అన్వేషించండి

Tribanadhari Barbaric: 3 బాణాల్లో కురుక్షేత్ర సంగ్రామాన్ని ముగించగల 'బర్బరీకుడు' ప్రాణత్యాగం ఎందుకు చేశాడు?

Tribanadhari Barbarik Story: మైథలాజికల్ బ్యాక్ డ్రాప్ లో ఉన్న మూవీస్ కి ఇప్పుడు మంచి ఆదరణ లభిస్తోంది. ఈ కోవకు చెందినదే ‘త్రిబాణధారి బార్బరిక్’. ఇంతకీ ఎవరీ బర్బరీకుడు? మహాభారతంలో తన క్యారెక్టర్ ఏంటి?

The Untold Story of Barbarik Mahabharat  : మోహన్ శ్రీవత్స దర్శకత్వంలో వచ్చిన  ‘త్రిబాణధారి బార్బరిక్’ మూవీలో సత్య రాజ్, వశిష్ట ఎన్ సింహా, ఉదయభాను ప్రధానపాత్రల్లో నటించారు. ఈ సినిమా టైటిట్ గా పెట్టిన త్రిబాణధారి బర్బరికుడు ఎవరు? మహాభారతంలో తన క్యారెక్టర్ ఏంటి? 

Tribanadhari Barbaric: 3 బాణాల్లో కురుక్షేత్ర సంగ్రామాన్ని ముగించగల 'బర్బరీకుడు' ప్రాణత్యాగం ఎందుకు చేశాడు?

మహాభారతంలో పాత్రల గురించి చెప్పుకుంటే ఒకటా రెండా వందల పాత్రలు..ప్రతి క్యారెక్టర్ కి ఓ ప్రత్యేకత. ఇలాంటి వందల పాత్రల్లో ఒకడు  బర్బరీకుడు. భీముడి మనవడు, ఘటోత్కచుని కుమారుడే బర్బరీకుడు. తల్లి పేరు మౌర్వి. చిన్నప్పటి నుంచే యుద్ధ విద్యలో అపార ప్రతిభ కనబర్చేవాడు. అస్త్రశస్త్రాల మీదున్న పట్టుచూసి దేవతలు ముచ్చటపడి మూడు బాణాలు అందించారు. ఆ 3 బాణాలతో ముల్లోకాల్లోనూ తిరుగులేదనే వరాన్నిచ్చారు.

ఓ పక్క బర్బరీకుడు పెరుగుతుండగా..కురుక్షేత్రం సంగ్రామం ఆరంభమైంది. భరతఖండంలో ఉన్న వీరులంతా ఎవరో ఒకరివైపు నిల్చోవాల్సిన తరుణం వచ్చింది. అలాంటి సమయంలో బర్బరీకుడు కూడా సంగ్రామానికి బయలుదేరాడు. తనయుడి బలం తెలిసిన తల్లి మౌర్వి.. ఏ పక్షం బలహీనంగా ఉందో వారికి నీ సహాయాన్ని అందించమని చెబుతుంది. సంఖ్యాపరంగా చూస్తే పాండవుల పక్షం బలహీనంగా కనిపిస్తోంది కానీ యుద్ధం మొదలయ్యాక లెక్కలు మారిపోతాయ్. అప్పుడు బర్బరీకుడు కౌరవుల పక్షాన నిలవాల్సి రావొచ్చు. అంతటి యోధుడు కురుక్షేత్ర సంగ్రామంలో ఉంటే ఫలితాలు తారుమారైపోతాయని గ్రహిస్తాడు శ్రీ కృష్ణుడు. అందుకే బర్బరీకుడిని వారించేందుకు సిద్ధమవుతాడు.

Tribanadhari Barbaric: 3 బాణాల్లో కురుక్షేత్ర సంగ్రామాన్ని ముగించగల 'బర్బరీకుడు' ప్రాణత్యాగం ఎందుకు చేశాడు?

బ్రాహ్మణుడి రూపంలో బర్బరీకుడికి ఎదురుపడి...మూడు బాణాలు తీసుకుని ఎక్కడికి బయలుదేరుతున్నావ్ అని ఎగతాళిగా అడుగుతాడు శ్రీ కృష్ణుడు. యుద్ధాన్ని ముగించడానికి ఈ మూడు బాణాలే చాలంటాడు. 

