అన్వేషించండి

Ranji Trophy: ముంబైను ఆదుకున్న శివమ్‌ దూబే, కష్ట సమయంలో కీలక ఇన్నింగ్స్

Shivam Dube: దేశవాళీ ప్రతిష్టాత్మక టోర్నీ రంజీ ట్రోపీలో కేరళ-ముంబై మధ్య జరిగిన మ్యాచ్‌లో టీమిండియా నయా స్టార్‌ శివమ్ దూబే మెరిశాడు.

దేశవాళీ ప్రతిష్టాత్మక టోర్నీ రంజీ ట్రోపీ(Ranji Trophy )లో కేరళ-ముంబై Kerala- Mumbai )మధ్య జరిగిన మ్యాచ్‌లో టీమిండియా నయా స్టార్‌ శివమ్ దూబే మెరిశాడు. అఫ్గానిస్థాన్‌తో జరిగిన టీ 20 సిరీస్‌లో మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌గా నిలిచి మంచి ఫామ్‌లో ఉన్న దూబే(Shivam Dube)టెస్టు క్రికెట్‌లోనూ తన మార్కు చూపిస్తున్నాడు. అఫ్గానిస్తాన్‌తో ముగిసిన టీ20 సిరీస్‌లో దూబే వరుస అర్ధ శతకాలు సాధించాడు. మొత్తంగా మూడు మ్యాచ్‌లలో కలిపి 124 పరుగులు సాధించిన దూబే.. టీమిండియా సిరీస్‌ గెలవడంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అవార్డు కూడా అందుకున్నాడు. కీలక సమయాల్లో రెండు వికెట్లు కూడా తీసి జట్టు విజయాల్లో భాగమయ్యాడు. అఫ్గాన్‌తో టీ 20 సిరీస్‌ ముగిసిన వెంటనే.. ముంబై జట్టులో చేరిన శివమ్ దూబే... జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు కీలక ఇన్నింగ్స్‌ ఆడి ఆదుకున్నాడు. 

మ్యాచ్‌ ఎలా సాగిందంటే...?
రంజీ ట్రోఫీ ఎలైట్‌ గ్రూప్‌-బిలో భాగంగా కేరళ- ముంబై మధ్య మ్యాచ్‌ మొదలైంది. తిరువనంతపురం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ముంబై కెప్టెన్‌ అజింక్య రహానే తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. టాస్‌ గెలిచిన ముంబై అలా బ్యాటింగ్‌కు దిగిందో లేదో ఇలా వికెట్‌ కోల్పోయింది. కేరళ బౌలర్ బాసిల్ థంపీ వేసిన తొలి బంతికే ఓపెనర్‌ జై గోకుల్‌ బిస్తాను అవుట్‌ చేశాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన కెప్టెన్‌ రహానేను కూడా గోల్డెన్‌ డక్‌ చేశాడు. ఇలా ఆరంభంలోనే రెండు కీలక వికెట్లు కోల్పోయిన ముంబై పీకల్లోతు కష్టాల్లో పడింది. కానీ సువేద్‌ పార్కర్‌ 18, ప్రసాద్‌ పవార్‌ 28 పరుగులు చేసి అవుటవ్వడంతో ముంబై తక్కువ స్కోరుకే పరిమితం అవుతుందని భావించారు. కానీ ఆరో స్థానంలో బ్యాటింగ్‌ చేసిన శివం దూబే.. లల్వానీతో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. లల్వానీ 50 పరుగులు, దూబే 51, తనూష్‌ కొటైన్‌ 56 పరుగులతో రాణించడంతో  ముంబై తొలి రోజు ఆట ముగిసే సరికి 78.4 ఓవర్లలో 251 పరుగులకు ఆలౌట్‌ అయింది.
హైదరాబాద్‌ భారీ స్కోరు


