By: ABP Desam | Updated at : 20 Mar 2023 08:46 AM (IST)
Edited By: Bhavani
Representational image/pixels
ఇంటి నిర్మాణం, అరేంజ్మెంట్ విషయంలో వాస్తు విస్మరించిన విషయం ఏదీ లేదు. ఇంట్లో అద్దం ఎక్కడ అమర్చినా సరే వాస్తు నియమాలను తప్పకుండా అనుసరిచాలి. అప్పుడే ఇంట్లో సుఖసంతోషాలు నిలుస్తాయి. వాస్తు దోషాలు కలుగకుండా ఉంటాయి.
ఇంటి అలంకరణకు మాత్రమే కాదు అద్దాలు ఇంట్లో వారి వ్యక్తిత్వాలను కూడా ప్రతిబింబిస్తాయి. అద్దంలో చూసుకున్నపుడు మీకు మీ ముఖంలో కనిపించే లోపాలను సరిచేసుకునేందుకు లేదా కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తారు.
ఇంట్లో ఏర్పాటు చేసే అద్దాలు మన జీవితంలో ముఖ్య పాత్ర పోషిస్తాయని వాస్తు భావిస్తుంది. అందుకే వాటిని తప్పకుండా సరైన స్థానాల్లో ఏర్పాటు చేసుకోవాలి. తప్పు దిశలో అద్దం ఉంచితే అది సమస్యలకు కారణం కావచ్చు.
ఇంట్లోని కొన్ని ప్రదేశాల్లో అద్దం అసలు ఉండకూడదని వాస్తు చెబుతోంది. ఇలాంటి ప్రదేశాల్లో ఎలాంటి అద్దం ఉంచినా సరే అది మీ అభివృద్ధి నిరోధకం కావచ్చు. మీ విజయాలకు అడ్డంకి కావచ్చు. అద్దాలకు సంబంధించిన కొన్ని వాస్తు విషయాలను తెలుసుకుందాం.
స్టోర్ రూమ్ లో అద్దాలను ఉంచినట్టయితే వెంటనే తీసెయ్యాలి. అవి జీవితంలోకి ప్రతికూలతను ఆహ్వానిస్తాయి. సాధారణంగా స్టోర్ రూమ్ లో అవసరం లేని వస్తువులు ఉంచుతుంటాము. ఇక్కడ కొంత నెగెటివ్ ఎనర్జీ ఉండొచ్చుకూడా. కనుక ఆ స్థలంలో అద్దం పెడితే అందులో పనికిరాని వస్తువుల ప్రతిబింబాలు ఏర్పడుతాయి. అందువల్ల నెగెటివిటి రెట్టింపు అవుతుంది. ఇది ఇంటిలో అశాంతికి కారణం అవుతుంది. ఇంట్లోని పాజిటివ్ ప్రదేశాల్లో అద్దం పెట్టుకోవడం మంచిది.
వాస్తు బెడ్ రూమ్ లో అద్దం ఉంచకూడదనే చెబుతుంది. కానీ బెడ్ రూమ్ లో అద్దం పెట్టాలనుకుంటే మాత్రం దాన్ని మంచం పైన లేదా మందు ముందు పెట్ట కూడదు. మంచం ప్రతిబింబం అద్దంలో కనిపించే విధంగా అద్దం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకూడదు. ఇలా పెట్టుకుంటే నిద్రి నుంచి అకస్మాత్తుగా మేల్కొన్నపుడు బ్రమలు కలుగవచ్చు. మీ ప్రతిబింబమే మీకు భయం కలిగించవచ్చు. కనుక మంచానికి దూరంగా అద్దం ఉండాలి.
వంటింట్లో అద్దం పెట్టకూడదు. వంటింట్లోని వేడి ఆవిరి ప్రభావం అద్దం మీద ఉంటుంది. అంతేకాదు ఇక్కడ అద్దం పెడితే తరచుగా మురికిగా మారుతుంది. కాబట్టి వంటింటికి అద్దం అవసరం లేదు.
ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ రావలంటే మెయిన్ డోర్ మీద అద్దం ఎప్పుడూ ఉండకూడదు. ఇక్కడ ఉండే అద్దం నెగెటివిటిని ఆకర్శిస్తుంది. పాజిటివిటిని అడ్డుకుని మీ అపజయాలకు కారణం అవుతుంది. మీకు మీ ముఖం పదేపదే కనిపించే చోట అద్దం అమర్చుకోవడం మంచిది. ప్రధాన ద్వారం దగ్గర ఉండే అద్దం ఇంటి బయట ఉండే వాటిని కూడా ప్రతిబింబిస్తుంది. కనుక అక్కడ అద్దం పనికిరాదు.
మెట్ల దగ్గర చాలా మంది అద్దం పెట్టుకుంటారు. కానీ మెట్లు ఎక్కుతున్నపుడు, దిగుతున్నపుడు దాని ప్రతిబింబం కనిపిస్తుంది. వాస్తు ఇలా చెయ్యకూడదని అంటోంది. మెట్ల రివర్స్ రిఫ్లక్షన్ ఇంట్లో వ్యక్తుల అభివృద్ధిని నిరోధిస్తుంది.
అద్దం ఎప్పుడూ మంచి విషయాలను మరింత రెట్టింపు చేసే చోట అమర్చుకోవాలి. తరచుగా మీ ముఖం కనిపించే విధంగా అమర్చుకోవాలి. డబ్బుదాచుకునే ప్రదేశానికి వ్యతిరేక దిశలో అమరిస్తే దాని ప్రతిబింబం అద్దంలో కనిపించి సంపద రెట్టింపవతుంది.
Milk in Dream: పాలు తాగుతున్నట్లు కల వచ్చిందా? మీకేం జరగబోతోందో తెలుసా?
మే 29 రాశిఫలాలు, ఈ రాశులవారు ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడతారు
Weekly Horoscope 29 May to 04 June: జూన్ మొదటివారం ఈ రాశులవారికి ఆస్తులు కలిసొచ్చే అవకాశం ఉంది!
మే 28 రాశిఫలాలు, ఈ ఐదు రాశుల వారి జీవితం ప్రకాశవంతంగా ఉంటుంది
NTR Satajayanti: నిష్ఠాగరిష్ఠుడు తారకరాముడు - అందుకే ఆయనని దైవాంశ సంభూతుడు అంటారంతా!
4 Years Of YSRCP: వైఎస్ జగన్ పాలనకు నాలుగేళ్లు పూర్తి- భారీగా బైక్ ర్యాలీలు, కార్యక్రమాలకు నేతలు శ్రీకారం
Telangana CM KCR: తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలపై అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు
'యూత్ ను ఎంకరేజ్ చేయాలే, ధమ్ ధమ్ చేయొద్దు' - జక్కన్న ట్వీట్ వైరల్!
Bonda Uma: టీడీపీ సంక్షేమ మేనిఫెస్టోతో తాడేపల్లి పునాదులు కదులుతున్నాయి- బొండా ఉమా