Vishwakarma Puja 2024: విశ్వకర్మ పూజ రోజున ఈ పనులుచేస్తే వ్యాపారంలో నష్టాలు తప్పవు
Vishwakarma Puja 2024: విశ్వకర్మ జయంతి నాడు పనిముట్లను పూజిస్తారు. దీని వల్ల వ్యాపారంలో పురోగతి ఉంటుందని ప్రజల విశ్వాసం. అందుకే కొన్ని పనులు చేయకుంటే మంచిదని పురోహితులు చూసిస్తున్నారు.
Vishwakarma Puja 2024: విశ్వకర్మను సృష్టి కర్తగా హిందువులు పూజిస్తుంటారు. ఈ విశ్వాన్ని చెక్కిన మొదటి శిల్పిగా ఆరాధిస్తారు. అందుకే ఆయన మొదటి వాస్తుశిల్పి, ఇంజనీర్‌గా అభివర్ణిస్తారు. పురాతరణ గ్రంథాలు పరిశీలిస్తే బ్రహ్మదేవుని ఏడో కుమారుడు విశ్వకర్మగా చెప్పుకొస్తారు.
ఫ్యాక్టరీల్లో, వివిధ సంస్థల్లో విశ్వకర్మ జయంతి 2024 లేదా విశ్వకర్మ పూజ చేస్తుంటారు. వ్యాపారంలో పురోభివృద్ధి కనిపించాలని పురోగతి రావాలని కోరుతూ ప్రజలు విశ్వకర్మకు ప్రత్యేక పూజలు చేస్తారు. వ్యాపార సాధనాలు, యంత్రాలకు ప్రత్యేక పూజలు చేస్తారు.
విశ్వకర్మ పూజ ఎప్పుడు (Vishwakarma Puja 2024 Date)
ప్రతి సంవత్సరం విశ్వకర్మ పూజ పండుగ సెప్టెంబర్ 17న జరుపుకుంటారు. పంచాంగం ప్రకారం సూర్యుడు కన్యారాశిలో ప్రవేశించే రోజు విశ్వకర్మ జయంతి. ఈ సంవత్సరం సూర్య దేవుడు సెప్టెంబరు 16న రాత్రి 07:50 గంటలకు కన్యారాశిలో వస్తాడు. అటువంటి పరిస్థితిలో తిథుల ప్రకారం విశ్వకర్మ జయంతిని 17 సెప్టెంబర్ 2024 న మాత్రమే జరుపుకుంటారు.
Also Read: అదృష్టాన్ని తీసుకొచ్చే పుట్టుమచ్చలు, శరీరంపై ఎక్కడ ఉంటే ఏం ప్రయోజనమో తెలుసా?
విశ్వకర్మ పూజ సమయం
ఆ రోజున ఉదయం 06:07 నుంచి మధ్యాహ్నం 1:53 వరకు విశ్వకర్మ పూజకు అనుకూలంగా ఉంటుంది. ఈ శుభ సమయంలో మీరు విశ్వకర్మను పూజించవచ్చు. శుభ ముహూర్తంలో చేసే పూజలు వ్యాపారంలో గొప్ప పురోగతికి కారణమవుతాయి. కానీ విశ్వకర్మ పూజ రోజున పొరపాటున కూడా కొన్ని పనులు చేయకూడదట. ఇది వ్యాపారంలో నష్టం కలిగించవచ్చు.
విశ్వకర్మ పూజ రోజున ఏమి చేయకూడదు
- మీరు మీ కర్మాగారాల్లో ఉపయోగించే పనిముట్లను విశ్వకర్మ జయంతి నాడు తప్పనిసరిగా పూజించాలి. ఆ రోజున వాటిని ఉపయోగించవద్దు.
- విశ్వకర్మ పూజ రోజున మీ పనిముట్లు, యంత్రాలు లేదా మీరు పని చేసే వస్తువులను ఎవరికీ ఇవ్వొద్దు.
- విశ్వకర్మను పూజించేటప్పుడు, విగ్రహంతోపాటు మీ ఉపకరణాలను ఉంచడం మర్చిపోవద్దు.
- పని ముట్లు లేదా యంత్రాలను పూజించే ముందు వాటిని పూర్తిగా శుభ్రం చేసేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి.
- మీకు వాహనం ఉంటే విశ్వకర్మ రోజున మీ వాహనాన్ని పూజించడం మరువకండి.
- విశ్వకర్మ పూజ రోజున బ్రాహ్మణులకు, పేదలకు దానం చేయడం మరువకండి.
- విశ్వకర్మ జయంతి రోజున, మాంసాహారం, మద్యపానానికి దూరంగా ఉండండి.
- మీరు హస్తకళాకారులైతే విశ్వకర్మ పూజ రోజున ఎలాంటి వస్తువులు కూడా తయారు చేయొద్దు.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం ఊహలు, వివిధ వర్గాలు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. telugu.abplive.com ఏ సమాచారాన్ని ఆమోదించదు లేదా నిర్ధారించదని స్పష్టం చేస్తున్నాం. ఏదైనా సమాచారాన్ని అమలు చేయడానికి ముందు, సంబంధిత నిపుణులను సంప్రదించండి.