Panchamaha Patakalu: పంచ మహాపాతకాలు చుట్టుకుంటాయ్ అంటారు కదా, ఆ పాతకాలు ఏంటో తెలుసా

కొన్ని పదాలు విరివిగా వాడేస్తుంటాం. కొన్నిటికి అర్థాలు తెలిస్తే, మరికొన్నిటికి అర్థం తెలియకపోయినా ఆ సెన్స్ తెలుస్తుంది. అలాంటి పదాల్లో ఒకటి పంచమహాపాతకాలు. ఇంతకీ పంచమహాపాతకాలు అంటే ఏంటి...ఏవి..

FOLLOW US: 

మహా పాతకం అంటే నిష్కృతిలేనిది అని అర్థం. అంటే ఈ జన్మకు ఏం చేసినా ఈ పాపాలను కడుక్కోవడం కుదరదు.  వాటి ఫలితాన్ని అనుభవించి తీరాల్సిందే. కొన్ని పాపాలకు పరిహారం ఉంటుంది కానీ పంచమహాపాతకాలు అని చెప్పుకునే వీటికి మాత్రం ఎలాంటి నిష్కృతి ఉండదు.

అధర్వణ వేదంలో ప్రస్తావించిన పంచమహాపాతకాలు
1.తల్లిదండ్రులను దూషించడం
తల్లిదండ్రులను దూషించేవాడికి నిష్కృతి లేదు. దూషించడమే తప్పు అంటే ఇక హత్య చేస్తే ఆ పాపం జన్మజన్మలకీ కడుక్కోలేరు 

2. గురువుని ఏకవచనంలో పిలవడం
కలలో కూడా గురువుని ఏకవచనంతో పిలవడకూడదు. పిలిచారంటే తన మనసులో ఏమూలో అలా పిలవాలనే ఆలోచన వచ్చి ఉండాలి. మన ఆలోచనలే కలలకు ప్రతిరూపం అంటారు కదా. మరి కలలోనే గురువుని ఏకవచనంతో పిలవకూడదు అంటే వాస్తవంలో పిలిస్తే ఏమనుకోవాలి.  

3. తాగే నీటికి కలుషితం చేయడం- నడిచే దారిని మూసేయడం
పది మంది తాగే నీటిని కలుషితం చేయకూడదు... ఎందరో దాహం తీర్చే గంగను తాగేందుకు వీల్లేకుండా చేసిన పాపానికి ఏం చేసినా పరిహారం ఉండదు. ఇక అంతా నడిచే దారిని మూసేయడం మహాపాపం. గ్రామాల్లో కొన్ని ఊర్లలో ఒకరికి మరొకరితో తగాదాలు వచ్చినప్పుడు దార్లు కట్టేస్తుంటారు, ఇక కాంక్రీట్ జంగిల్లా మారిన పట్టణాల్లో పరిస్థితి చెప్పేదేముంది. దార్లేం ఖర్మ శ్మశానాలు వదలడం లేదు. ఈ రెండు పాపాలు చేస్తే ఆ పాపం పిల్లల భవిష్యత్, ఆరోగ్యంపై పడుతుంది. అది కూడా ఈ జన్మలోనే అనుభవించకతప్పదు. 

4. గోవుని అకారణంగా కొట్టడం
పెంచేవాడు, పని చేయించుకునేవాడు ఓ అవసరం కోసం గోవుని కంట్రోల్ చేయడం కోసం కొట్టొచ్చు..అది తప్పు కాదు. కానీ ఆకతాయిగా,ఎలాంటి అవసరం లేకుండా కొడితే  గోవు చర్మంపై ఎన్ని రోమాలు ఉంటాయో అన్ని జన్మలు ఎత్తినా ఆ పాపం వెంటాడుతూనే ఉంటుంది.
Also Read: ఆంజనేయుడిని పూజిస్తే శనిప్రభావం ఎందుకు తగ్గుతుంది 

5.ఆత్మహత్య
పరమేశ్వర స్వరూపంలో జీవుడిని ఇచ్చింది తండ్రి... శరీరాన్ని తయారు చేసింది తల్లి. అంటే ఈ శరీరం మన సొంతం కాదు. ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే ఓ అద్దె ఇంట్లో ఉంటూ యజమానికి తెలియకుండా ఆ ఇల్లు అమ్మేయడం అన్నమాట. అంటే నీది కాని ఆస్తిని, యజమానికి తెలియకుండా నువ్వు అమ్ముకోవడం అని అర్థం. మొదటి నాలుగు పాపాలకు ఆ జీవుడు మాత్రమే అనుభవిస్తాడు. కానీ ఆత్మహత్య చేసుకుంటే మాత్రం అటు ఐదు తరాలు, ఇటు ఐదు తరాలు సర్వనాశనం అయిపోతాయ్. ( మహాపాతకాల్లో అత్యంత ముఖ్యమైన ఆత్మహత్యా పాతకం గురించి ప్రత్యేక కథనంలో ఉదాహరణలతో సహా చెప్పుకుందాం)

