Spirituality: నీటిపై తేలియాడే రాతి విగ్రహం.. ఎప్పుడైనా విన్నారా అసలు..

శ్రీ మహావిష్ణువు అనగానే.. శేషతల్పంపై శయనిస్తున్న సమ్మోహన రూపం కళ్లముందు సాక్షాత్కరిస్తుంది. కానీ యోగనిద్ర భంగిమలో నింగిని చూస్తున్న స్వామిని చూశారా. అతి కూడా నీటిపై తేలుతూ ఉన్న శ్రీ మహావిష్ణువును...

FOLLOW US: 

బుద్ధ నీలకంఠ ఆలయం.. ఈ పేరు వినగానే ఇదేదో బుద్ధిడి ఆలయం అనుకోకండి. నేపాల్ రాజధాని ఖాట్మండుకు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇది నారాయణుడి క్షేత్రమే.  బుద్ధ నీలకంఠ అంటే పురాతన నీలి రంగు విగ్రహం అని అర్థం. ఈ పేరుమీదే ఆ ఊరిపేరు అలా స్థిరపడిపోయింది. ఆ ఆలయానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే సుమారు ఐదు అడుగుల పొడవున్న ఈ భారీ రాతి విగ్రహం నీటి మీద తేలుతూ ఉంటుంది. ఇంత భారీ విగ్రహం నీటిపై తేలడం అంటే స్వామిమహిమ కాక ఇంకేంటి అంటారు స్థానికులు. నారయణుడిని చూసేందుకు వచ్చే భక్తులు, పర్యాటకులతో ఈ క్షేత్రం నిత్యం కళకళలాడుతుంటుంది. 

Also Read: అడుగు అడుగులోనూ తన్మయత్వమే.. జీవితంలో ఒక్కసారైనా ఈ వనయాత్ర చేస్తే చాలంటారు..
రాతి విగ్రహం వెనుక ప్రచారంలో ఉన్న కథలు
ఈ భారీ రాతి విగ్రహం వందల ఏళ్లుగా నీటిపై తేలుతూనే ఉందట. ఈ విగ్రహ నిర్మాణానికి సంబంధించి రెండు కథలు ప్రచారంలో ఉన్నాయి. 
1. ఒక రైతు తన భార్యతో కలిసి పొలం దున్నుతుండగా ఓ చోట నాగలి ఆగిపోయింది.  అక్కడ భూమిలో నాగలి దిగిన ప్రదేశం నుంచి రక్తం బయటకు రావడం చూసి భూమిని తవ్వగా భారీ విగ్రహం బయట పడిందట. గ్రామస్తులంతా కలసి ఆ విగ్రహాన్ని అక్కడ ప్రతిష్టించి పూజలిందుసున్నారని చెబుతారు. 
2. మరో కథనం ప్రకారం…ఏడో శతాబ్దంలో నేపాల్‌ ప్రాంతాన్ని గుప్త రాజు విష్ణుగుప్తుడు పాలించేవాడు. ఈయన సామంత రాజు , ఖాట్మండు లోయను పాలిస్తున్న లిచ్చవి వంశీయుడైన భీమార్జున దేవుడు ఈ విగ్రహాన్ని తయారు చేయించి, ఇక్కడ ప్రతిష్ఠించాడని చెబుతారు. 

Also Read: మధుబన్ లో ఏం జరిగింది, సన్నీ లియోన్ సాంగ్ పై ఎందుకీ వివాదం..
బుద్ధ నీలకంఠ ఆలయంలో ఉన్న విష్ణువు విగ్రహం వెల్లకిలా పడుకున్న భంగిమలో ఉంటుంది.ఆ విగ్రహాన్ని ఒకే రాతిపై చెక్కారు. పాల సముద్రంలో విష్ణువు శయనించి ఉన్నట్టే కనిపిస్తుంది. ఆదిశేషువు 11 తలలు, 4 చేతుల్లో సుదర్శన చక్రం, శంఖం , తామరపువ్వు, గద ఉంటాయి.

యోగనిద్రలో ఉన్న విష్ణుమూర్తి విగ్రహం ఒక్కోసారి శివుడిలా అనిపిస్తుందట. అందుకే శివకేశవులకు ఎంతో ప్రీతి పాత్రమైన కార్తీకమాసంలో ఇక్కడ ప్రత్యేక పూజలు చేస్తుంటారు.  శివుడు హాలాహలాన్ని కంఠంలో దాచుకున్నప్పుడు ఆ వేడి తాళలేక ఈ ప్రాంతానికి వచ్చాడనీ ఇక్కడి కొలనులో నీళ్లు సేవించగానే మంట తగ్గి కొంతసేపు సేదతీరాడనే కథ కూడా ప్రచారంలో ఉంది. 

