Prithviraj Sukumaran: ప్రభాస్ ‘సలార్ 2’పై అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన వరదరాజ మన్నార్... ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి పూనకాలే!
Prithviraj Sukumaran on Salaar 2: రెబల్ స్టార్ ప్రభాస్, మల్టీ టాలెంటెడ్ యాక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ స్నేహితులుగా నటించిన ‘సలార్’కి సీక్వెల్ అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమా షూటింగ్ మొదలయ్యేది ఎప్పుడంటే
![Prithviraj Sukumaran: ప్రభాస్ ‘సలార్ 2’పై అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన వరదరాజ మన్నార్... ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి పూనకాలే! Prithviraj Sukumaran Gives Exciting Update on Salaar 2 Jr NTR Prashanth Neel movies Prithviraj Sukumaran: ప్రభాస్ ‘సలార్ 2’పై అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన వరదరాజ మన్నార్... ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి పూనకాలే!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/30/4cdf6d3b20faae4e8de00c4e9c74219e17381804529761151_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
టైటిల్ చూసి.. ‘సలార్ 2’ అప్డేట్ అని, ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి పూనకాలేంటని ఆశ్చర్యపోతున్నారా? అవును ‘సలార్’లో వరదరాజ మన్నార్‌గా నటించిన పృథ్వీరాజ్ సుకుమారన్ చెప్పింది వింటే ప్రభాస్ ఫ్యాన్స్‌కి ఏమో గానీ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి మాత్రం పండగే అని చెప్పుకోవచ్చు. ఇంతకీ వరదరాజ మన్నార్ ఏం చెప్పారని అనుకుంటున్నారు కదా... అసలు విషయంలోకి వెళ్లే ముందు ఖాన్సార్ కథలోకి వెళ్లొద్దాం..
‘ఖాన్సార్ వల్ల చాలా మంది కథలు మారాయ్.. కానీ ఖాన్సార్ కథ మార్చింది ఇద్దరు ప్రాణ స్నేహితులు బద్ద శత్రువులుగా మారడం. ఒక్క ప్రాణం మిగిలినా శౌర్యాంగ ప్రతీకారం ఊహించుకోలేం’.. ఇవి ‘సలార్’ సినిమాలోని డైలాగ్స్. ఇవే ‘సలార్ 2- శౌర్యాంగ పర్వం’ ఎప్పుడెప్పుడు వస్తుందా? అని వేచి చూసేలా చేసిన అస్త్రాలు. శౌర్యాంగ ప్రతీకారం ఎప్పుడెప్పుడు చూద్దామా? అని ప్రభాస్ ఫ్యాన్స్ ఆతృతగా ఉంటే.. వారి ఆతృతపై, ఎదురుచూపులపై నీళ్లు చల్లేశాడు వరదరాజ మన్నార్. అవును, ‘సలార్ 2’కి సంబంధించి ఆయన ఇచ్చిన అప్డేట్ అలాంటిది మరి. ప్రస్తుతం పృథ్వీరాజ్ సుకుమారన్.. గతంలో ఆయన చేసిన ‘లూసిఫర్’ సీక్వెల్ చేసే పనిలో ఉన్న విషయం తెలిసిందే.
మెగాస్టార్ మోహన్ లాల్‌తో ‘లూసిఫర్’ రీమేక్‌గా ఆయన చేస్తున్న ‘L2: ఎంపురాన్’ టీజర్‌ని జనవరి 28న విడుదల చేశారు. ఈ టీజర్ విడుదల అనంతరం బాలీవుడ్ మీడియాకు పృథ్వీరాజ్ సుకుమారన్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో ‘సలార్ 2’ ఎప్పుడనే ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘‘సినిమా ఖచ్చితంగా ఉంటుంది. అది నేను అందరికీ చెప్పగలను. దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రస్తుతం తారక్ (జూనియర్ ఎన్టీఆర్)తో సినిమా చేసే పనిలో నిమగ్నమై ఉన్నాడు. ఆ సినిమా పూర్తవ్వగానే ‘సలార్ 2’ సెట్స్ మీదకు వెళుతుందని చెప్పుకొచ్చారు. ఆల్రెడీ మేకర్స్ కూడా ‘సలార్ 2’ సినిమా 2026లో ఉంటుందని ప్రకటించారు. అంటే ఎన్టీఆర్‌తో సినిమా పూర్తయిన తర్వాత ‘సలార్ 2’ చిత్రీకరణ మొదలవుతుంది. ఈ లెక్కన ‘సలార్’ వచ్చే సరికి కచ్చితంగా 2026 ఎండింగ్ అవుతుందని ప్రభాస్ ఫ్యాన్స్ లెక్కలు వేసుకుంటున్నారు.
మరోవైపు ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం పిచ్చ హ్యాపీగా ఉన్నారు. ప్రస్తుతం బాలీవుడ్‌లో ‘వార్ 2’ సినిమా చేస్తున్న ఎన్టీఆర్.. వెంటనే ప్రశాంత్ నీల్‌తో సినిమా చేస్తాడనే హింట్ రావడంతో వారి ఆనందానికి అవుధుల్లేవ్ అంటే నమ్మాలి. మరోవైపు ‘దేవర పార్ట్ 2’ ఎలానూ ఉంది. మొత్తంగా అయితే.. ఎన్టీఆర్ భారీ సినిమాలు రాబోయే రెండు సంవత్సరాలలో మూడు సినిమాలు ఉంటాయనే విషయంలో మాత్రం క్లారిటీ వచ్చేసింది. అందుకే వారంతా హ్యాపీగా ఉన్నారు. రెబల్ స్టార్ ప్రభాస్ విషయానికి వస్తే.. ప్రభాస్ కూడా చేతినిండా సినిమాలతో బిజీబిజీగా ఉన్నాడు. ‘ది రాజా సాబ్’, ‘ఫౌజీ’, ‘కల్కి 2’, ‘స్పిరిట్’ చిత్రాల కోసం వర్క్ చేస్తున్న ప్రభాస్.. ‘సలార్’ నిర్మాణ సంస్థతో మూడు సినిమాలకు కమిటైన విషయం తెలిసిందే. అందులో ఒకటి ‘సలార్ 2’. ఇక పృథ్వీరాజ్ సుకుమారన్ డైరెక్ట్ చేస్తున్న ‘L2: ఎంపురాన్’ సినిమా 27 మార్చి, 2025న పాన్ ఇండియా సినిమాగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read: పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరాతో పంజా సీక్వెల్... దర్శకుడు విష్ణువర్ధన్ ఏమన్నారంటే?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)