మొదటి బాణం ఎవర్ని శిక్షించాలో గుర్తిస్తుంది.. 
రెండో బాణం ఎవర్ని రక్షించాలో గుర్తిస్తుంది..
మూడో బాణం శిక్షను అమలుపరుస్తుంది
 
యుద్ధాన్ని నిమిషంలో ముగించేందుకు ఈ 3 బాణాలు చాలని బదులిస్తాడు బర్బరీకుడు. 

నీ మాటలు నమ్మేలా లేవన్న కృష్ణుడు.. ఈ చెట్టుపై ఉన్న రావి ఆకులు గుర్తిస్తూ తొలిబాణం ప్రయోగించు అంటాడు..
 
ఆ బాణం చెట్టుమీద ఆకులపై తన గుర్తు వేసి.. ఆ తర్వాత కృష్ణుడి కాలిచుట్టూ తిరగడం మొదలుపెడుతుంది. మీ కాలి కింద ఓ ఆకు ఉన్నట్టుంది మీ పాదాన్ని పక్కకు తీయండి అని చెప్పాడు బర్బరీకుడు. శ్రీ కృష్ణుడు తన పాదాన్ని పక్కకి జరపగానే అక్కడ ఆకు ఉండడాన్ని గమనించి ఆశ్చర్యపోతాడు. ఇంత ప్రతిభ ఉన్న బర్బరీకుడు యుద్ధరంగంలో ఉంటే ఏమన్నా ఉందా అని ఆలోచిస్తాడు. పొరపాటున పాండవులకు వ్యతిరేకంగా యుద్ధం చేయాల్సి వస్తే..పాండవులు తప్పించుకోలేరని గ్రహిస్తాడు.  బర్బరీకా! నువ్వు బలహీనుల పక్షాన పోరాడితే నువ్వు సహాయం చేసిన పక్షం వెంటనే బలమైనది అయిపోతుంది. అప్పుడు యుద్ధ భూమిలో నువ్వు తప్ప ఎవ్వరూ మిగలరు అంటాడు. 

Tribanadhari Barbaric: 3 బాణాల్లో కురుక్షేత్ర సంగ్రామాన్ని ముగించగల 'బర్బరీకుడు' ప్రాణత్యాగం ఎందుకు చేశాడు?

వచ్చినవాడు బ్రాహ్మణుడు కాదు శ్రీ కృష్ణుడు అని గ్రహించిన బర్బరీకుడు నీకు ఏం కావాలో కోరుకో అంటాడు. మహా భారత యుద్ధం ప్రారంభానికి ముందు ఓ వీరుడి తల కావాలని చెబుతాడు. తనను బలి ఇచ్చుకునేందుకు సిద్ధపడతాడు బర్బరీకుడు. అయితే తనకు కురుక్షేత్ర సంగ్రామాన్ని చూడాలనే కోరిక ఉందని ఆ భాగ్యం కల్పించాలని కోరుతాడు. అలా మహావీరుడైన బర్బరీకుడి తల కురుక్షేత్ర సంగ్రామానికి సాక్ష్యంగా మిగిలిపోతుంది. 

ఇలా చేయడం అన్యాయం కదా అని అనిపించవచ్చు.. కానీ శ్రీ కృష్ణుడు ఆ కోరిక కోరడం వెనుక మరో కథనం ప్రచారంలో ఉంది. 

బర్బరీకుడు గడిచిన జన్మలో శాపగ్రస్తుడైన యక్షుడు..శాప విమోచనం  కలిగించేందుకే తన తలను కోరాననీ వివరిస్తాడు కృష్ణుడు. కలియుగంలో బర్బరీకుడిని పూజిస్తారని..తన పేరు తల్చుకుంటేనే భక్తుల కష్టాలు చిటికెలో తొలగిపోతాయని వరమిస్తాడు కృష్ణుడు. 

మరో కథనం ప్రకారం.. 

బర్బరీకుడి బాణం శ్రీకృష్ణుని కాలి చుట్టూ తిరగడం వల్ల...మిగిలిన శరీర భాగాల కన్నా పాదం బలహీనపడిందని... ద్వాపరయుగాంతం సమయంలో అందుకే ఆ కాలికే బాణం గుర్చుకుందని చెబుతారు.

Tribanadhari Barbaric: 3 బాణాల్లో కురుక్షేత్ర సంగ్రామాన్ని ముగించగల 'బర్బరీకుడు' ప్రాణత్యాగం ఎందుకు చేశాడు?
 
