Tirumala: తిరుమల శ్రీవారి దర్శనం టికెట్లు సెప్టెంబరు నెల కోటా విడుదల!
Srivari Arjitha Seva Tickets: తిరుమల శ్రీ వేంకటేశ్వరుడి దర్శనానికి వెళ్లే భక్తులకోసం సెప్టెంబరు నెల కోటా విడుదల చేశారు టీటీడీ అధికారులు..

తిరుమల: సెప్టెంబర్ నెలకు సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేసిన గదుల కోటా పూర్తి వివరాలు..
తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన సెప్టెంబర్ నెల కోటాను జూన్ 18 ఉదయం 10 గంటలకు TTD ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ఈ సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం జూన్ 20 ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. ఈ టికెట్లు పొందిన వారు జూన్ 20 నుంచి జూన్ 22 వరకు మధ్యాహ్నం 12 గంటల లోపు నగదు చెల్లించాల్సి ఉంటుంది. వారు మాత్రమే లక్కీడిప్‌లో టికెట్లు మంజూరవుతాయి.
21న ఆర్జిత సేవా టికెట్లు
ఊంజల్ సేవ.. ఆర్జిత బ్రహ్మోత్సవ సేవ.. కల్యాణోత్సవ సేవ... సహస్రదీపాలంకార సేవకు సంబంధించిన టికెట్లను జూన్ 21 ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు.
21న వర్చువల్ సేవల కోటా
వర్చువల్ సేవలు, వాటికి సంబంధించిన దర్శన స్లాట్లకు సంబంధించిన కోటా జూన్ 21 మధ్యాహ్నం 3 గంటలకు TTD ఆన్ లైన్లో విడుదల చేయనుంది
23న అంగప్రదక్షిణం టోకెన్లు
అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను జూన్ 23 ఉదయం 10 గంటలకు TTD ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది
శ్రీవాణి టికెట్లు
శ్రీవాణి ట్రస్టు టికెట్ల ఆన్ లైన్ కోటా జూన్ 23 ఉదయం 11 గంటల నుంచి టీటీడీ విడుదల చేయనుంది
వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా…
వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను జూన్ 23న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
24న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల
ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను జూన్ 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
తిరుమల, తిరుపతిలలో గదుల కోటా విడుదల…
తిరుమల, తిరుపతిలలో గదుల కోటాను జూన్ 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.
25న శ్రీవారి సేవా ఆగస్టు నెల కోటా విడుదల
పరకామణి సేవ, నవనీత సేవ,శ్రీవారి సేవ, గ్రూప్ సూపర్వైజర్ల సేవలకు సంబంధించిన ఆగస్టు నెల కోటాను జూన్ 25 మధ్యాహ్నం విడుదల చేస్తారు.
కేవలం https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా మాత్రమే శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని అధికారులు సూచించారు.
శ్రీ వేంకటేశ్వర దివ్య వర్ణన స్తోత్రం
ఓం శిరసివజ్ర కిరీటం - వదనే శశివర్ణ ప్రకాశం
ఫాలేకస్తూరి శ్రీగంధ తిలకం - కర్ణే వజ్రకుండల శోభితం
నాసికాయాం సువాసిక పుష్పాదళం - నయనే శశిమండల ప్రకాశం
కంఠేసువర్ణపుష్ప మాలాలంకృతం - హృదయే శ్రీనివాస మందిరం
కరే కరుణాభయసాగరం భుజేశంఖ చక్రగదాధరం
స్కంధే సువర్ణ యజ్ఞోపవీతభూషణం - సర్వాంగే స్వర్ణపీతాంబరంధరం
పాదే పరమానందరూపం - సర్వపాపనివారకం
సర్వం స్వర్ణమయం - నామ పావనం శ్రీ వేంకటేశం
శ్రీనివాసం తిరుమలేశం - నమామి శ్రీ వేంకటేశం
బంగారం, వెండి ధరల్లో భారీ హెచ్చు తగ్గులు..ఏ ఏ నెలల్లో పుత్తడి ధర తగ్గుతుందో పూర్తి సమాచారం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
తిరుమలలో ఉన్నది రాతి విగ్రహం కాదు.. సజీవంగా నిల్చున్న శ్రీ వేంకటేశ్వరుడు - తిరుమలలో జరిగే సేవలేంటి? ఏ సేవలో ఏం చేస్తారు? ఏ సేవకు వెళితే మంచిది? ఈ వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి






















