అన్వేషించండి

Rohit Sharma on Virat kohli: అటు వైపు విరాట్‌ అలక.. ఇటు వైపు కోహ్లీపై రోహిత్‌ ప్రశంసలు..!

పరిమిత ఓవర్ల క్రికెట్లో ఎప్పటికీ విరాట్ కోహ్లీ జట్టుకు విలువైన ఆస్తిగా రోహిత్ పేర్కొన్నాడు. పొట్టి క్రికెట్లో 50కి పైగా సగటు ఉండటం అత్యంత అరుదని వెల్లడించాడు.

విరాట్‌ కోహ్లీపై టీమ్‌ఇండియా కొత్త సారథి రోహిత్‌ శర్మ ప్రశంసల వర్షం కురిపించాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో ఎప్పటికీ అతడు జట్టుకు విలువైన ఆస్తిగా పేర్కొన్నారు. పొట్టి క్రికెట్లో 50కి పైగా సగటు ఉండటం అత్యంత అరుదని వెల్లడించాడు. 'బ్యాక్‌స్టేజ్‌ విత్ బొరియా' షోలో అతడు మాట్లాడాడు.

టీ20 కెప్టెన్‌గా ఎంపికైన రోహిత్‌కే వన్డే పగ్గాలు అప్పగిస్తూ సెలక్షన్‌ కమిటీ బుధవారం నిర్ణయం తీసుకుంది. తెలుపు, ఎరుపు బంతి క్రికెట్‌ జట్లకు వేర్వేరు కెప్టెన్లు ఉండాలన్నదే తమ నిర్ణయమని తెలిపింది. వన్డేలకు నాయకత్వం వహిస్తానన్న కోహ్లీ కోరికను తిరస్కరించింది. కెప్టెన్సీ నుంచి దిగిపోయేందుకు రెండు రోజులు గడువిచ్చిన కమిటీ అతడే నిర్ణయం చెప్పకపోవడంతో వేటు వేసిందని తెలిసింది. ఇలాంటి సందర్భంలో రోహిత్‌ ఇంటర్వ్యూ టెలికాస్ట్‌ అవ్వడం, అతడు ప్రశంసలు కురిపించడం సంచలనంగా మారింది.

'విరాట్‌ కోహ్లీ వంటి నాణ్యమైన బ్యాటర్‌ జట్టుకెప్పటికీ అవసరం. టీ20 ఫార్మాట్లో 50 ప్లస్‌ సగటు ఉండటం అంత సులభం కాదు. నిజంగా ఇది క్రేజీ! తన అనుభవంతో జట్టును ఎన్నోసార్లు కష్టాల్లోంచి తప్పించాడు. అతడిలోని నాణ్యత, బ్యాట్స్‌మన్‌షిప్‌ చాలా అవసరం. అతనిప్పటికీ నాయకుడే. ఇవన్నీ కలుపుకుంటే అతడిని మిస్సవాలని ఎవరూ కోరుకోరు. అతడిని ఎవరూ విస్మరించరు. అతడి ఉనికి జట్టుకెంతో అవసరం' అని రోహిత్‌ అన్నాడు.

ఒకవైపు కోహ్లీని రోహిత్‌ పొగుడుతోంటే వన్డే కెప్టెన్‌గా ఎంపికైన అతడికి విరాట్‌ కనీసం గుడ్‌లక్‌ అంటూ అభినందనలూ తెలపకపోవడం గమనార్హం.

Also Read: Hardik Pandya Test Retirement: హార్దిక్‌ పాండ్య సంచలన నిర్ణయం.. టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు యోచనలో ఆల్‌రౌండర్‌!

Also Read: ICC Test Rankings: మయాంక్‌ దూకుడు..! 10 వికెట్ల అజాజ్‌ ర్యాంకు ఎంత మెరుగైందంటే..!

Also Read: Watch: మళ్లీ కలిసిన యువీ, ధోనీ..! ఎక్కడ.. ఎందుకు?

Also Read: Australian Open 2022: ఆస్ట్రేలియన్ ఓపెన్‌కు ఆ స్టార్ ఆటగాడు దూరం.. వీరిద్దరికీ లక్కీ చాన్స్!

Also Read: Rahul Dravid: ద్రవిడ్‌ శాసనం..! కుంబ్లే నాటి రూల్‌ కఠినతరం చేసిన వాల్‌.. ఇక ఎంత పెద్ద ఆటగాడైనా..!!

