అన్వేషించండి

Today Panchang April 26th: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, ఈ రోజు పఠించాల్సిన హనుమాన్ మంత్రం

కొత్తగా పనులు ప్రారంభించేవారు, దూరప్రయాణాలు చేసేవారు, నిత్యపూజలు చేసేవారు ఈరోజు తిథి,వార, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం తెలుసుకోవాలి అనుకుంటారు.వారికోసం ఏబీపీ దేశం అందిస్తున్న వివారిలివి...

ఏప్రిల్ 26 మంగళవారం పంచాంగం

శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు

తేదీ: 26- 04 - 2022
వారం: మంగళవారం

శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, బహుళ పక్షం

తిథి  :  ఏకాదశి మంగళవారం రాత్రి తెల్లవారుజామున 2.14 వరకు తదుపరి ద్వాదశి
వారం : మంగళవారం ( భౌమవాసరే) 
నక్షత్రం:  శతభిషం సాయంత్రం 6.42 వరకు తదుపరి పూర్వాభాద్ర 
వర్జ్యం : రాత్రి 12.58 నుంచి 2.32వరకు 
దుర్ముహూర్తం : ఉదయం 8.17 నుంచి 9.03 వరకు , రాత్రి 10.47 నుంచి 11.33 వరకు
అమృతఘడియలు : రాత్రి 11.01 నుంచి 12.35 వరకు
సూర్యోదయం: 05:41 
సూర్యాస్తమయం : 06:14

( తెలుగువారు ముఖ్యంగా తిథి, నక్షత్రం, వర్ద్యం, దుర్ముహూర్తం, రాహుకాలం మాత్రమే చూసుకుని ఏదైనా పనిప్రారంభిస్తారు...మిగిలిన వాటిని పెద్దగా పరిగణలోకి తీసుకోరు. పంచాగం, ప్రాంతం ఆధారంగా సమయాల్లో స్వల్ప మార్పులుంటాయి)

Also Read: అనారోగ్యం, శనిబాధలు తొలగిపోవాలంటే మంగళవారం ఇలా చేయండి

మంగళవారం ..అంటేనే జయవారం.  మంగళవారం రోజు ఉపవాసం చేసి ఆంజనేయ ఉపాసన చేస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని భక్తుల విశ్వాసం. మంగళవారానికి నవగ్రహాల్లో అంగారకుడు అధిపతి. అలాంటి అంగారకుని వల్ల ఏర్పడే ఈతిబాధలు, దోషాలు తొలగిపోవాలంటే.. ఆంజనేయ స్వామిని మంగళవారం పూట అర్చించాలి. 

ధ్యానం :-
వందే వానర నారసింహ ఖగరాట్ క్రోడాశ్వ వక్త్రాన్వితం
దివ్యాలంకరణం త్రిపంచనయనం దేదీప్యమానం రుచా
హస్తాబ్జె రసి ఖేట పుస్తక సుధాకుంభాం కుశా ద్రిం హలం
ఖట్వాంగం ఫణి భూరుహం దశభుజం సర్వారి వీరాపాహమ్!!

ఆంజనేయ స్తోత్రం
నమో వాయుపుత్రాయ భీమరూపాయధీమతే
నమస్తే రామదూతాయ కామరూపాయశ్రీమతే
మోహశోక వినాశాయ సీతాశోక వినాశినే
భగ్నాశోక వనాయాస్తు దగ్ధలంకాయ వాగ్మినే

గతి నిర్జిత వాతాయ లక్ష్మణ ప్రాణదాయచ
వనౌకసాం వరిష్ఠాయ వశినే వననాసినే
తత్త్వజ్ఞాన సుధాసింధు నిమగ్నాయ మహీయసే
ఆంజనేయాయ శూరాయ సుగ్రీవ సచివాయచ

జన్మమృత్యు భయఘ్నాయ సర్వక్లేశ హరాయచ
నేదిష్ఠాయ మహాభూతప్రేత భీత్యాది హారిణే
యాతనా నాశనాయాస్తు నమో మర్కటరూపిణే
యక్షరాక్షస శార్దూల సర్పవృశ్చిక భీహ్నతే

మహాబలాయ వీరాయ చిరంజీవిన ఉద్ధృతే
హారిణే వజ్రదేహాయ చోల్లంఘిత మహాబ్దయే
బలినా మగ్రగణ్యాయ నమః పాపహరాయతే
లాభ దోసిత్వేమేవాసు హనుమాన్ రాక్షసాంతక

యశోజయంచ మే దేహి శత్రూన్ నాశయ నాశయ
స్వాశ్రితానామ భయదం య ఏవం స్తౌతి మారుతిం
హానిమేతో భవేత్తస్య సర్వత్ర విజయీ భవేత్.