దేశవాళి  ప్రతిష్టాత్మక టోర్నీ రంజీ ట్రోఫీలో హైదరాబాద్‌ జట్టు మరోసారి అదరగొట్టింది. ఇప్పటికే వరుసగా రెండు మ్యాచుల్లో విజయాలు సాధించి మంచి ఊపు మీదున్న హైదరాబాద్‌ జట్టు.. మూడో మ్యాచ్‌ను ఘనంగా ఆరంభించింది. అఫ్గాన్‌తో టీ 20 సిరీస్‌ సందర్భంగా హైదరాబాద్‌ జట్టును వీడిన తిలక్‌ వర్మ... తిరిగి జట్టులో చేరడంతో హైదరాబాద్‌ పటిష్టంగా మారింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన సిక్కిం బ్యాటింగ్‌కు దిగింది. ఇదే ఎంత తప్పుడు నిర్ణయమో సిక్కిం జట్టుకు వెంటనే తెలిసొచ్చింది. హైదరాబాద్‌ బౌలర్లు త్యాగరాజన్‌ ఆరు వికెట్లు, సీవీ మిలింద్‌ నాలుగు వికెట్లతో చెలరేగడంతో సిక్కిం కేవలం 79 పరుగులకే ఆలౌట్‌ అయింది. వీరిద్దరి బౌలింగ్‌ను ఎదుర్కొనేందుకు సిక్కిం జట్టు తీవ్రంగా కష్టపడింది.  తొలిరోజు ఆట ముగిసే సరికి వీరిద్దరు అజేయంగా నిలవగా.. హైదరాబాద్‌ ఏకంగా 302 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.

టాప్ హెడ్ లైన్స్

Who Is Saransh Jain.?: ఐపీఎల్ అన్ సోల్డ్ ప్లేయ‌ర్ కి టీమ్ ఇండియా టెస్ట్ కాల్-అప్.. వాషింగ్టన్ స్థానంలో సారాంశ్ జైన్ ఎంట్రీ, 11 ఏళ్ల నిరీక్ష‌ణ‌కు తెర‌!
ఐపీఎల్ అన్ సోల్డ్ ప్లేయ‌ర్ కి టీమ్ ఇండియా టెస్ట్ కాల్-అప్.. వాషింగ్టన్ స్థానంలో సారాంశ్ జైన్ ఎంట్రీ, 11 ఏళ్ల నిరీక్ష‌ణ‌కు తెర‌!
Team India Squad: శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
Gambhir Laxman Debate: గంభీర్ వద్దు.. వీవీఎస్ లక్ష్మణ్ ముద్దు.. జింబాబ్వేపై క్లీన్ స్వీప్ తో హెడ్ కోచ్ ప‌ద‌వి మార్పుపై డిమాండ్లు!
గంభీర్ వద్దు.. వీవీఎస్ లక్ష్మణ్ ముద్దు.. జింబాబ్వేపై క్లీన్ స్వీప్ తో హెడ్ కోచ్ ప‌ద‌వి మార్పుపై డిమాండ్లు!
Vaibhav Sooryavanshi: హాఫ్ సెంచరీ తరువాత వైభవ్ సూర్యవంశీ వినూత్నంగా సెలబ్రేషన్లు.. దాని అర్థం ఏంటో తెలుసా..
హాఫ్ సెంచరీ తరువాత వైభవ్ సూర్యవంశీ వినూత్నంగా సెలబ్రేషన్లు.. దాని అర్థం ఏంటో తెలుసా..

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
Team India Squad: శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
Telangana ACB Raids: తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
Crop Insurance: పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
Vizianagaram Road Accident: దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
Maruti Brezza 2026: మారుతి బ్రెజ్జాలో బడ్జెట్‌ ఫ్రెండ్లీ వేరియంట్‌ ఇదే! - తగ్గిన ధర, పెరిగిన ఫీచర్లు
2026 మారుతి బ్రెజ్జా పూర్తి ధరల జాబితా విడుదల - ఏ వేరియంట్‌ రేటు ఎంతంటే?
AP Telangana Rain Alert: తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్
తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో అక్కడ పిడుగులు పడే అవకాశం
Driving Safety Tips: రోడ్డు మీద హీరో కావాలంటే స్పీడ్ కాదు.. సేఫ్టీ ముఖ్యం! ప్రతి డ్రైవర్ తప్పక తెలుసుకోవాల్సిన టిప్స్
బండి స్పీడ్‌లో ఉంది.. కానీ బ్రెయిన్‌ అలర్ట్‌గా ఉందా? ప్రమాదాలను తప్పించే సింపుల్ ట్రిక్స్
Embed widget