అన్వేషించండి

Asia Cup 2022 Final: నేడే ఆసియా కప్ ఫైనల్ - శ్రీలంకతో పాక్ అమీతుమీ

Asia Cup 2022 Final: ఆసియా కప్ పైనల్ సమరానికి సమయం వచ్చేసింది. శ్రీలంక- పాకిస్థాన్ ల మధ్య టైటిల్ పోరు నేడు జరగనుంది. రాత్రి 7.30 గంటల నుంచి ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కానుంది. 

Asia Cup 2022 Final: ఆసియా కప్ పైనల్ సమరానికి సమయం వచ్చేసింది. శ్రీలంక- పాకిస్థాన్ ల మధ్య టైటిల్ పోరు నేడు జరగనుంది. రాత్రి 7.30 గంటల నుంచి ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఆసియా కప్ లో ఆడుతున్న ఆరు జట్లలో హాంకాంగ్ ను మినహాయిస్తే అత్యంత తక్కువ అంచనాలున్న జట్టు శ్రీలంక. దేశంలో ఆర్థిక సంక్షోభం కారణంగా.. టోర్నీని నిర్వహించలేని పరిస్థితిలో యూఏఈకి ఆసియా కప్ ఆతిథ్యాన్ని అప్పగించింది. ఆటగాళ్లలో అనిశ్చితితో ఇటీవల కాలంలో ఆటలోనూ సరిగ్గా రాణించట్లేదు. అందుకు తగ్గట్లే లీగ్ దశలో అఫ్ఘనిస్థాన్ చేతిలో ఓటమితో టోర్నీని మొదలుపెట్టింది. అయితే ఆ తర్వాత నుంచి లంక ఆటతీరు మారిపోయింది.

సూపర్- 4కు చేరుకోవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో బంగ్లాపై 184 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి రేసులోకి వచ్చింది. అక్కడినుంచి ఓటమన్నదే లేకుండా ఫైనల్ కు చేరుకుంది. సూపర్- 4 మ్యాచుల్లో బలమైన భారత్, పాక్ లను ఓడించింది. 

సమష్టిగా ఆడడమే లంక బలం 
సమష్టిగా ఆడడమే శ్రీలంక బలం. జట్టులో స్టార్లు లేకపోయినా ఆటగాళ్లందరూ తలో చేయి వేసి జట్టును గెలిపిస్తున్నారు. బ్యాట్స్ మెన్ ఎదురుదాడి చేస్తూ భారీ స్కోర్లు చేస్తున్నారు. కుశాల్ మెండిస్, నిశాంక, రాజపక్స, కెప్టెన్ శనక అద్భుతంగా పరుగులు చేస్తున్నారు. బౌలింగ్ లోనూ తీక్షణ, హసరంగ, మధుశంక లాంటి వాళ్లు ఆకట్టుకుంటున్నారు. ఫీల్డింగ్ లోనూ శ్రీలంక మెరుగ్గా ఉంది. ఇదే ఆల్ రౌండ్ ప్రదర్శనను ఫైనల్లోనూ చూపిస్తే లంక కప్పు కొట్టినట్లే

పాక్ మెరుగ్గానే 
మరోవైపు పాకిస్థాన్ జట్టు మెరుగ్గానే కనిపిస్తోంది. లీగ్ దశలో భారత్ పై ఓటమి తర్వాత ఆ జట్టు పుంజుకుంది. సూపర్- 4 లో టీమిండియా సహా అఫ్ఘనిస్థాన్ ను ఓడించి ఫైనల్ బెర్తు దక్కించుకుంది. ఎప్పట్లాగే బౌలింగ్ ఆ జట్టు జలం. నసీం షా, రవూఫ్, హస్నైన్ పేస్ బౌలంగ్ లో రాణిస్తుండగా.. షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్ అదరగొడుతున్నారు. అయితే అస్థిరమైన బ్యాటింగే పాక్ బలహీనతగా కనిపిస్తోంది. కెప్టెన్ బాబర్ ఈ టోర్నీలో విఫలమయ్యాడు. సూపర్- 4 లో లంకపై మినహా పెద్దగా పరుగులు చేయలేదు. అయితే మరో ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ సూపర్ ఫామ్ లో ఉన్నాడు. అతనితోపాటు ఫకార్ జమాన్, ఖుష్ దిల్ షా, ఆసిఫ్ అలీ, నవాజ్ రాణిస్తున్నారు.  

పాకిస్థాన్, శ్రీలంక 3 సార్లు ఆసియా కప్ ఫైనల్స్ ఆడాయి. ఇందులో లంక 2 సార్లు కప్ గెలవగా.. పాక్ ఒకసారి విజయం సాధించింది.

పిచ్ పరిస్థితి 
దుబాయ్ పిచ్ బౌలర్లకు అనుకూలంగా ఉంటుంది. స్పిన్నర్లు ఆధిపత్యం చెలాయించే అవకాశం ఉంది. బ్యాటింగ్ మరీ కష్టమేమీ కాదు. టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశముంది. 

పాకిస్థాన్ జట్టు (అంచనా) 
బాబర్ అజాం(కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్, ఫకార్ జమాన్, ఇఫ్తికార్ అహ్మద్, ఖుష్ దిల్ షా, ఆసిఫ్ అలీ, షాదాబ్ ఖాన్, నవాజ్, నసీం షా, రవూఫ్, హస్నైన్.

శ్రీలంక జట్టు (అంచనా) 
కుశాల్ మెండిస్, నిశాంక, ధనుంజయ డిసిల్వా, గుణతిలక, రాజపక్స, శనక (కెప్టెన్), హసరంగ, చమిక కరుణరత్నె, తీక్షణ, మధుశంక, మధుశాన్.

