అన్వేషించండి

numerology: నక్షత్రం ప్రకారం పేర్లు పెట్టకపోతే….!

పేరుకి భవిష్యత్ కి లింకుందా? జన్మ నక్షత్రం ప్రకారమే పేరు పెట్టాలా-నచ్చిన పేరు పెట్టుకోవచ్చా? వాస్తవాలేంటి-అపోహలేంటి? అప్పట్లో జన్మ నక్షత్రం ప్రకారం పేర్లెందకు పెట్టేవారు? ఆంతర్యం ఏంటి?

నక్షత్రం ప్రకారం పేర్లు పెట్టకపోతే….!



numerology: నక్షత్రం ప్రకారం పేర్లు పెట్టకపోతే….!
 

తల్లిదండ్రులం కాబోతున్నాం అనే వార్త విన్నప్పటి నుంచి అమ్మాయి కావాలి, అబ్బాయి కావాలి అని చర్చలు నడుస్తాయ్. అయితే మారుతున్న కాలంతో పాటూ జనాల మైండ్ సెట్ కూడా మారుతోంది. అమ్మాయి-అబ్బాయి అనే తేడాలేదు ఎవ్వరైనా ఒకటే..ఆరోగ్యంగా పుడితేచాలనుకుంటున్నారు. ఈ సంగతి పక్కనపెడితే నెలలు నిండేకొద్దీ జరిగే మరో ముఖ్యమైన చర్చ… పేరు గురించి. అమ్మాయి పుడితే ఏ పేరు పెట్టాలి…అబ్బాయి పుడితే ఏ పేరు పెట్టాలి. అమ్మదో మాట..నాన్నతో మాట… అమ్మమ్మ, బామ్మ…తాతయ్యలది మరోమాట. అన్నీ కలిపితే పెద్ద లిస్టే తయారువుతుంది. పేరు నిర్ణయించేవరకూ పెద్ద డిస్కషనే నడుస్తుంది.

అయితే పేర్లను రెండు రకాలుగా నిర్ణయిస్తారు…

1.జన్మ నక్షత్రం- జన్మ నక్షత్రం అంటే పుట్టిన సమయాన్ని బట్టి నక్షత్రాన్ని తెలుసుకోవడం.

2. నామ నక్షత్రం- మీ పేరులో ఉండే మొదటి అక్షరం ఆధారంగా నక్షత్రం తెలుసుకోవడం.

ఎలా తెలుసుకున్నా ఒకటే ఫలితం. కానీ ఇప్పటికీ నక్షత్రం ప్రకారం పేర్లు పెట్టకపోతే ఏదో జరిగిపోతుందనే  మూఢవిశ్వాసం చాలామందిలో ఉంది. వీటికి తోడు పేరు సరిసంఖ్యలో ఉండాలని…బేసి సంఖ్యలో ఉండాలనే చర్చలూ జరుగుతున్నాయ్. కానీ ఇదంతా ట్రాష్. వాస్తవానికి ఆరోజు ఉన్న నక్షత్రానికి సంబంధించిన అక్షరంతో పేరు పెట్టాల్సిన అవసరం లేదు. ఏపేరైనా నిర్ణయించుకోవచ్చు. మన పూర్వీకులంతా ఇదే పద్ధతి అవలంబించారు కదా ఇప్పుడెందుకు అవసరం లేదంటున్నారనే సందేహం వచ్చిందా?...దానికి సమాధానం ఏంటంటే…..

numerology: నక్షత్రం ప్రకారం పేర్లు పెట్టకపోతే….!

ముందు తరం వాళ్లకి నక్షత్రాలు, రాశులు, సుముహూర్తాలపై అంత అవగాహన లేదు. శుభకార్యమైనా, అశుభమైనా తమకు తెలిసిన బ్రాహ్మణుడి వద్దకెళ్లి మంచి చెడులు అడిగేవారు. వాస్తవానికి ఏ ముహూర్తం పెట్టాలన్నా తిథి కన్నా నక్షత్రమే ప్రధానం. అలాంటప్పుడు మీ పిల్లల నక్షత్రాలేంటని అడిగితే వాళ్లు చెప్పలేరు. మహా అయితే సంక్రాంతి కి ముందు రోజు పుట్టారనో….ఫలానా తుపాను వచ్చినప్పుడు పుట్టారనో…ఇలా బండ గుర్తులు చెప్పగలరంతే. అలాంటప్పుడు వాళ్ల నక్షత్రం తెలుసుకుని ముహూర్తం నిర్ణయించడం సాధ్యమేనా అంటే అస్సలు కాదు. అందుకనే అప్పట్లో వాళ్లు పుట్టిన నక్షత్రాన్ని బట్టి పేరు పెట్టేవారు. అలాంటప్పుడు పండితుడికి ఆయా వ్యక్తుల పేర్లు చెప్పినప్పుడు…ఆ మొదటి అక్షరం ఆధారంగా వారి నక్షత్రం ఏంటో గ్రహించి ముహూర్తం నిర్ణయించేవారు. ముఖ్యంగా పెళ్లి సంబంధం కుదిరేటప్పుడు గణాలు లెక్కపెట్టాలన్నా… ముహూర్తం నిర్ణయించాలన్నా నక్షత్రమే ప్రధానం.

