Hanuman: అనారోగ్యం, శనిబాధలు తొలగిపోవాలంటే మంగళవారం ఇలా చేయండి
పిల్లల నుంచి పెద్దల వరకూ అందరికీ ఆంజనేయుడంటే భలే ఇష్టం , అంతకు మించిన భక్తి. రామభక్తుడిని పూజిస్తే గ్రహదోషాలు తొలగిపోతాయని, ధైర్యం, బలం వస్తుందని భక్తుల విశ్వాసం. అందుకే పలు విధాలుగా పూజిస్తారు.
వాయుపుత్రుడికి రకరకాల పూజలు చేస్తారు. వాటిలో ఒకటి తమలపాకులతో పూజ. ఆంజనేయుడికి తమలపాకులతో పూజ చేయడం వెనుక పురాణాల్లో ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి.
సీతాదేవి దీవించిందని
సీతాదేవిని రావణుడు అపహరించిన తర్వాత...రాముడు సీతాదేవికోసం అన్వేషణ మొదలెట్టాడు. రాముడి అన్వేషణలో సాయడపడుతోన్న హనుమంతుడు అశోకవనంకి వెళతాడు. అక్కడి నుంచి తిరిగి బయలుదేరే సమయంలో ఆంజనేయుడిని ఆశీర్వదించే ప్రయత్నం చేస్తుంది. అక్కడ చుట్టుపక్కలా ఎక్కడా కూడా సీతమ్మకి పుష్పాలు దొరకకపోవడంతో పుష్పాలకు బదులుగా తమలపాకు కోసి ఆంజనేయుని తలమీద పెట్టి దీవిస్తుంది. ఆ ఆనందంలో కిష్కిందకు వెళ్లిన తర్వాత కూడా వానరులంతా తమలపాకు తీగలతో సన్మానం చేస్తారు. అప్పటి నుంచీ తమలపాకులతో పూజిస్తే కోరిన వరాలు గుమ్మరిస్తాడని చెబుతారు.
Also Read: శరీరంలో ఏడు చక్రాలకి - తిరుమల ఏడుకొండలకి ఏంటి సంబంధం
రాముడు చెప్పాడని
ఒకసారి సీతాదేవి అందించే తమలపాకుల చిలుకల్ని సేవిస్తున్న శ్రీరాముడి దగ్గరకు వచ్చిన ఆంజనేయుడు స్వామీ మీ నోరు అంత ఎర్రగా ఉందేంటని అడుగుతాడు. అప్పుడు రాముడు ‘తమలపాకులు తింటే నోరు ఎర్రగా అవుతుంది. ఆరోగ్యానికి కూడా చాలామంచిదని చెప్పాడట'' వెంటనే ఆంజనేయుడు అక్కడినుంచి వెళ్లిపోయి కొద్ది సేపటి తర్వాత తమలపాకులు వళ్లంతా కట్టుకుని గెంతులు వేస్తూ సంతోషంగా వచ్చాడట.
రుద్రుడు ఆగ్రహం-తమలపాకులు శాంతం
ఆంజనేయస్వామి రుద్రసంభూతుడు. రుద్రుడు ఆగ్రహానికి ప్రతిరూపం అయితే... తమలపాకులు శాంతినిస్తాయి. అందుకే తమలపాకులతో పూజించడం వలన మనసు ప్రశాంతంగా ఉంటుందని విశ్వసిస్తారు. తమలపాకులకు మరోపేరు నాగవల్లీదళాలు. అందుకే నాగదోష శాంతి కూడా జరుగుతుంది.
Also Read: అఖండ సినిమాలో బాలయ్య చెప్పిన చక్రాలు విన్నారు కదా-అవేంటో తెలుసా
తమలపాకులతో పూజ చేస్తే ఫలితాలు
- రోగాలతో ఇబ్బంది పడేవారు తమల పాకుల హారాన్ని ఆంజనేయస్వామికి వేస్తే ఉపశమనం ఉంటుంది
- మంత్ర సంబంధమైన పీడలు తొలగిపోతాయి.
- స్వామికి తమల పాకుల హారాన్ని వేయిస్తే సంసారంలో కలతలు తొలగిపోతాయి
- అనారోగ్యం బారిన పడిన పిల్లల పేరుమీద వాయుపత్రుడికి తమలపాకు మాల వేస్తే వారు కోలుకుంటారు
- నష్టాల్లో వ్యాపారులు ఇబ్బందుల నుంచి బయటపడతారు
- శని దోషం వెంటాడుతున్నవారు తమలపాకు మాల సమర్పిస్తే శనీశ్వరుడి ప్రభావం తగ్గుతుంది.
- సుందర కాండ పారాయణం చేసి స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే అన్ని కార్యాల్లో విజయం సిద్ధిస్తుంది
- కోర్టు వివాదాలను ఎదుర్కొంటున్నవారు స్వామికి తమలపాకుల హారాన్ని వేసి ఆ ఆకులను ప్రసాదంగా తింటే జయం పొందుతారు.
ఇవి పురాణాల్లో, కొన్ని పుస్తకాల్లో ప్రస్తావించినవి, పండితుల నుంచి తెలుసుకున్న విషయాలు. వీటిని ఎంతవరకూ అనుసరించాలి అన్నది అన్నది పూర్తిగా మీ భక్తి విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది.