Weekly Horoscope: జూన్ 15 నుంచి జూన్ 21 వరకూ ఈ వారం మీ రాశి ఫలితం!
Weekly Horoscope: మేషం నుంచి మీనం వరకూ ఈ వారం రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి...

Weekly Horoscope: జూన్ 15 - 21..ఈ వారం మీ రాశి ఫలితం!
మేష రాశి (Aries Weekly Horoscope)
ఈ వారం మీకు అనుకూలంగా ఉంటుంది. ఫ్యూచర్ కోసం మంచి ప్లాన్స్ వేసుకుంటారు. ఉద్యోగం, వ్యాపారంలో మంచి ఫలితాలు పొందుతారు. ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవద్దు. కోపం తగ్గించుకోవాలి. సహనంగా ఉండేందుకు ప్రయత్నించాలి. పెద్దల పట్ల గౌరవాన్ని ప్రదర్శించండి. ఈ వారం మీరు విష్ణుస్రనామం పఠించండి
వృషభ రాశి (Taurus Weekly Horoscope)
మీకు మంచి సమయం నడుస్తోంది. ఆశయ సాధనలో ధైర్యంగా అడుగు ముందుకు వేస్తారు. నూతన పెట్టబడులు కలిసొస్తాయి. వ్యాపారం వృద్ధి చెందుతుంది. మీ సంపాదనలో కొంత మొత్తాన్ని మంచి కార్యం కోసం వినియోగించండి. ఆత్మవిశ్వాసం కోల్పోవద్దు. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా ఒత్తిడి నుంచి బయటపడతారు. ఈ వారం మీరు ఓ గుడ్ న్యూస్ వింటారు. లక్ష్మీదేవిని పూజించండి మీకు ఇంకా మంచి జరుగుతుంది.
మిథున రాశి (Gemini Weekly Horoscope)
మీకు అందుబాటులో ఉన్న అవకాశాలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలి. నిర్ణయం తీసుకోవడంలో స్థిరంగా ఉండాలి. మీ లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఏకాగ్రత, సహనం అవసరం. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. ముఖ్యమైన విషయాలను కుటుంబ సభ్యులతో చర్చించండి. వ్యాపారంలో నూతన పెట్టుబడులు పెట్టేముందు అనుభవజ్ఞుల సలహాలు స్వీకరించండి. దుర్గా అమ్మవారిని ధ్యానిస్తే మీకు మంచి జరుగుతుంది
కర్కాటక రాశి (Cancer Weekly Horoscope)
ప్రతి అడుగు ధైర్యంగా వేస్తారు..అడ్డంకులు ఎదురైనా దూసుకెళ్తారు. ఈ వారం మీరు కోరుకున్న లక్ష్యాన్ని సులువుగా అందుకుంటారు. అయితే గ్రహాల సంచారం మీ ఆలోచనపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. అతిగా ఆలోచించవద్దు, ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవద్దు. భవిష్యత్ లో పొరపాట్లు జరగకుండా ఉండాలంటే ఇప్పుడు మీరు వేసే అడుగు కీలకం అని ఆలోచించండి. డబ్బుకి సంబంధించిన విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ వారం మీరు నవగ్రహాలను పూజించండి
సింహ రాశి (Leo Weekly Horoscope)
మీకు గుడ్ టైమ్ నడుస్తోంది. వృత్తి, ఉద్యోగం, వ్యక్తిగతజీవితంలో ఈ వారం మీరు తీసుకునే నిర్ణయాలు ఫ్యూచర్లో మంచి ఫలితాలను ఇస్తాయి. స్థిరాస్తులు, నూతన వస్తువులు కొనుగోలు చేసేందుకు ప్రణాళికలు వేసుకుంటారు. ఇంట్లో శుభకార్యం నిర్వహిస్తారు. ఓ ముఖ్యమైన సమాచాం మిమ్మల్ని చేరుతుంది. ఈ వారం లక్ష్మీదేవిని పూజిస్తే మీకు మంచి జరుగుతుంది.