గతంతో పోల్చకుంటే ఇప్పుడు అందరికీ ఈ విషయాలపై ఆసక్తి పెరిగింది. పుట్టిన వెంటనే డేట్, టైమ్ నోట్ చేసుకుంటున్నారు. నక్షత్రం ఏంటో తెలుసుకుంటున్నారు. చక్రాలు వేయించేస్తున్నారు..జాతకాలు రాయించేస్తున్నారు. అంతెందుకు సాధారణ ప్రసవాలని కాలం చెల్లిన ఈ రోజుల్లో ముహూర్తం, నక్షత్రం నిర్ణయించుకున్నాకే బిడ్డను కంటున్నారు. అది మొదలు ప్రతి చిన్న కార్యక్రమానికి మంచిరోజు చూసుకుంటున్నారు. ఇంత అవగాహన ఉన్నప్పుడు నచ్చిన పేరు పెట్టుకోక…నక్షత్రాన్ని తెలియజేసి పేరు పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది? .


numerology: నక్షత్రం ప్రకారం పేర్లు పెట్టకపోతే….!

నక్షత్రం ప్రకారం పేరు నిర్ణయించాల్సిన అవసరం లేదు.  పిల్లలకు మీకు నచ్చిన పేరు పెట్టుకోవచ్చు. పేరుని బట్టి జీవితం ఉండదు. జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకున్నాక  పేరు మారుమోగుతుంది కానీ…మీ పేరు వల్ల మీరు ఉన్నత స్థానానికి చేరుకోవడం జరగదు. మహారాజు అని పేరు పెట్టినంత మాత్రాన మహారాజు కాలేడు... బంటు అని పేరు పెట్టినంత మాత్రాన సైనికుడిగానే మిగిలిపోడు. అందుకే తెలిసీ తెలియకుండా అనుసరించకుండా ఎందుకు ఏంటి అని ఆలోచించండి.  

పిల్లల జన్మ నక్షత్రం ఏంటో మీరు రాయించుకున్నప్పుడు, గుర్తుపెట్టుకోగలిగినప్పుడు ఎలాంటి సందేహాలు లేకుండా  ఏ పేరైనా పెట్టుకోవచ్చు. ఏదేమైనా మన పూర్వీకులను అనుసరించాల్సిన అవసరం లేని విషయాల్లో అనుసరిస్తున్నాం అని అర్థమైందా?.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

India vs Zimbabwe, 2nd T20I: షేక్‌ ఆడించిన అభిషేక్‌ శర్మ, రెండో టీ20లో టీమిండియా భారీ స్కోరు
షేక్‌ ఆడించిన అభిషేక్‌ శర్మ, రెండో టీ20లో టీమిండియా భారీ స్కోరు
Andhra Pradesh: టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
Group 1 Results: గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
Jon Landau Death: ‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Bobbili Maharaja Vintage Cars and Weapons | ఇలాంటి పాత, ఖరీదైన కార్లు మీకు ఎక్కడా కనిపించవు.! | ABPSingirikona Narasimha Swamy Temple | సింగిరికోన అడవిలో మహిమాన్విత నారసింహుడి ఆలయం చూశారా.! | ABP80 Years Old Man Completes 21 PGs | చదువు మీద ఈ పెద్దాయనకున్న గౌరవం చూస్తుంటే ముచ్చటేస్తుందిCM Chandrababu CM Revanth Reddy Meeting | అందరి కళ్లూ... తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంపైనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
India vs Zimbabwe, 2nd T20I: షేక్‌ ఆడించిన అభిషేక్‌ శర్మ, రెండో టీ20లో టీమిండియా భారీ స్కోరు
షేక్‌ ఆడించిన అభిషేక్‌ శర్మ, రెండో టీ20లో టీమిండియా భారీ స్కోరు
Andhra Pradesh: టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
Group 1 Results: గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
Jon Landau Death: ‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
The Cave Pub Case: కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
Free Sand Scheme: ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇకపై ఇసుక ఫ్రీ, ఈ విషయాలు తెలుసా!
ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇకపై ఇసుక ఫ్రీ, ఈ విషయాలు తెలుసా!
Gudivada News: బట్టలిప్పేసి నగ్నంగా క్షుద్రపూజలు - గుడివాడలో బెదిరిపోయిన జనం!
బట్టలిప్పేసి నగ్నంగా క్షుద్రపూజలు - గుడివాడలో బెదిరిపోయిన జనం!
Hyderabad: మణికొండలోని ది కేవ్ పబ్‌పై దాడి, డ్రగ్స్ టెస్టుల్లో 24 మందికి పాజిటివ్
మణికొండలోని ది కేవ్ పబ్‌పై దాడి, డ్రగ్స్ టెస్టుల్లో 24 మందికి పాజిటివ్
Embed widget