అన్వేషించండి

ఈశాన్యంలో ఇవి ఉంటే అనారోగ్యాలు వెంటాడుతాయి జాగ్రత్త

పవిత్రమైన ఈశాన్యం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, వాస్తు పండితులు ఎలాంటి సూచనలు చేస్తున్నారో తెలుసుకుందాం.

వాస్తు శాస్త్రాన్ని అనుసరించి ప్రతి దిక్కుకి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఆ ప్రత్యేకతను, ప్రాధాన్యతను అనుసరించి నిర్మాణాలు పూర్తిచేసుకోవాలి. అలా లేని పక్షంలో ఆ నిర్మాణం అంత అనుకూలంగా ఉండదు. తెలియని అశాంతి, ఆర్థిక కష్టాలు, మనస్పర్థలు ఇలా రకరకాల సమస్యలు వెంటాడుతాయి.

ఏ నిర్మాణానికైనా ఈశాన్యం చాలా పవిత్రమైన దిశ. దీన్ని ఈశాన్య కోణం లేదా ఈశాన్య మూల అని కూడా అంటారు. ఈ దిశతో ఇంట్లో నివసించే వారి ఆరోగ్యం, ఆనందం, సంపద ముడిపడి ఉంటాయి. తూర్పు, ఉత్తరం కలిసే చోటు ఈశాన్యం అవుతుంది. ఉదయం సూర్యకిరణాలు తగిలే చోటు ఇది. పొద్దటి వెలుగు ఆరోగ్యానికి చాలా అవసరం. అందుకే ఇది పవిత్రమైన ప్రదేశం. ఈ దిక్కును కొంత జాగ్రత్తగా ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. తగిన జాగ్రత్తలతో పవిత్రంగా పెట్టుకోవాల్సిన ప్రదేశం ఇది.  

ఈశాన్యంలో ఉండకూడనివి

  • ఈ ప్రాంతం ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి. ఏమాత్రం అపరిశుభ్రత చేరినా చాలా ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోవాల్సి రావచ్చు.
  • ఈశాన్యంలో టాయిలెట్ అసలు ఉండకూడదు. తెలియక ఒకవేళ నిర్మించినా వెంటనే తొలగించాలి. లేదంటే చాలా ప్రమాదకర పరిస్థితులు ఎదుర్కోవాల్సి రావచ్చు.
  • ఈశాన్యంలో టాయిలెట్లు ఉంటే ఇంట్లో అనారోగ్యం చేరుతుంది. ప్రతి ఒక్కరూ అనారోగ్యం బారిన పడవచ్చు.
  • వెంటనే తొలగించడం సాధ్యపడని పరిస్థితుల్లో టాయిలెట్ లో ఒక గాజు గిన్నెలో సముద్రపు ఉప్పు, కర్పూరం, పటిక ఉంచాలి.
  • ఈశాన్యంలో వంట గది ఉన్నాకూడా మంచిది కాదు. ఇది కూడా ఇంట్లో వ్యాధులు ప్రభలేందుకు కారణమవుతుంది.
  • వంటగది ఆగ్నేయానికి మార్చడం సాధ్యం కాదని అనుకుంటే గ్యాస్ సిలెండర్ కింద ఆకుపచ్చని టైల్ లేదా రాయిని పెట్టడం వల్ల కాస్త ఉపయోగం ఉండొచ్చు.
  • ఈశాన్యం మూసి ఉన్నట్టుగా ఎలాంటి కట్టడాన్ని కట్టకూడదు. గదులు నిర్మించకూడదు.
  • ఈశాన్యం వైపున బయట కానీ, లోపల గానే మెట్లు ఉండకూడదు.
  • ఈశాన్యంలో బెడ్ రూమ్ కూడా ఉండకూడదు.
  • ఈశాన్యంలో షూరాక్ కూడా ఉండకూదు, నైరుతి పడమర దిక్కులలో షూరాక్ ఉండాలి.

ఈశాన్యంలో ఇవి ఉంటే..

  • ఈశాన్యంలో పూజ గది ఉండాలి.
  • దేవుడి చిత్రపటాలు ఉండాలి.
  • ప్రధాన ద్వారం ఈశాన్యంలో ఉంటే మంచిది.
  • ప్రధాన ద్వారానికి శుభ సూచికలు కలిగిన తోరణం అలంకరించాలి.
  • ఈశాన్యం దిక్కు తేలికగా ఉండాలి. ఎలాంటి బరువులు ఉండకూడదు.
  • ఈశాన్యం మూల పెరిగి ఉన్న స్థలంలో ఇల్లు నిర్మిస్తే సకల సంపదలు కలుగుతాయని వాస్తు చెబుతోంది.
  • బోర్వెల్ లేదా బావి ఈశాన్యంలో ఉంటే మంచిది.
  • ఈశాన్యం నీటితో సంబంధం కలిగి దిశ కాబట్టి ఈ గోడకు లేతనీలం రంగు వెస్తే బావుంటుంది.
  • ఈశాన్యంలో చిన్న నీటి తొట్టెలు సానుకూల శక్తిని తెచ్చి పెడతాయి.
  • ఫిష్ అక్వేరియం కూడా అమర్చుకోవచ్చు. అందులో 9 గోల్డ్ ఫిష్, ఒక బ్లాక్ ఫిష్ ఉంటే అదృష్టమని నమ్మకం.
  • ఈశాన్యంలో తులసి మొక్క చాలామంచిది. ప్రతికూల శక్తులను నశింపజేసి సానుకూల శక్తులను ప్రసరింపజేస్తుంది.
  • ఈశాన్యంలో ఆవూదూడ, బుద్ధ విగ్రహాలు అలంకరణకు పెట్టుకోవచ్చు.