Also Read: బొట్టు పెట్టుకునే అలవాటుందా .. అయితే ఈ వేలితో పెట్టుకుంటే ఆయుష్షు పెరుగుతుందట…
Also Read: తీర్థం తీసుకుని చేయి తలకు రాసుకుంటున్నారా…
Also Read: పద్మవ్యూహం అనే మాట పదే పదే వాడేస్తుంటాం కానీ.. పద్మవ్యూహం ఎంత భయంకరంగా ఉంటుందో తెలిస్తే..

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 01 Jan 2022 04:57 PM (IST) Tags: Temple buddha neelakanta temple in kathmandu buddha neelakanta budhanilkantha temple history of buddha neelakanta temple in kathmandu buddha neelakanta temple budhanilkantha temple history buddha neelakanta kathmandu budha nelakanta temple budda nelakanta temple buddha vishnu temple nepal temple sleeping vishnu temple budha neelakanth temple nepal history buddha nilakantha temple mystery of buddha nilakanta pashupatinath temple

సంబంధిత కథనాలు

Horoscope 6th July  2022:  ఈ రాశులవారి దృష్టి తప్పుడు కార్యకలాపాలపైకి మళ్లుతుంది , జులై 6 బుధవారం రాశిఫలాలు

Horoscope 6th July 2022: ఈ రాశులవారి దృష్టి తప్పుడు కార్యకలాపాలపైకి మళ్లుతుంది , జులై 6 బుధవారం రాశిఫలాలు

Panchang 6th July 2022: జులై 6 బుధవారం తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, వివస్వత సప్తమి సందర్భంగా సూర్య ధ్యానం

Panchang 6th July 2022: జులై 6 బుధవారం తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, వివస్వత సప్తమి సందర్భంగా సూర్య ధ్యానం

Jagannath Temple: దేవుడికి దహన సంస్కారాలు, ఈ ఆలయంలో విగ్రహాలను దహనం చేసేస్తారు, మళ్లీ ఇలా ప్రాణం పోసుకుంటాయ్!

Jagannath Temple: దేవుడికి దహన సంస్కారాలు, ఈ ఆలయంలో విగ్రహాలను దహనం చేసేస్తారు, మళ్లీ ఇలా ప్రాణం పోసుకుంటాయ్!

Kumar Sashti 2022 : కుజ దోష, నాగ దోషం, సంతాన లేమి నివారణకోసం కుమారషష్టి రోజు ఇలా చేయండి!

Kumar Sashti 2022 : కుజ దోష, నాగ దోషం, సంతాన లేమి నివారణకోసం కుమారషష్టి రోజు ఇలా చేయండి!

Ashada Masam 2022: ఆషాఢం మాసంలో కొత్త దంపతులను ఎందుకు దూరంగా ఉంచుతారు!

Ashada Masam 2022: ఆషాఢం మాసంలో కొత్త దంపతులను ఎందుకు దూరంగా ఉంచుతారు!

టాప్ స్టోరీస్

Alia Bhatt On First Night: బాగా అలసిపోయాం- ఫస్ట్ నైట్‌పై ఆలియా భట్ బోల్డ్ కామెంట్

Alia Bhatt On First Night: బాగా అలసిపోయాం- ఫస్ట్ నైట్‌పై ఆలియా భట్ బోల్డ్ కామెంట్

IND vs ENG, 5th Test: ఓటమికి తోడు టీమ్‌ఇండియాకు మరో షాక్‌! WTC ఫైనల్‌ అర్హతకు ప్రమాదం!

IND vs ENG, 5th Test: ఓటమికి తోడు టీమ్‌ఇండియాకు మరో షాక్‌! WTC ఫైనల్‌ అర్హతకు ప్రమాదం!

Pegasus House Committee : గత ప్రభుత్వంలో డేటా చోరీ జరిగింది - నివేదికను అసెంబ్లీకిస్తామన్న భూమన !

Pegasus House Committee : గత ప్రభుత్వంలో డేటా చోరీ జరిగింది - నివేదికను అసెంబ్లీకిస్తామన్న భూమన !

జియో యూజర్స్‌కు గుడ్ న్యూస్, ఈ ప్లాన్స్ తీసుకుంటే Netflix, Amazon Prime సబ్‌స్క్రిప్షన్ ఉచితం

జియో యూజర్స్‌కు గుడ్ న్యూస్, ఈ ప్లాన్స్ తీసుకుంటే Netflix, Amazon Prime సబ్‌స్క్రిప్షన్ ఉచితం