Spiritual Tips: ఐశ్వర్య మహామంత్రంతో అప్పుల బాధలు దూరం! శ్రీనివాస మంత్రం ఎలా రాయాలి, ఫలితాలు ఏంటి!
Sri Srinivasa Aishwarya Maha Mantram: అప్పుల బాధల నుంచి ఉపశమనం కలిగేందుకు ఈ మంత్రం పఠించమని సూచిస్తున్నారు ఆధ్యాత్మిక వేత్తలు.. ఈ మహా మంత్రం తిరుమలలో ఉందట.

Aishwarya Maha Mantra: అప్పుల భాదలు లేనివారుండరు..ఎంత ధనం ఉన్నా, ఎంత సంపాదించినా ఏదో సమయంలో ఆర్థిక సమస్య వెంటాడుతుంది. కొందరు ఈ సమస్య నుంచి వెంటనే బయటపడితే మరికొందరు నెలలు, సంవత్సరాలు గడిచినా అప్పుల బాధ నుంచి బయటపడలేరు. అలాంటి వారు దైవారాధనలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే చాలు..అప్పుల ఊబి నుంచి గట్టెక్కుతారని ఆధ్యాత్మిక వేత్తలు, ప్రవచనకర్తలు చెబుతున్నారు. ఈ ఐశ్వర్య మహామంత్రం విశేష ఫలితాన్నిస్తుందంటారు. ప్రాచీనకాలం నుంచి ఈ ఐశ్వర్యమహామంత్రానికి ఎంతో ప్రాధాన్యత ఉంది.
ఆర్థికపరమైన సమస్యలు, వ్యాపారంలో అభివృద్ధి, సంతానానికి సంబంధించిన సమస్యలు, అప్పుల బాధలు, కోర్టు కేసుల్లో చికాకులు.. ఇలా వివిధ రకాల సమస్యలకు శ్రీనివాస ఐశ్వర్యమహామంత్రం విశేష ఫలితాన్నిస్తుంది. దీనిని ఓ రాసుకుని చదివితే మరింత మంచి జరుగుతుందంటారు.
ఎర్రటి పెన్ను , తెల్ల కాగితం తీసుకోండి. తెల్లకాగితానికి నాలుగు వైపులా పసుపు, బంధం రాసి బొట్టు పెట్టాలి. ఆ గంధంతోనే మధ్యలో శ్రీ అనే అక్షరం రాయాలి.
శ్రీ శ్రీనివాస ఐశ్వర్య మహా మంత్రం (Sri Srinivasa Aishwarya Maha Mantram)
శ్రీ వత్స వక్షసం
శ్రీ శం
శ్రీ లోలం
శ్రీ కరగ్రహమ్
శ్రీ మంతం
శ్రీ నిధిమ్
శ్రీ ఢ్యం
శ్రీ నివాసం
భజేనిశం !
ఇందులో 8 శ్రీలు ఉంటాయి. ఆది శంకరాచార్యులు స్వయంగా తిరుమల శ్రీవారి ఆనంద నిలయంలో శ్రీచక్రాన్ని, ఆకర్షణ ధన యంత్రాన్ని అక్కడ ప్రతిష్టించిన తర్వాత శ్రీవారికి ఎదురుగా ఉన్న తోరణం మీద ఆరోజుల్లో శిష్యులందరితో శిలాఫలకంపై రాయించారని చెబుతారు. అంతటి విశేషం కలిగిన ఐశ్వర్య మహామంత్రం వల్ల కూడా తిరుమలకు అంతటి ప్రాశస్త్యం వచ్చిందనే ప్రచారమూ ఉంది.
ఈ శ్లోకాన్ని రోజూ ఒకే సమయానికి రాసుకోవాలి. 28 సార్లు, 28 రోజులు రాస్తే మరీ మంచిది. మీరు అనుకున్న కోర్కె నెరవేరేవరకూ రాసుకోవాలి. ఈ రోజు కుదిరి రేపు కుదర్లేదని మానేయకూడదు. ఇలా కొన్నాళ్ల పాటు రాసుకోవడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. వ్యాపారంలో ఎదురైన ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. కోర్కె నెరవేరిన తర్వాత ఈపేపర్ ఏం చేయాలి అనే సందేహం వచ్చి ఉంటుంది..ఎవరైనా హోమం చేస్తే అందులో వేసేయవచ్చు. అయితే రావిచెట్టు ఆకును ఈ పేపర్ కు చుట్టి అందులో వేయాలి.
"వినా వేంకటేశం న నాథో న నాథః సదా వేంకటేశం స్మరామి స్మరామి
హరే వేంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వేంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ"
షేర్ మార్కెట్ ఏ నెలలో పెరుగుతుంది , ఏ నెలలో డౌన్ అవుతుంది - ఇప్పుడు పెట్టుబడులు పెట్టడం సేఫేనా తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి
బంగారం, వెండి ధరల్లో భారీ హెచ్చు తగ్గులు..ఏ ఏ నెలల్లో పుత్తడి ధర తగ్గుతుందో పూర్తి సమాచారం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
తిరుమలలో ఉన్నది రాతి విగ్రహం కాదు.. సజీవంగా నిల్చున్న శ్రీ వేంకటేశ్వరుడు - తిరుమలలో జరిగే సేవలేంటి? ఏ సేవలో ఏం చేస్తారు? ఏ సేవకు వెళితే మంచిది? ఈ వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి






