దక్షిణాదిన బర్బరీకుడి గురించి పెద్దగా తెలియదు..ఉత్తరాదిన ఖాటు శ్యాం పేరుతో ఆరాధిస్తారు. బర్బరీకుడిని పూజిస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం.

గమనిక: పురాణ గ్రంధాల్లో పేర్కొన్న వివరాలు, ఆధ్యాత్మికవేత్తలు చెప్పిన సమాచారం ఆధారంగా అందించిన కథనం ఇది. దీనిని ఎంతవరకూ విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Telangana Panchayat Elections 2025:తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ గ్రామ పంచాయతీ పోలింగ్‌- లెక్కింపు ప్రారంభం
తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ గ్రామ పంచాయతీ పోలింగ్‌- లెక్కింపు ప్రారంభం
Hyderabad Crime News: హైదరాబాద్‌లోని యువకుడి హత్య కేసులో ఊహించని ట్విస్ట్! సంచలన విషయాలు వెల్లడించిన యువతి తల్లి!
హైదరాబాద్‌లోని యువకుడి హత్య కేసులో ఊహించని ట్విస్ట్! సంచలన విషయాలు వెల్లడించిన యువతి తల్లి!
Tirupati Outer Ring Road: తిరుపతి వాసులకు గుడ్ న్యూస్- ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే ప్రతిపాదనపై సర్వే ప్రారంభం
తిరుపతి వాసులకు గుడ్ న్యూస్- ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే ప్రతిపాదనపై సర్వే ప్రారంభం

వీడియోలు

నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్
North Pole vs South Pole | ధృవాల గురించి ఈ విషయాలు తెలుసుకుంటే షాక్ అయిపోతారు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Telangana Panchayat Elections 2025:తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ గ్రామ పంచాయతీ పోలింగ్‌- లెక్కింపు ప్రారంభం
తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ గ్రామ పంచాయతీ పోలింగ్‌- లెక్కింపు ప్రారంభం
Hyderabad Crime News: హైదరాబాద్‌లోని యువకుడి హత్య కేసులో ఊహించని ట్విస్ట్! సంచలన విషయాలు వెల్లడించిన యువతి తల్లి!
హైదరాబాద్‌లోని యువకుడి హత్య కేసులో ఊహించని ట్విస్ట్! సంచలన విషయాలు వెల్లడించిన యువతి తల్లి!
Tirupati Outer Ring Road: తిరుపతి వాసులకు గుడ్ న్యూస్- ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే ప్రతిపాదనపై సర్వే ప్రారంభం
తిరుపతి వాసులకు గుడ్ న్యూస్- ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే ప్రతిపాదనపై సర్వే ప్రారంభం
Pragathi : సరదాగా అనుకున్నా... డెడికేషన్‌తో ఇంటర్నేషనల్ మెడల్స్ సాధించారు - నటి ప్రగతిపై నాగబాబు ప్రశంసలు
సరదాగా అనుకున్నా... డెడికేషన్‌తో ఇంటర్నేషనల్ మెడల్స్ సాధించారు - నటి ప్రగతిపై నాగబాబు ప్రశంసలు
Amaravati: అమరావతిని రాజధానిగా నోటిఫై చేయడానికి కేంద్రం మెలిక పెట్టిందా? బిల్లును వెనక్కి పంపించిందా?
అమరావతిని రాజధానిగా నోటిఫై చేయడానికి కేంద్రం మెలిక పెట్టిందా? బిల్లును వెనక్కి పంపించిందా?
The Raja Saab : 'అఖండ 2'తో మోగ్లీ రావడం అదృష్టం - ఫ్రస్టేషన్ ఎందుకు తమ్ముడు?... డైరెక్టర్ మారుతి స్పీచ్ హైలెట్స్
'అఖండ 2'తో మోగ్లీ రావడం అదృష్టం - ఫ్రస్టేషన్ ఎందుకు తమ్ముడు?... డైరెక్టర్ మారుతి స్పీచ్ హైలెట్స్
Chandrababu: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర అసహనం - జాబితాలో పవన్, లోకేష్ కూడా ఉన్నట్లేనా ?
మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర అసహనం - జాబితాలో పవన్, లోకేష్ కూడా ఉన్నట్లేనా ?
Embed widget