Umarkot Shiv Mandir: శత్రుదేశంలో శివనామస్మరణ, రోజురోజుకీ పెరుగుతున్న శివలింగం అక్కడ ప్రత్యేకత..
కార్తీకమాసంలో దేశవ్యాప్తంగా శైవమందిరాలు..మరీ ముఖ్యంగా తెలుగురాష్ట్రాల్లో శివాలయాలు పంచాక్షరి మంత్రంతో మారుమోగుతుంటాయి. అయితే శత్రుదేశం పాకిస్తాన్ లో కూడా శివనామస్మరణతో మారుమోగే నగరం ఉందని తెలుసా..
మన శత్రుదేశం పాకిస్తాన్ సింధ్ రాష్ట్రం ఉమర్‌కోట్ నిత్యం పంచాక్షరి మంత్రంతో మారుమోగుతుంటుంది. కారణం అక్కడున్న శివమందిరం. దేశవిభజనకు ముందు అవిభక్త భారత్‌లో సింధ్ రాష్ట్రంతో పాటు ప్రస్తుతం పాకిస్తాన్ గా పేర్కొంటున్న ప్రాంతంలో లక్షల మంది హిందువులు ఉండేవారు. దేశ విభజన తర్వాత మెజార్టీ హిందువులు మనదేశానికి వచ్చేశారు. అయితే కొందరు మాత్రం అక్కడే ఉంటూ పాక్ లో భాగమయ్యారు. ఇప్పటికీ మన శత్రదేశంలో ఎన్నో దేవాలయాలున్నాయి. వాటిలో చాలా కట్టడాలు కనీస సంరక్షణ లేక శిథిలావస్థకు చేరుకోగా కొన్ని మాత్రం నిత్యం భక్తులతో కళకళలాడుతుంటాయి. వటిలో ఒకటి సింధ్‌లోని ఉమర్‌కోట్ లో కొలవైన పరమేశ్వరుడు. ఈ ప్రాంతాన్ని మొదట్లో అమర్‌కోట్ అనేవారు. ముస్లిం పాలకుల కాలంలో ఉమర్‌కోట్‌గా మారింది. మొగల్‌పాలకుడు అక్బర్ అమర్‌కోట్‌లోనే జన్మించాడు
Also Read: ఆదిశంకరాచార్యులను అమ్మవారు ఎందుకు కబళించాలని అనుకున్నారు? పాచికలాటలో గెలిచిందెవరు?
ఉమర్ కోట్ శివలింగం ప్రత్యేకత ఇదే
క్షేత్ర పురాణాల ప్రకారం ఇక్కడ పెద్ద పెద్ద పచ్చిక మైదానాలు ఉండేవట. నిత్యం పశువులను తోలుకుపోయేవారు. నిత్యం అక్కడ గడ్డిమేసే ఆవులు కొద్దసేపైన తర్వాత ఓ ప్రాంతానికి వెళ్లి పాలు ఇస్తుండేవట. అసలేం జరుగుతోందో అర్థంకాక కాపుకాసిన పశువుల కాపర్లు ఓ రోజో ఆవుల వెనకాలే వెళ్లి గమనించాట. అవి పాలు ఇచ్చి వెళ్లిపోయిన తర్వాత అక్కడ ఏముందా అని చూస్తే ఓ శివలింగం దర్శనమిచ్చిందట.వెంటనే పశువుల కాపర్లు ఆ విషయాన్ని స్థానికులకు చెప్పడంతో అప్పటి నుంచి నిత్య అభిషేకాలు, పూజలు ప్రారంభించారు. ఇక్కడ శివలింగానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే నానాటికి పెరుగుతూ వస్తోందట. మొదట్లో శివలింగ కనిపించిన వెంటనే ఆ చుట్టూ ఓ వలయం గీశారట స్థానికులు రానురాను ఆ వలయం పూర్తిగా మాయంకావడంతో పెరుగుతోందని గుర్తించారు. అందుకే దేవుడంటే ఒక రాయి అని, ఆ శిలకు జీవం ఉండదని ఎవరైనా అంటే ఉమర్ కోట్ ప్రజలు అంగీకరించరు.
Also Read: అద్దం పగిలితే అరిష్టమా.. పగిలిన అద్దాన్ని ఇంట్లో ఎందుకు ఉంచకూడదు.. ఏం జరుగుతుంది..
ప్రత్యేక పూజలు
కార్తీకమాసం, శివరాత్రి పర్వదినాల్లో ఈ క్షేత్రం భక్తులకో నిండిపోతుంది. శివ పంచాక్షరితో ఉమర్ కోట్ మారుమోగుతుంటుంది. ఆలయ ప్రాంగణం చాలా పెద్దది కావడంతో భక్తులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా అన్ని ఏర్పాట్లు చేశారు నిర్వాహకులు. పాక్‌లోని ఏ నగరానికి లేని విశిష్టత ఉమర్‌కోట్ కు ఏంటంటే ఈ నగర జనాభాలో దాదాపు 80 శాతం వరకు హిందువులే ఉన్నారట. అందుకే శివయ్యకి జరిగే అభిషేకాలు, పూజల్లో ఎక్కడా లోటు జరగడం లేదంటారు. మరీ ముఖ్యంగా తామున్న ప్రాంతంలో మతపరమైన వైషమ్యాలు లేవంటారు స్థానికులు. కేవలం ఆధ్యాత్మిక పరంగానే కాకుండా ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలకు ఉమర్ కోట్ శివమందిరం ప్రధాన కేంద్రంగా వెలుగుతోందని చెబుతారు.
Also Read: పుష్కరాల సమయంలో తప్పనిసరిగా నదీ స్నానం చేయాలని ఎందుకంటారు...
Also Read: చాణక్యుడు, కౌటిల్యుడు, విష్ణుగుప్తుడు... ఈ మూడు పేర్లు తెలుసా.. అందుకే కన్ఫూజనా..!
Also Read: ఈ దిక్కున తలపెట్టి నిద్రిస్తే ఐశ్వర్యం, ఆ దిక్కున తలపెడితే అకాల మృత్యువు- వాస్తు ఏం చెబుతోంది-సైన్స్ ఏమంటోంది..
Also Read: భక్తి తొమ్మిది రకాలు.. ఇందులో మీరు అనుసరిస్తున్న విధానం ఏంటి..
Also Read: రాళ్లు మాట్లాడతాయా… విగ్రహాలకు పూజలెందుకు అనేవారి ఇదే సమాధానమా..!
Also Read: కార్తీక దీపాలు నదులు, చెరువుల్లోనే ఎందుకు వదులుతారు...
Also Read: జీవిత కాలంలో ఒక్కసారైన దర్శించుకోవాల్సిన శైవ క్షేత్రాలివి
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్