బ్రహ్మపురాణం ప్రకారం పంచమహాపాతకాలు  
1.స్త్రీ హత్య ( స్త్రీ ని చంపడం)
2. శిశు హత్య ( పిల్లల్ని చంపడం)
3. గో హత్య ( ఆవుని చంపడం)
4. బ్రహ్మ హత్య ( వేదం చదువుకున్న బ్రాహ్మణుడిని చంపడం)
5. స్వర్ణస్తేయము ( బంగారం దొంగిలించడం)
Also Read: శనివారం సాయంత్రం ఈ చెట్టుకింద దీపం వెలిగిస్తే జాతకంలో దోషాలు తొలగిపోతాయి

Published at : 12 Mar 2022 06:36 AM (IST) Tags: pancha maha patakams panchamahaa paatakam panchamaha yagam pancha maha pathakalu panchapatakam pancha maha about pancha maha pathakalu pancha maha pathakalu in telugu pancha maha pathakaalu ela వస్తాయి brahma hatya pathakam panchakanya stuti

సంబంధిత కథనాలు

Gorintaku: గోరింట ఆషాడమాసంలోనే ఎందుకంత ప్రత్యేకం, దీని పుట్టుక వెనుక ఇంత కథ ఉందా!

Gorintaku: గోరింట ఆషాడమాసంలోనే ఎందుకంత ప్రత్యేకం, దీని పుట్టుక వెనుక ఇంత కథ ఉందా!

Panchang 8th July 2022: జులై 8 శుక్రవారం తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, శుక్రవారం పఠించాల్సిన మహాలక్ష్మి అష్టకం

Panchang 8th July 2022: జులై 8 శుక్రవారం తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం,  శుక్రవారం పఠించాల్సిన మహాలక్ష్మి అష్టకం

Tholi Ekadashi 2022: జులై 10 తొలి ఏకాదశి, ఈ రోజు ఉపవాసం ఉంటే మంచిదని ఎందుకంటారు!

Tholi Ekadashi 2022: జులై 10 తొలి ఏకాదశి, ఈ రోజు ఉపవాసం ఉంటే మంచిదని ఎందుకంటారు!

Horoscope7th July 2022: ఈ రాశివారు కెరీర్‌లో ఎదురైన సమస్యలను అధిగమిస్తారు, జులై 7 గురువారం రాశిఫలాలు

Horoscope7th July  2022:  ఈ రాశివారు కెరీర్‌లో ఎదురైన సమస్యలను అధిగమిస్తారు,  జులై 7 గురువారం రాశిఫలాలు

Horoscope 6th July 2022: ఈ రాశులవారి దృష్టి తప్పుడు కార్యకలాపాలపైకి మళ్లుతుంది , జులై 6 బుధవారం రాశిఫలాలు

Horoscope 6th July  2022:  ఈ రాశులవారి దృష్టి తప్పుడు కార్యకలాపాలపైకి మళ్లుతుంది , జులై 6 బుధవారం రాశిఫలాలు

టాప్ స్టోరీస్

2024 Elections India: రాజ్యసభ నామినేషన్లు, సౌత్ ఇండియా మిషన్‌లో భాగమేనా? భాజపా స్ట్రాటెజీలు రెడీ!

2024 Elections India: రాజ్యసభ నామినేషన్లు, సౌత్ ఇండియా మిషన్‌లో భాగమేనా? భాజపా స్ట్రాటెజీలు రెడీ!

UK Prime Minister Resignation: బ్రేకింగ్ న్యూస్- బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ రాజీనామా!

UK Prime Minister Resignation: బ్రేకింగ్ న్యూస్- బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ రాజీనామా!

Why Nagababu Target Modi : మోదీపైనా నాగబాబు సెటైర్లు ! జనసేన డైరక్ట్‌గానే చెబుతోందా ?

Why Nagababu Target Modi : మోదీపైనా నాగబాబు సెటైర్లు ! జనసేన డైరక్ట్‌గానే చెబుతోందా ?

Balakrishna: బాలయ్య సినిమాలో సిస్టర్ సెంటిమెంట్ - యాక్షన్ తో పాటు ఎమోషన్ కూడా!

Balakrishna: బాలయ్య సినిమాలో సిస్టర్ సెంటిమెంట్ - యాక్షన్ తో పాటు ఎమోషన్ కూడా!