ఆలయంలో అమ్మవారికి అలంకరించిన చీర కట్టుకోవచ్చా!

గుడిలో అమ్మవారికి నిత్యం అలంకారంలో భాగంగా చీరలు కడతారు

భక్తులు మొక్కుకుని ఇచ్చిన చీరలు అలంకరించి అందిస్తారు

అమ్మవారికి కట్టిన చీరలు మరి స్త్రీలు కట్టుకోవచ్చా అనే సందేహం చాలా మందిలో ఉంది

గుడిలో అమ్మవారికి కట్టిన చీరలు ఎవరైనా కట్టుకోవచ్చు కానీ కొన్ని నిమమాలు పాటించాలి

మైల పడిన రోజుల్లో ఆ చీరను కట్టుకోకూడదు.. అశుభానికి ఆ చీర వినియోగించకూడదు

రాత్రిపూట నిద్రించే సమయంలోనూ అమ్మవారికి అలంకరించిన చీరను కట్టుకోకూడదు

పండుగలు, ప్రత్యేకమైన శుభకార్యాల సమయంలోనే అమ్మవారి చీర కట్టుకోవాలి

ఇతర సాధారణ అవసరాలకోసం అమ్మవారి వస్త్రాలు వినియోగించడం శుభకరం కాదు

అమ్మవారి చీర ఎవరికీ దానం కూడా చేయకూడదు..మీరే వినియోగించుకోవాలి