Also Read : మహాభారత యుద్ధంలో మరణించని కౌరవ‌వీరుడు ఒక్కడే..!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pithapuram News: పిఠాపురంలో జనసైనికులను టెన్షన్ పెడుతున్న బకెట్‌- పవన్ పేరుతో కూడా తిప్పలే!
పిఠాపురంలో జనసైనికులను టెన్షన్ పెడుతున్న బకెట్‌- పవన్ పేరుతో కూడా తిప్పలే!
Karimnagar News: గడీల వారసులు కావాలా? గరీబోళ్ల బిడ్డ కావాలా? నేను పక్కా లోకల్ అంటున్న బండి సంజయ్‌
గడీల వారసులు కావాలా? గరీబోళ్ల బిడ్డ కావాలా? నేను పక్కా లోకల్ అంటున్న బండి సంజయ్‌
YS Jagan Nomination: పులివెందుల అభ్యర్థిగా నామినేషన్ వేసిన సీఎం జగన్
పులివెందుల అభ్యర్థిగా నామినేషన్ వేసిన సీఎం జగన్
Nagarjuna: ధనుష్, శేఖర్ కమ్ముల కోసం ఖాకీ చొక్కా వేసిన నాగార్జున!
ధనుష్, శేఖర్ కమ్ముల కోసం ఖాకీ చొక్కా వేసిన నాగార్జున!
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

SRH vs RCB Match Preview IPL 2024 | సన్ రైజర్స్ బ్యాటర్లను ఆర్సీబీ బౌలర్లు వణికిస్తారేమో.! | ABPAxar Patel All round Show vs GT | గుజరాత్ మీద మ్యాచ్ లో ఎటు చూసినా అక్షర్ పటేలే |DC vs GT | IPL 2024Rishabh Pant vs Mohit Sharma 31 Runs| ఆ ఒక్క ఓవరే విజయానికి ఓటమికి తేడా | DC vs GT | IPL 2024Rishabh Pant 88 Runs vs GT | పంత్ పోరాటంతోనే భారీ స్కోరు చేసిన ఢిల్లీ | DC vs GT | IPL 2024

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pithapuram News: పిఠాపురంలో జనసైనికులను టెన్షన్ పెడుతున్న బకెట్‌- పవన్ పేరుతో కూడా తిప్పలే!
పిఠాపురంలో జనసైనికులను టెన్షన్ పెడుతున్న బకెట్‌- పవన్ పేరుతో కూడా తిప్పలే!
Karimnagar News: గడీల వారసులు కావాలా? గరీబోళ్ల బిడ్డ కావాలా? నేను పక్కా లోకల్ అంటున్న బండి సంజయ్‌
గడీల వారసులు కావాలా? గరీబోళ్ల బిడ్డ కావాలా? నేను పక్కా లోకల్ అంటున్న బండి సంజయ్‌
YS Jagan Nomination: పులివెందుల అభ్యర్థిగా నామినేషన్ వేసిన సీఎం జగన్
పులివెందుల అభ్యర్థిగా నామినేషన్ వేసిన సీఎం జగన్
Nagarjuna: ధనుష్, శేఖర్ కమ్ముల కోసం ఖాకీ చొక్కా వేసిన నాగార్జున!
ధనుష్, శేఖర్ కమ్ముల కోసం ఖాకీ చొక్కా వేసిన నాగార్జున!
Suryapeta Road Accident : తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదాలు- పది మంది మృతి- ఓ వ్యక్తి సజీవదహనం
తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదాలు- పది మంది మృతి- ఓ వ్యక్తి సజీవదహనం
Andhra Pradesh News: ఓ సీఎంగానైనా నిజం వైపు నిలబడలేవా- జగన్‌కు వివేకానంద సతీమణి బహిరంగ లేఖ 
ఓ సీఎంగానైనా నిజం వైపు నిలబడలేవా- జగన్‌కు వివేకానంద సతీమణి బహిరంగ లేఖ 
Vamshi Paidipally: వంశీ పైడిపల్లి నెక్స్ట్ సినిమా బాలీవుడ్ హీరోతో - ఆ స్టార్ ఎవరంటే?
వంశీ పైడిపల్లి నెక్స్ట్ సినిమా బాలీవుడ్ హీరోతో - ఆ స్టార్ ఎవరంటే?
RBI Action: కస్టమర్లను చేర్చుకోవద్దు, క్రెడిట్‌ కార్డ్స్‌ ఇవ్వొద్దు - కోటక్ బ్యాంక్‌పై నిషేధం
కస్టమర్లను చేర్చుకోవద్దు, క్రెడిట్‌ కార్డ్స్‌ ఇవ్వొద్దు - కోటక్ బ్యాంక్‌పై నిషేధం
Embed widget