 

టాప్ హెడ్ లైన్స్

Litton Das World Record:  టెస్టుల్లో బంగ్లా వికెట్ కీప‌ర్ లిట్టన్ దాస్ ప్రపంచ రికార్డు.. ఒక ఇన్నింగ్స్ లో అత్య‌ధిక డిస్మిస‌ల్స్ తో అరుదైన ఘనత
టెస్టుల్లో బంగ్లా వికెట్ కీప‌ర్ లిట్టన్ దాస్ ప్రపంచ రికార్డు.. ఒక ఇన్నింగ్స్ లో అత్య‌ధిక డిస్మిస‌ల్స్ తో అరుదైన ఘనత
Jasprit Bumrah Threat: వెల్లింగ్టన్ పచ్చిక పిచ్‌పై బుమ్రా నిప్పులు చెరిగితే కివీస్ బ్యాటర్లకు చుక్కలే.. న్యూజిలాండ్ కు మాజీ క్రికెటర్ స్ట్రాంగ్ వార్నింగ్
వెల్లింగ్టన్ పచ్చిక పిచ్‌పై బుమ్రా నిప్పులు చెరిగితే కివీస్ బ్యాటర్లకు చుక్కలే.. న్యూజిలాండ్ కు మాజీ క్రికెటర్ స్ట్రాంగ్ వార్నింగ్
Hardik Pandya News: PBKS గూటికి చేరిన హార్దిక్ పై కోచ్ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు.. ఒత్తిడిలో ఆడే ఆటగాడి లోటు తీరిందని సంబరం
PBKS గూటికి చేరిన హార్దిక్ పై కోచ్ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు.. ఒత్తిడిలో ఆడే ఆటగాడి లోటు తీరిందని సంబరం
Morne Morkel Comments: తొలి టెస్ట్ తుది జట్టులో సిరాజ్ చోటుపై సస్పెన్స్.. తుది నిర్ణయం కెప్టెన్  గిల్ చేతిలోనే ఉందన్న బౌలింగ్ కోచ్ 
తొలి టెస్ట్ తుది జట్టులో సిరాజ్ చోటుపై సస్పెన్స్.. తుది నిర్ణయం కెప్టెన్  గిల్ చేతిలోనే ఉందన్న బౌలింగ్ కోచ్ 

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Cyclone Akvan Latest Update: ఏపీకి తప్పిన ‘అక్వాన్’ పెనుముప్పు.. దిశ మార్చుకుని ఒడిశా వైపు తుపాను, ఉత్తరాంధ్రకు వర్ష సూచన!
ఏపీకి తప్పిన ‘అక్వాన్’ పెనుముప్పు.. దిశ మార్చుకుని ఒడిశా వైపు తుపాను, ఉత్తరాంధ్రకు వర్ష సూచన!
Bandla Ganesh: బండ్ల గణేశ్‌కు ఏడాది జైలు శిక్ష, రూ.95 లక్షల జరిమానా.. చెక్ బౌన్స్ కేసులో ఒంగోలు కోర్టు సంచలన తీర్పు!
బండ్ల గణేశ్‌కు ఏడాది జైలు శిక్ష, రూ.95 లక్షల జరిమానా.. చెక్ బౌన్స్ కేసులో ఒంగోలు కోర్టు సంచలన తీర్పు!
CM Revanth Reddy Siddipet Public Meeting: సిద్ధిపేటలో రేవంత్ సభ హడావుడి సరే.. స్వయంగా సీఎం పోటీ చేసినా హరీశ్ రావును ఓడించడం సాధ్యమేనా?
సిద్ధిపేటలో రేవంత్ సభ హడావుడి సరే.. స్వయంగా సీఎం పోటీ చేసినా హరీశ్ రావును ఓడించడం సాధ్యమేనా?
Personal Rapid Transit: హైదరాబాద్‌లో సరికొత్త రవాణా వ్యవస్థ.. డ్రైవర్‌లెస్ పాడ్ ట్యాక్సీలు రాబోతున్నాయ్‌!
హైదరాబాద్‌లోకి 'డ్రైవర్‌ అవసరం లేని పాడ్ ట్యాక్సీలు'.. 35 కి.మీ. PRTS నెట్‌వర్క్‌!
Nara Lokesh: తిరుపతిలో 5 వేల ఎకరాల్లో సెమీకండక్టర్ పార్క్- మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన
తిరుపతిలో 5 వేల ఎకరాల్లో సెమీకండక్టర్ పార్క్- మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన
KTR News: కృష్ణా జలాల్లో తెలంగాణకు కాంగ్రెస్ తీరని ద్రోహం.. బీఆర్ఎస్ మరో పోరాటం తప్పదన్న కేటీఆర్
కృష్ణా జలాల్లో తెలంగాణకు కాంగ్రెస్ తీరని ద్రోహం.. బీఆర్ఎస్ మరో పోరాటం తప్పదన్న కేటీఆర్
YS Jagan Assests Case: వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీ మరో ఛార్జిషీట్.. రూ.150 కోట్ల మనీలాండరింగ్ అభియోగాలు!
వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీ మరో ఛార్జిషీట్.. రూ.150 కోట్ల మనీలాండరింగ్ అభియోగాలు!
Cyclone Akvan Update: దిశ మార్చుకున్న అక్వాన్ తుపాన్.. ఉత్తరాంధ్ర- దక్షిణ ఒడిశాలకు ముప్పు, కంట్రోల్ రూమ్ నంబర్లు
దిశ మార్చుకున్న అక్వాన్ తుపాన్.. ఉత్తరాంధ్ర- దక్షిణ ఒడిశాలకు ముప్పు, కంట్రోల్ రూమ్ నంబర్లు
Embed widget