AUS Vs SL: ఆస్ట్రేలియా, శ్రీలంక మధ్య మ్యాచ్, రెండు జట్లలో బోణీ కొట్టేదెవరు?
AUS Vs SL: ప్రపంచకప్‌లో భాగంగా సోమవారం ఆస్ట్రేలియా, శ్రీలంక తలపడునున్నాయి. ప్రపంచకప్ పోటీల్లో ఇది 14వ మ్యాచ్. లక్నోలో స్పోర్ట్స్ సిటీ స్టేడియంలో మ్యాచ్ జరగనుంది.
AUS Vs SL: ప్రపంచకప్‌లో భాగంగా సోమవారం ఆస్ట్రేలియా, శ్రీలంక తలపడునున్నాయి. ప్రపంచకప్ పోటీల్లో ఇది 14వ మ్యాచ్. లక్నోలోని ఏకానా స్పోర్ట్స్ సిటీ స్టేడియంలో మ్యాచ్ జరగనుంది. ఇప్పటి వరకు శ్రీలంక, ఆస్ట్రేలియా చెరో రెండు మ్యాచ్‌లు ఆడాయి. కానీ ఒక్క విజయాన్ని కూడా అందుకోలేదు. ఆడిన రెండు మ్యాచుల్లోను రెండు జట్లు పరాజయాన్ని మూటకట్టుకున్నాయి. దక్షిణాఫ్రికా, పాకిస్తాన్‌తో జరిగిన పోరులో శ్రీలంక ఓటమి చవిచూసింది.
ఆస్ట్రేలియాది ఇదే పరిస్థితి. భారత్, దక్షిణాఫ్రికా చేతిలో ఓడిపోయింది. వరుస ఓటములతో శ్రీలంక, ఆస్ట్రేలియా జట్లు పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో అయినా గెలిచి పాయింట్ల ఖాతా ఓపెన్ చేయాలని రెండు జట్లు భావిస్తున్నాయి. ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకం కానుంది. టోర్నీలో ముందుకు సాగాలంటే ఈ మ్యాచ్‌లో గెలిచి తీరాల్సిందే. ఈ డూ ఆర్ డై మ్యాచ్‌లో గెలిచిన జట్టు సెమీస్ రేసులో నిలబడుతుంది. ఓడిన జట్టుకు ఆశలు సన్నగిల్లుతాయి.
అధ్వాన్నంగా శ్రీలంక పరిస్థితి
వరుసగాయాలతో శ్రీలంక జట్టు పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది. మూలిగే నక్కపై తాటికాయపడ్డట్లైంది. ప్రపంచకప్‌లో ఆడిన రెండు మ్యాచుల్లో ఓడిన శ్రీలంక జట్టుకు నడిపించే నాయకుడు దూరం అయ్యాడు. క్లిష్ట సమయంలో ఆ జట్టుకు షాక్ తగిలింది. శ్రీలంక కెప్టెన్ శనక గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. తొడ కండరాల గాయంతో వన్డే ప్రపంచకప్ 2023 మొత్తానికి దూరమైనట్లు శ్రీలంక క్రికెట్ బోర్డు అధికారికంగా ప్రకటించింది. ఈనెల 10న పాకిస్తాన్‌తో మ్యాచ్ సందర్భంగా శనక కుడి తొడకు గాయమైంది. కోలుకోవడానికి అతడికి కనీసం 3 వారాలు సమయం పడుతుందని క్రికెట్ బోర్డు వర్గాలు తెలిపాయి. శనక స్థానంలో చమిక కరుణరత్నె జట్టులోకి వచ్చాడు. కరుణ రత్నే ఇప్పటివరకు 23 వన్డే మ్యాచ్‌లు ఆడాడు. శ్రీలంక జట్టు కెప్టెన్సీ బాధ్యతలను వైస్ కెప్టెన్‌గా ఉన్న కుశాల్ మెండిస్ నిర్వర్తించనున్నాడు. అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని చందంగా తయారైంది ఆస్ట్రేలియా పరిస్థితి. జట్టు నిండా ఆల్ రౌండర్లు, ప్రపంచ స్థాయి ఆటగాళ్లతో ఉన్న ఈ జట్టు భారత్, దక్షిణాఫ్రికా చేతిలో ఓటమి పాలైంది.
ఆస్ట్రేలియా Vs శ్రీలంక మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్, లైవ్ టెలికాస్ట్ వివరాలు
ప్రపంచకప్ పోటీల్లో 14వ మ్యాచ్ ఆస్ట్రేలియా, శ్రీలంక మధ్య మధ్య సోమవారం లక్నోలోని ఏకానా స్పోర్స్ట్ సిటీ స్టేడియంలో జరగనుంది. మధ్యాహ్నం 2:00 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్‌ను స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది.
మ్యాచ్ లైవ్ టెలికాస్ట్ అయ్యే ఛానెళ్లు
స్టార్ స్పోర్ట్స్ 1, స్టార్ స్పోర్ట్స్ 1 హెచ్‌డీ, స్టార్ స్పోర్ట్స్ 1 హిందీ, స్టార్ స్పోర్ట్స్ 1 హిందీ హెచ్‌డీ, స్టార్ స్పోర్ట్స్ 1 తెలుగు, స్టార్ స్పోర్ట్స్ 1 తెలుగు హెచ్‌డీ, స్టార్ స్పోర్ట్స్ 1 తమిళ్, స్టార్ స్పోర్ట్స్ 1 తమిళ్ హెచ్‌డీ, స్టార్ స్పోర్ట్స్ 1 కన్నడ ఛానెళ్లతో పాటు అన్ని స్టార్ స్పోర్ట్స్ ఛానెళ్లలో మ్యాచ్ చూడొచ్చు.
విదేశాల్లో ఎలా చూడాలి?
ప్రపంచకప్ పోటీలను విదేశాల్లో సైతం చూడొచ్చు. ఆస్ట్రేలియాలో 9నౌ, ఫాక్స్ స్పోర్స్ట్ చానెళ్లలో మ్యాచ్ చూడొచ్చు. పాకిస్తాన్‌లో పీటీవీ, యూకేలో స్కై స్పోర్స్ట్, My5, అమెరికా, కెనడాలో ఈఎస్సీఎన్+, న్యూజిలాండ్‌లో స్కై స్పోర్ట్, స్కై గో ఛానెళ్లలో మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం అవుతుంది
మొబైల్లో, స్మార్ట్ టీవీల్లో ఎలా చూడాలి?
ప్రపంచ కప్‌లో భాగంగా సోమవారం జరిగే ఆస్ట్రేలియా, శ్రీలంక మ్యాచ్‌ను మొబైల్ ఫోన్లలో డిస్నీ+హాట్‌స్టార్ యాప్‌లో ఉచితంగా చూడొచ్చు. కానీ లాప్‌టాప్, స్మార్ట్ టీవీల్లో చూడాలంటే సబ్‌స్క్రిప్షన్ ఉండాల్సిందే.
మ్యాచ్ వివరాలు
పోటీ పడే జట్లు: ఆస్ట్రేలియా, శ్రీలంక
ఎక్కడ: లక్నోలోని ఏకానా స్పోర్స్ట్ సిటీ స్టేడియం
ఎప్పుడు: సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు