Ganesh Visarjan 2025 : గణేష్ నిమజ్జనంపై గ్రహణం నీడ? వినాయక నిమజ్జనం ఎప్పుడు? గ్రహణం రోజు గణపయ్యను సాగనంపొచ్చా?
Ganesh Idols Immersion : ఈ ఏడాది అనంత చతుర్దశి 2025 సెప్టెంబర్ 6న వచ్చింది. గణేష్ నిమజ్జనం కూడా ఇదే రోజు నిర్వహిస్తారు. సెప్టెంబర్ 7న గ్రహణం వచ్చింది.. ఈ ప్రభావం నిమజ్జనంపై ఉంటుందా?

Lunar Eclipse Effect on Ganesh Idols Immersion: భాద్రపద మాసం శుక్ల పక్ష చతుర్దశి రోజున గణేష్ విగ్రహాన్ని నిమజ్జనం చేస్తారు. సెప్టెంబర్ 6, 2025, శనివారం నాడు అనంత చతుర్దశి పండుగ జరుపుకుంటారు. ఈ రోజున గణేష్ నిమజ్జనం కూడా చేస్తారు.
సెప్టెంబర్ 07న సంపూర్ణ చంద్రగ్రహణం రావడంతో ...ఆ ప్రభావం నిమజ్జనంపై పడుతుందా? లేదా అనే చర్చ జరుగుతోంది.
సాధారణంగా తిథులు తగులు మిగులు ఉంటాయి.. ముందు రోజు నుంచి పౌర్ణమి ఘడియలున్నట్టైతే అదే రోజు ఆ ప్రభావం నిమజ్జనంపై పడుతుంది. గ్రహణ సమయం, సూతకాలం పాటించాల్సిన సమయంలో వినాయక విగ్రహాలు నిమజ్జనం చేయకూడదు. అయితే ఈ ఏడాది పౌర్ణమి ఘడియలు సెప్టెంబర్ 06 శనివారం అర్థరాత్రి ప్రారంభమయ్యాయి..అందుకే ఈ ప్రభావం నిమజ్జనంపై పడదు. ఎలాంటి సందేహాలు లేకుండా సెప్టెంబర్ 06 శనివారం నిమజ్జన వేడుకలు నిర్వహించుకోవచ్చు. సెప్టెంబర్ 7న చంద్రగ్రహణం కారణంగా ముందురోజు లేదంటే సెప్టెంబర్ 08, 12 తేదీల్లో నిమజ్జనం చేసుకోవచ్చు.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పర్యావరణ హిత నిమజ్జన ఏర్పాట్లపై ప్రత్యంగా దృష్టి సారించింది. భక్తులకు సౌకర్యవంతమైన, సురక్షితమైన ఉత్సవ వాతావరణాన్ని అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. సెప్టెంబర్ 6 శనివారం అనంత చతుర్దశి రోజు హైదరాబాద్ హుస్సేన్ సాగర్ సహా వివిధ నీటి వనరులలో నిమజ్జనం జరుగుతుంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఈ ఏడాది 28 పోర్టబుల్ వాటర్ ట్యాంకులు, 21 ఎక్స్‌కవేషన్ పాండ్స్, 29 బేబీ పాండ్స్‌ను ఏర్పాటు చేసింది. దక్షిణ మధ్య రైల్వే గణేష్ నిమజ్జనం సందర్భంగా భక్తుల సౌకర్యార్థం సెప్టెంబర్ 6-7, 7-8 తేదీల్లో రాత్రి 10 నుంచి తెల్లవారుజాము 4 గంటల వరకు ప్రత్యేక MMTS రైళ్లు ను నడుపుతోంది.
ప్రపంచానికి రక్షకుడైన అనంత చతుర్దశి పండుగ
ఈసారి భాద్రపద మాసంలోని శుక్ల పక్ష చతుర్దశి తిథి సెప్టెంబర్ 6వ తేదీ అర్ధరాత్రి 3:12 గంటలకు ప్రారంభమవుతుంది. అదేవిధంగా సెప్టెంబర్ 7వ తేదీ అర్ధరాత్రి 1:41 గంటలకు భాద్రపద మాసం శుక్ల పక్ష చతుర్దశి తిథి ముగుస్తుంది. సెప్టెంబర్ 6న దేశవ్యాప్తంగా అనంత చతుర్దశి జరుపుకుంటారు. ఈ పండుగ జగత్తును పోషించే శ్రీ మహావిష్ణువుకు అంకితం చేయబడింది. ఈ రోజున శ్రీ విష్ణువుతో పాటు లక్ష్మీదేవిని కూడా పూజిస్తారు. దీనితో పాటు రక్షా సూత్రాన్ని కూడా కడతారు. లక్ష్మీ నారాయణులను పూజించడం వల్ల జీవితంలో సుఖసంతోషాలు, సౌభాగ్యం లభిస్తాయి.
అనంత చతుర్దశి శుభ యోగం (Anant Chaturdashi Shubh Yog 2025)
అనంత చతుర్దశి సందర్భంగా సుకర్మ, రవి శుభ యోగం ఏర్పడుతోంది. దీనితో పాటు ధనిష్ట, శతభిషా నక్షత్రాల కలయిక ఏర్పడుతోంది. భాద్రపద మాసంలోని శుక్ల పక్ష చతుర్దశి తిథి నాడు పూజ చేయడానికి రోజంతా శుభప్రదంగా ఉంటుంది. సాధకులు తమ సమయం ప్రకారం ఎప్పుడైనా లక్ష్మీ నారాయణులను పూజించవచ్చు.
అనంత చతుర్దశి రోజున గణేష్ ఉత్సవం కూడా ముగుస్తుంది. ఈరోజు నిమజ్జనోత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు. పురాణాల ప్రకారం, ఎవరైనా ఈ రోజున శ్రద్ధతో, నియమాలతో వ్రతం చేస్తే కోరుకున్న కోరికలు నెరవేరడంతో పాటు శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కూడా లభిస్తుందని నమ్మకం.
గమనిక: ఆధ్యాత్మిక వేత్తలు సూచించిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల్లో పేర్కొన్న సమాచారం ఆధారంగా అందించిన కథనం ఇది. దీనిని ఎంతవరకూ విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం. సమాచారాన్ని పరిగణలోకి తీసుకునేముందు మీరు విశ్వశించే పండితుల సలహాలు స్వీకరించండి






