Also Read: పంచ మహాపాతకాలు చుట్టుకుంటాయ్ అంటారు కదా, ఆ పాతకాలు ఏంటో తెలుసా

బుద్ధిబలం, ధైర్యం సిద్ధించాలంటే....
హనుమంతం వాయుపుత్రం నమామి బ్రహ్మచారిణమ్
త్రిమూరత్యాత్మక మాత్మస్థం జపాకుసుమ సన్నిభమ్
నానాభూషణ సంయుక్తం ఆంజనేయం నమామ్యహమ్
పంచాక్షర స్థితం దేవం నీల నీరద సన్నిభమ్..!!

పెద్ద చెక్కిళ్లు గలవాడు, వాయుదేవుని వరప్రసాదంతో పుట్టినవాడు, బ్రహ్మచారి, త్రిమూర్తి స్వరూపుడు, ఆత్మజ్ఞాని, మంకెనపువ్వులాగా ఉన్నవాడు, దేదీప్యమానంగా ప్రకాశించే సమస్తమైన నగలను ధరించినవాడు, పంచబీజాక్షరాలతో ఉన్నవాడు, నల్లని మేఘంతో సమానమైనవాడు అయిన హనుమంతుడికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని అర్థం.

Also Read: ఇంట్లో ఆదిశగా దీపం పెడితే అన్నీ అపశకునాలే

టాప్ హెడ్ లైన్స్

05-08-2026 బుధవారం మీ రాశిఫలాలు!
05-08-2026 బుధవారం మీ రాశిఫలాలు!
బొడ్డు కిందకి చీర కడితే అసభ్యంగా చూడకండి - ఆయుర్వేదం, యోగశాస్త్రంలో ఏముందంటే!
బొడ్డు కిందకి చీర కడితే అసభ్యంగా చూడకండి - ఆయుర్వేదం, యోగశాస్త్రంలో ఏముందంటే!
శ్రావణమాసం 2026: శుభదినాలు, వరలక్ష్మీ వ్రతం తేదీలు, పూజా విధానాలు!
శ్రావణమాసం 2026: శుభదినాలు, వరలక్ష్మీ వ్రతం తేదీలు, పూజా విధానాలు!
భారతదేశ దేవాలయాల్లో విలక్షణ నైవేద్యాలు: మీ ఊహకు అందని ఆచారాలు!
భారతదేశ దేవాలయాల్లో విలక్షణ నైవేద్యాలు: మీ ఊహకు అందని ఆచారాలు!

వీడియోలు

Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
Changes In Team India Support Staff | టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌పై బిసిసిఐ వేటు
India Fielding Coach T Dilip Emotional Post | ఫీల్డింగ్ కోచ్‌గా ముగిసిన దిలీప్ ప్రయాణం
Virat Kohli World Record | వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ
Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Harish Rao Black Magic Row: క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
Udhayanidhi Stalin Bail: త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
Air India Phuket Delhi Flight: ఆకాశంలోనే షేక్ అయిన ఎయిర్ ఇండియా ఫుకెట్-ఢిల్లీ విమానం, ప్రయాణికులకు గాయాలు!
ఆకాశంలోనే షేక్ అయిన ఎయిర్ ఇండియా ఫుకెట్-ఢిల్లీ విమానం, ప్రయాణికులకు గాయాలు!
Udhayanidhi Stalin Reaction: అరెస్టు చేసిన తర్వాత ఉదయనిధి స్టాలిన్ తొలి రియాక్షన్ ఏంటి?
అరెస్టు చేసిన తర్వాత ఉదయనిధి స్టాలిన్ తొలి రియాక్షన్ ఏంటి?
శ్రీశైలంలో ఆ మూడు రోజులు స్పర్శ దర్శనం ఉండదు!
శ్రీశైలంలో ఆ మూడు రోజులు స్పర్శ దర్శనం ఉండదు!
Crime News: 30 సెకన్లలో 34 కత్తిపోట్లు! స్కూల్‌లోనే టీచర్‌ను పొడిచిన ముసుగు వ్యక్తి!
30 సెకన్లలో 34 కత్తిపోట్లు! స్కూల్‌లోనే టీచర్‌ను పొడిచిన ముసుగు వ్యక్తి!
Udhayanidhi Arrest: ఉదయనిధి అరెస్టుకు కారణం ఏంటీ? టీవీకే చేసిన ఫిర్యాదులో ఏముంది?
ఉదయనిధి అరెస్టుకు కారణం ఏంటీ? టీవీకే చేసిన ఫిర్యాదులో ఏముంది?
Udhayanidhi Arrest: ఉదయనిధి వివాదంపై మద్రాసు హైకోర్టుకు డీఎంకే! కీలక ఆదేశాలు వచ్చేలోపే అరెస్టు!
ఉదయనిధి వివాదంపై మద్రాసు హైకోర్టుకు డీఎంకే! కీలక ఆదేశాలు వచ్చేలోపే అరెస్టు!
Embed widget