Goddess Swaha Devi : హోమంలో 'స్వాహా' అని ఎందుకు అంటారు? ఈ పేరు ఉచ్ఛరించకుండా ఆహుతి ఎందుకు ఇవ్వరు?
Goddess Swaha Devi Havan: దే హోమంలో దేవతలకు ఆహుతులు సమర్పిస్తారు. ఆ సమయంలో స్వాహా అని పఠించిన తర్వాతే సమర్పిస్తారు..ఇంతకీ ఎవరు స్వాహాదేవి?

Story Of Swaha Devi : 'హవన్' హిందూ ధర్మంలో పురాతన సాంప్రదాయం. హవన్ లో పవిత్ర అగ్నిని సాక్షిగా భావించి మంత్రోచ్ఛారణతో దేవతలకు ఆహుతి ఇస్తారు. హవనం ఉద్దేశ్యం వాతావరణాన్ని శుద్ధి చేయడం, మానసిక శాంతి, ఆధ్యాత్మిక అభివృద్ధి , భగవంతుని అనుగ్రహం పొందడం.
హిందూ ధర్మంలో హవనం సాంప్రదాయం పురాతన కాలం నుంచి ఇప్పటి వరకు కొనసాగుతోంది.
నవగ్రహ శాంతి, గృహ ప్రవేశం, యజ్ఞం, ప్రత్యేక పర్వదినాలు లేదా సంస్కారాలలో హవన్ నిర్వహిస్తారు. హవనం గురించి మతపరమైన , శాస్త్రీయ ప్రయోజనాలు రెండూ ఉన్నాయి. హవన్ లో ఆహుతి ఇచ్చేటప్పుడు 'స్వాహా' అని చెప్పే సంప్రదాయం ఉంది. మీరు గమనించి ఉంటారు...హోమాలు చేసే సమయంలో మంత్రం పఠించిన తర్వాత అగ్నిలో ఆహుతి ఇచ్చేటప్పుడు స్వాహా అనే పదాన్ని తప్పనిసరిగా ఉచ్చరిస్తారు. ఇది కేవలం ఒక ధ్వని మాత్రమే కాదు, దీని వెనుక లోతైన మతపరమైన, పురాణ , ఆధ్యాత్మిక రహస్యం కూడా దాగి ఉంది.
హోమాగ్నిలో ఏమైనా వేసేముందు స్వాహా అని ఎందుకు అంటారో తెలుసుకుందాం.
స్వాహా అని చెప్పడానికి కారణం ఏంటి?
'స్వాహా' అనే పదానికి ఒక పురాణ కథ ఉంది, దాని ప్రకారం 'స్వాహా' ఒక దేవత పేరు, ఆమె అగ్నిదేవుని భార్య. పూర్వకాలంలో హవన్ , యజ్ఞం నిర్వహించినప్పుడు, దేవతలకు సమర్పించే ఆహుతులను రాక్షసులు మోసంతో అపహరించేవారు లేదంటే వాటికి ఆటంకం కలిగించేవారు. అటువంటి పరిస్థితిలో ఏ ఉద్దేశంతో యజ్ఞ యాగాలు తలపెట్టారో అవి నెరవేరేవి కాదు. ఈ సమస్యకు పరిష్కారం చూపిన స్వాహా దేవి అగ్ని దేవుడిని వివాహం చేసుకుంది. అప్పటి నుంచీ ఆహుతి సమయంలో స్వాహా అని ఉచ్చరించకుండా హవనం స్వీకరించరని నమ్ముతారు. స్వాహాదేవిని స్మరిస్తూ ఆహుతి సమర్పించినప్పుడే ఎలాంటి అడ్డంకులు లేకుండా యాగం పూర్తవుతుందని, అనుకున్నది నెరవేరుతుందనే విశ్వాసం. అంతేకాదు..స్వాహా అంటూ సమర్పించినప్పుడు మాత్రమే దేవతలకు యజ్ఞం యొక్క ఆహుతి చేరుతుంది. యజ్ఞాన్ని సురక్షితంగా పూర్తయ్యేలా సహకరిస్తుంది.
స్వాహా అర్థం , ప్రాముఖ్యత
స్వాహాను ఒక పవిత్ర మంత్రంగా భావిస్తారు, ఇది వేద మంత్రాలలో అంతర్భాగం. దీని అర్థం సంపూర్ణ భక్తి శ్రద్ధలతో సమర్పించబడిందని. స్వాహా అనే పదం అగ్నిలో సమర్పించిన ఏదైనా పదార్థం పూర్తి భక్తితో దేవతలకు చేరుతుందని సూచిస్తుంది. దీనితో పాటు, స్వాహా అనే పదం పవిత్రత, సమర్పణను కూడా సూచిస్తుంది. స్వాహా అని చెప్పేటప్పుడు ఒక ప్రత్యేక ధ్వని తరంగం ఉత్పత్తి అవుతుంది, ఇది యజ్ఞం ద్వారా వాతావరణాన్ని శుద్ధి చేస్తుంది, మంత్రం శక్తిని , ఆధ్యాత్మిక శక్తిని పెంచుతుంది.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం నమ్మకాలు ఆధారంగా సేకరించింది. ఆధ్యాత్మికవేత్తలు, పండితులు సూచించిన వివరాల ఆధారంగా రాసిన కథన ఇది. దీనిని ఎంతవరకూ విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం. వీటిని పరిగణలోకి తీసుకునేముందు,అమలు చేసేముందు మీకు నమ్మకమైన ఆధ్యాత్మికవేత్తల సలహాలు కూడా స్వీకరించండి.
ఆలయంలోకి ఫోన్ తీసుకెళ్లడం నిజంగా తప్పా! ఇది నియమమా - అపవిత్రమా?... పూర్తివివరాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి
ఆహారంలో వెంట్రుకలు కనిపిస్తున్నాయా? శని దేవుని హెచ్చరిక కావచ్చు! మీ జీవితంలో రావాల్సిన మార్పులు ఇవే!..పూర్తివివరాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి





















