రీమాన్ చేరినప్పుడు 'స్టార్ ఫిష్' అని పేరు మార్చారు. అనంతరం డ్రమ్మర్ విల్ ఛాంపియన్ ఈ బ్యాండ్లో యాడ్ అయ్యారు. ఈ నలుగురు చేరిన తర్వాత 1998లో దీనికి 'కోల్డ్ ప్లే' అని పేరు పెట్టారు. ఇక జనవరి 18 నుంచి 26 వరకు 'కోల్డ్ ప్లే' రాక్ బ్యాండ్ ఇండియాలో పర్యటించి, అహ్మదాబాద్ తో పాటు ముంబైలో కాన్సర్ట్స్ నిర్వహించింది. ఈ కాన్సర్ట్ కి భారీ సంఖ్యలో మ్యూజిక్ లవర్స్ హాజరయ్యారు. సెలబ్రిటీలు సైతం క్రిస్ కాన్సర్ట్ కి హాజరయ్యి, ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)