కన్యా రాశి (Virgo Weekly Horoscope)
ఈ రాశివారికి ఈ వారం అనుకూల ఫలితాలున్నాయి. ఈ వారంలో మీరు ఏ పని చేసినా మంచి ఫలితాలే పొందుతారు. మీ ప్రతిభకు తగిన ఫలితం పొందుతారు. ఆర్థికంగా అడుగు ముందుకు పడుతుంది. ఉద్యోగం, వ్యాపారంలో ఊహించని లాభం పొందుతారు. సమస్యలున్నా వాటిని అధిగమించే ధైర్యం మీ సొంతం అవుతుంది. కార్తికేయుడిని పూజించండి.
తులా రాశి (Libra Weekly Horoscope)
ఈ వారం ఇంటా బయటా మీకు గౌరవం పెరుగుతుంది. జీవితం సంతృప్తికరంగా సాగుతుంది. కుటుంబంలో సంతోషం వెల్లి విరుస్తుంది. వ్యాపారం, ఉద్యోగంలో చిన్న చిన్న ఇబ్బందులున్నా వాటిని అధిగమిస్తారు. పని విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దు. ఉద్యోగులు మరింత శ్రద్ధగా పనిచేయాల్సిన సమయం ఇది. వినాయకుడిని ధ్యానిస్తే శుభం జరుగుతుంది.
వృశ్చిక రాశి (Scorpio Weekly Horoscope)
ఈ వారం మీరు మిశ్రమ ఫలితాలున్నాయి. వ్యక్తిగత విషయాలు ఎవరితోనూ చర్చించవద్దు. విలువలు కోల్పోకుండా ఉండేందుకు ప్రయత్నించండి. ముఖ్యమైన లావాదేవీల విషయంలో నిర్లక్ష్యంగా ఉండొద్దు. ఉద్యోగం చేసేవారికి కొన్ని సమస్యలు తప్పవు. ఆత్మవిశ్వాసంతో వ్యవహరించండి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు.
ధనుస్సు రాశి (Sagittarius Weekly Horoscope)
ఈ వారం మీకు శుభసమయం నడుస్తోంది. ప్రణాళిక ప్రకారం అనుకున్న పనులన్నీ పూర్తిచేస్తారు. కుటుంబంలో పెద్దల సహకారం మీకుంటుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆలోచనలు ఊగిసలాడినా ధైర్యంగా అడుగువేస్తే మంచే జరుగుతుంది. ఉద్యోగులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు. వ్యాపారులు నూతన పెట్టుడులకు అనుకూల సమయం. పరమేశ్వరుడిని ధ్యానించండి.
మకర రాశి (Capricorn Weekly Horoscope)
ఈ వారం మకర రాశివారికి అద్భుతంగా ఉంది. ఏం చేసినా కలిసొస్తుంది. అన్నింటా విజయం మీ సొంతమవుతుంది. శత్రువులపై పైచేయి సాధిస్తారు. స్నేహితుల నుంచి సహకారం ఉంటుంది. మీరున్న రంగంలో ప్రతిభ ప్రదర్శిస్తారు. వ్యాపారాన్ని విస్తరిస్తారు. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. లక్ష్మీదేవిని పూజిస్తే శుభఫలితాలు పొందుతారు.
కుంభ రాశి (Aquarius Weekly Horoscope)
ఈ వారం మీకు అనుకూల సమయం. ఉద్యోగులు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. చేపట్టిన పనులు పూర్తిచేయండి, మధ్యలో ఆపేయవద్దు. ఆర్థికంగా అడుగు ముందుకుపడుతుంది. మీ బాధ్యతలను విస్మరించవద్దు. వ్యాపారులు నూతన పెట్టుబడులు పెట్టేముందు అనుభవజ్ఞుల సలహాలు స్వీకరించండి. తగాదాలకు దూరంగా ఉండడం మంచిది. నవగ్రహశ్లోకం పఠించండి.
మీన రాశి (Pisces Weekly Horoscope)
మీన రాశివారికి అద్భుతమైన సమయం కొనసాగుతోంది. మీరున్న ప్రతి రంగంలోనూ విజయం సాధిస్తారు. ఆర్థికంగా లాభపడతారు. ఆస్తులు కొనుగోలు చేసేందుకు ప్లాన్ చేసుకుంటారు. స్నేహితుల నుంచి సహకారం అందుతుంది. కుటుంబానికి మంచి సమయం కేటాయిస్తారు. వారం మొత్తం సంతోషంగా ఉంటారు. లక్ష్మీదేవిని పూజించండి.
గమనిక: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి, పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి.





















