![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
hanuman jayanti 2022: ఆంజనేయుడిని పూజిస్తే శనిప్రభావం ఎందుకు తగ్గుతుంది
శనీ ప్రభావం నుంచి బయటపడడం అంత సులభమేం కాదు. ఇద్దరు ముగ్గురు దేవతలు మినహా ఎవ్వరూ కూడా ఈ ప్రభావం నుంచి తప్పించుకోలేకపోయారు. మరి ఆంజనేయుడు ఎలా తప్పించుకున్నాడు. శని-హనుమ మధ్య ఏం జరిగింది.
![hanuman jayanti 2022: ఆంజనేయుడిని పూజిస్తే శనిప్రభావం ఎందుకు తగ్గుతుంది hanuman jayanti 2022: Why the effect of Saturn decreases if Anjaneya is worshiped, STORY OF HANUMAN AND SHANI DEV hanuman jayanti 2022: ఆంజనేయుడిని పూజిస్తే శనిప్రభావం ఎందుకు తగ్గుతుంది](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/07/3fd8904bae53d9c03b76cacf781a6d3f_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
హనుమంతుడిని పూజిస్తే శని ప్రభావం ఎందుకు తగ్గుతుంది...దీనిపై పురాణాల్లో ఓ కథనం ప్రచారంలో ఉంది.
రామాయణ గాథ ప్రకారం రావణుడి చెరలో ఉన్న సీతాదేవిని తీసుకొచ్చేందుకు వారధి నిర్మిస్తుంటారు వానరులు. హనుమంతుడి సారధ్యంలో రాళ్లపై శ్రీరామ అని రాస్తూ వారధి కడుతుండగా ఆ సమయంలో అక్కడకు వెళ్తాడు శని. అయితే వంతెన నిర్మాణానికి సాయంగా వచ్చాడేమో అనుకుంటాడు హనుమంతుడు. నీపై నా ప్రభావం చూపించేందుకు వచ్చానంటూ అసలు విషయం నెమ్మదిగా వివరిస్తాడు శనీశ్వరుడు. శని డిసైడ్ అయ్యాక ప్రభావం తగ్గించుకోవడం మినహా తప్పించుకోవడం సాధ్యం కాని పని. అందుకే చేసేది లేక ఆంజనేయుడు సరే అన్నాడు. వెంటనే హనుమంతుడి తలపై కూర్చున్నాడు శని.
వెంతెన నిర్మాణానికి తలపై రాళ్లు మోస్తున్న హనుమాన్ కి శని అడ్డంకిగా అనిపించాడని దీంతో.. స్వామికార్యంలో ఉన్న సమయంలో పనికి అంతరాయం కలుగుతోందని తలను వదిలి కాళ్లు పట్టుకోవాలని చెప్పాడట ఆంజనేయుడు. సమ్మతించిన శనీశ్వరుడు ఆంజనేయుని కాళ్లు పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ హనుమంతుడు తనకున్న బలంతో శనీశ్వరుని తన పాదాల కింద అణచివేయడంతో ఆంజనేయుడిని పట్టుకోవడం వీలు కాలేకపోయింది. ఆ సమయంలో శనీశ్వరుడు విముక్తి కలిగించు..ఇంకెప్పుడూ నీ జోలికి రానని వేడుకున్నాడట. పైగా నిన్ను భక్తితో పూజించే వారిపై ప్రభావం చూపనన్నాడని చెప్పడంతో హనుమంతుడు శనిని విడిచి పెట్టాడని పురాణ కథనం. అలా శనీశ్వరుడి చెర నుంచి హనుమంతుడు తప్పుకోవడంతో పాటూ తన భక్తులను కూడా తప్పించాడు.
Also Read: పురాణ కాలంలో మహిళా సాధికారికతకు నిదర్శనం ఈ ఐదుగురు
ఈ కథాంశాన్ని పేర్కొంటూ చిత్రీకరించిన చిత్రలేఖనాలు తమిళనాడు చెంగల్పట్టు కోదండరాముని ఆలయంలో ఉన్నాయట. ఏలినాటి శని ప్రభావంలో ఉన్న జాతకులు హనుమంతునిని స్తుతిస్తే.. వారిపై శనిగ్రహం ప్రభావం తగ్గుతుందని చెబుతారు. ఆంజనేయుడికి రామనామం అంటే ప్రీతి. ఆ మంత్రాన్ని జపించినవారిపైనా హనుమాన్ కరుణ ఉంటుంది.
1.మనోజవం మారుత తుల్యవేగం
జితేంద్రియం బుద్ధిమతాం పరిష్టమ్ !
వాతాత్మజం వానరయూధ ముఖ్యం
శ్రీరామదూతం శిరసా సమామి !!
2.''ఓం ఆంజనేయాయ విద్మహే
వాయుపుత్రాయ ధీమహి
3. హనుమంతం వాయుపుత్రం నమామి బ్రహ్మచారిణమ్
త్రిమూరత్యాత్మక మాత్మస్థం జపాకుసుమ సన్నిభమ్
నానాభూషణ సంయుక్తం ఆంజనేయం నమామ్యహమ్
పంచాక్షర స్థితం దేవం నీల నీరద సన్నిభమ్..!!
ప్రతిరోజూ హనుమంతుడిని భక్తిశ్రద్ధలతో పూజించినట్లయితే... బుద్ధిబలం, ధైర్యం సిద్ధిస్తాయంటారు ఆధ్యాత్మిక పండితులు. ఈ ఏడాది హనుమాన్ జయంతి (Hanuman Jayanti) ఏప్రిల్ 16 శనివారం వచ్చింది.
Also Read: సెల్ప్ రెస్పెక్ట్ కి ఇంతకన్నా నిదర్శనం ఎవరుంటారు, అందుకే ఆమె తరతరాలకు ఆదర్శం
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)