Also Read: Team India Announced: రోహిత్‌కు ప్రమోషన్.. పరిమిత ఓవర్లకు పూర్తిస్థాయి కెప్టెన్.. కింగ్ కోహ్లీ టెస్టుల వరకే!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nominations Over :  తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం-  ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫీవర్ !
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం- ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫీవర్ !
DGP  Ravi Gupta : ఎయిర్ లైన్స్ సేవాలోపం - తెలంగాణ డీజీపీ ఏం  చేశారో తెలుసా ?
ఎయిర్ లైన్స్ సేవాలోపం - తెలంగాణ డీజీపీ ఏం చేశారో తెలుసా ?
మీ పిల్లలు హార్లిక్స్‌ని ఇష్టంగా తాగేస్తున్నారా? అది హెల్తీ డ్రింక్ కాదట - ఆ సంస్థే ఒప్పుకుంది
మీ పిల్లలు హార్లిక్స్‌ని ఇష్టంగా తాగేస్తున్నారా? అది హెల్తీ డ్రింక్ కాదట - ఆ సంస్థే ఒప్పుకుంది
Fact Check: ముస్లింలకు ఆస్తులు పంచి పెడతామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందా? బీజేపీ చేసిన ఆ ఆరోపణల్లో నిజమెంత?
Fact Check: ముస్లింలకు ఆస్తులు పంచి పెడతామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందా? బీజేపీ చేసిన ఆ ఆరోపణల్లో నిజమెంత?
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

CM Revanth Reddy on PM Modi | రాజ్యాంగాన్ని మార్చే కుట్ర బీజేపీ చేస్తుందన్న రేవంత్ రెడ్డి | ABPPawan Kalyan From Pithapuram | Public Opinion | పిఠాపురం గుండె చప్పుడు ఏంటీ..? | ABP DesamPithapuram MLA Candidate Tamanna Simhadri | పవన్ పై పోటీకి ట్రాన్స్ జెండర్ తమన్నాను దింపింది ఎవరు.?Thatikonda Rajaiah vs Kadiyam Sri hari | కడియం కావ్య డమ్మీ అభ్యర్థి... నా యుద్ధం శ్రీహరిపైనే | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nominations Over :  తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం-  ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫీవర్ !
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం- ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫీవర్ !
DGP  Ravi Gupta : ఎయిర్ లైన్స్ సేవాలోపం - తెలంగాణ డీజీపీ ఏం  చేశారో తెలుసా ?
ఎయిర్ లైన్స్ సేవాలోపం - తెలంగాణ డీజీపీ ఏం చేశారో తెలుసా ?
మీ పిల్లలు హార్లిక్స్‌ని ఇష్టంగా తాగేస్తున్నారా? అది హెల్తీ డ్రింక్ కాదట - ఆ సంస్థే ఒప్పుకుంది
మీ పిల్లలు హార్లిక్స్‌ని ఇష్టంగా తాగేస్తున్నారా? అది హెల్తీ డ్రింక్ కాదట - ఆ సంస్థే ఒప్పుకుంది
Fact Check: ముస్లింలకు ఆస్తులు పంచి పెడతామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందా? బీజేపీ చేసిన ఆ ఆరోపణల్లో నిజమెంత?
Fact Check: ముస్లింలకు ఆస్తులు పంచి పెడతామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందా? బీజేపీ చేసిన ఆ ఆరోపణల్లో నిజమెంత?
Chandragiri Tension : చంద్రగిరి అభ్యర్థుల నామినేషన్లలో ఉద్రిక్తత  - టీడీపీ, వైసీపీ పరస్పర దాడులు
చంద్రగిరి అభ్యర్థుల నామినేషన్లలో ఉద్రిక్తత - టీడీపీ, వైసీపీ పరస్పర దాడులు
ప్రధాని మోదీ స్పీచ్‌పై ఈసీ తీవ్ర అసహనం, వివరణ ఇవ్వాలని బీజేపీకి నోటీసులు - కాంగ్రెస్‌కి కూడా
ప్రధాని మోదీ స్పీచ్‌పై ఈసీ తీవ్ర అసహనం, వివరణ ఇవ్వాలని బీజేపీకి నోటీసులు - కాంగ్రెస్‌కి కూడా
Chandrababu Vs Jagan : తోబుట్టువు కట్టుకున్న చీరపైనా  విమర్శలు చేసేవాడు ఓ ముఖ్యమంత్రా ? - జగన్ పై చంద్రబాబు ఫైర్
తోబుట్టువు కట్టుకున్న చీరపైనా విమర్శలు చేసేవాడు ఓ ముఖ్యమంత్రా ? - జగన్ పై చంద్రబాబు ఫైర్
సుప్రీంకోర్టుకీ ఓ వాట్సాప్ నంబర్, ఇకపై సమాచారం అంతా అందులోనే
సుప్రీంకోర్టుకీ ఓ వాట్సాప్ నంబర్, ఇకపై సమాచారం అంతా అందులోనే
Embed widget