Vastu Shastra: ఇంట్లో ఈ 5 పెయింటింగ్స్ ఉంటే ధనం, ఆరోగ్యం మీ సొంతం! వాస్తు ప్రకారం శుభ ఫలితాలు!
Vastu Shastra for Wall Paintings: వాస్తు ప్రకారం, ఇంట్లో ప్రత్యేక పెయింటింగ్స్ వేయడం వల్ల సానుకూల శక్తి వస్తుంది. ఇంట్లో సానుకూలత నింపే 3 పెయింటింగ్స్ గురించి తెలుసుకోండి.

Paintings as per Vastu : వాస్తు శాస్త్రం ఒక పురాతన భారతీయ శాస్త్రం, దీని సహాయంతో ఇల్లు, కార్యాలయం, దేవాలయం లేదా ఏదైనా స్థలంలో నిర్మాణాలు ఎలా ఉండాలి? ఏ దిశలో ఏం ఉంచాలి? ఇంటిని ఎలా డిజైన్ చేయాలి అనే దాని గురించి తెలుసుకోవచ్చు. దీనితో పాటు, ఇంట్లో ఏం ఉంచాలి , ఏం ఉంచకూడదు, ఏ రకమైన పెయింటింగ్‌లను ఉపయోగించాలి, ఇవన్నీ వాస్తు శాస్త్రం ద్వారా తెలుసుకోవచ్చు.
వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంట్లో మూడు రకాల పెయింటింగ్‌లను తప్పనిసరిగా ఉంచాలని చెబుతారు వాస్తు శాస్త్ర పండితులు. ఈ పెయింటింగ్‌లను ఇంట్లో ఉంచడం వల్ల సానుకూల శక్తి ప్రసారం అవుతుంది, జీవితంలో ఆనందం, సౌకర్యం , శ్రేయస్సు కొనసాగుతుంది. ఈ పెయింటింగ్‌ల గురించి తెలుసుకుందాం.

ఏనుగు పెయింటింగ్ వేయడం శుభప్రదం
ఇంట్లో ఏనుగు పెయింటింగ్ వేయడం చాలా శుభప్రదంగా పరిగణిస్తారు. ఇంట్లో ఈ రకమైన పెయింటింగ్‌ను వేయించినా, తీసుకొచ్చి పెట్టినా జీవితంలో స్థిరత్వం వస్తుంది. దీనితో పాటు, రాహు-కేతువుల దశ నడుస్తున్న వారికి ఏనుగు పెయింటింగ్ వేయడం వల్ల ఉపశమనం లభిస్తుంది.
అయితే, ఇంట్లో ఏనుగు పెయింటింగ్ లేదా విగ్రహం ఉంచినప్పుడు, ఏనుగు తొండం పైకి ఉండాలి. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి.
శుభ దిశ: ఇల్లు లేదా కార్యాలయంలో ఏనుగు పెయింటింగ్‌ను ఉంచడానికి నైరుతి దిశ శుభప్రదంగా ఉంటుంది.

రెండవ పెయింటింగ్ కల్పవృక్షం
ఇల్లు లేదా కార్యాలయంలో కల్పవృక్షం పెయింటింగ్ వేయడం చాలా శుభప్రదంగా పరిగణిస్తారు. ఇంట్లో ఇలాంటి పెయింటింగ్‌ను వేయడం వల్ల కెరీర్‌లో అభివృద్ధి ధనం వస్తుంది. ఆర్థిక పరిస్థితి బాగా లేని వారు తమ ఇంట్లో కల్పవృక్షం పెయింటింగ్‌ను ఉంచాలి.
శుభ దిశ: ఇల్లు లేదా కార్యాలయంలో కల్పవృక్షం పెయింటింగ్‌ను ఉంచడానికి ఉత్తర దిశ చాలా శుభప్రదంగా పరిగణిస్తారు

మూడవ పెయింటింగ్ 7 గుర్రాల రేసు
వాస్తు శాస్త్రం ప్రకారం, ఇల్లు లేదా కార్యాలయంలో 7 గుర్రాల పెయింటింగ్ వేయడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇంట్లో 7 గుర్రాల రేసు ఫోటోను ఉంచడం వల్ల ఆరోగ్యం, ధనం కెరీర్‌లో మంచి అభివృద్ధి కనిపిస్తుంది. దీనితో పాటు, శత్రువుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.
శుభ దిశ: ఇల్లు లేదా కార్యాలయంలో 7 గుర్రాల రేసు ఫోటోను ఉంచడానికి తూర్పు దిశ శుభప్రదంగా ఉంటుంది.

నాల్గవ పెయింటింగ్
బుద్ధుడి పెయిటింగ్
బుద్ధుడి పెయింటింగ్ శాంతి, జ్ఞానం, ఆధ్యాత్మిక జ్ఞానోదయాన్ని ప్రసరింపజేస్తుంది. తమ గదిలో ప్రశాంతమైన సామరస్యపూర్వక వాతావరణాన్ని సృష్టించాలనుకునే వారికి ఇది ఒక అద్భుతమైన పెయింటింగ్.
శుభ దిశ: బుద్ధుడి పెయింటింగ్‌కు అనువైన స్థానం తూర్పు గోడ. మీ లివింగ్ రూమ్‌లో ఈ పెయింటింగ్ ఉంచడం అత్తుత్తమం

ప్రకృతి పెయింటింగ్
పచ్చదనం, పర్వతాలు లేదా జలపాతాలు వంటి ప్రకృతి సంబంధిత చిత్రాలు మీ గదిలో తాజాదనం , ఉత్సాహాన్ని నింపడానికి సరైనవి. ఈ పెయింటింగ్స్ వృద్ధిని సూచిస్తాయి, ఒత్తిడిని తగ్గిస్తాయి, సృజనాత్మకతను పెంచుతాయి.
శుభ దిశ: వాస్తు సూత్రాలకు అనుగుణంగా ఉత్తరం లేదా తూర్పు దిశలో వీటిని వేలాడదీయండి.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం నమ్మకాలు మరియు సమాచారం ఆధారంగా మాత్రమే ఉంటుంది. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని అమలు చేయడానికి ముందు, సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.






















