CCTV కెమెరా వాస్తు: మీ ఇంట్లో ఈ దిశలో ఉంచితే సమస్యలే! | వాస్తు ప్రకారం కెమెరా ఎక్కడ పెట్టాలి?
Vastu Tips in Telugu: వాస్తు ప్రకాకం సీసీటీవీ కెమెరా ఏ దిశలో ఉంచాలి? ఏ దిశలో ఉంచకూడదు? తప్పు దిశలో ఉంటే కలిగే నష్టం ఏంటి? దీనిపై వాస్తు నిపుణులు ఏమంటున్నారు?

CCTV కెమెరా కోసం వాస్తు చిట్కాలు: ఈ విజ్ఞాన యుగంలో కూడా వేద జ్యోతిష్యం, వాస్తు శాస్త్రం, సముద్రిక శాస్త్రం, హస్తరేఖ శాస్త్రం వంటి పురాతన శాస్త్రాల సూత్రాలపై ఎందరికో నమ్మకం ఉంది. వాస్తు శాస్త్ర సూత్రాలను అనుసరించి ప్రజలు తమ కలల ఇంటిని నిర్మించుకుంటారు. ఇంటికి శంఖుస్థాపన చేసినప్పటి నుంచి గృహప్రవేశం, ఇంట్లో వస్తువులు అమరిక వరకూ అన్ని విషయాల్లోనూ వాస్తుని పాటిస్తారు.
ప్రస్తుతం ప్రతి ఒక్కరి ఇంట్లో CCTV కెమెరా కామన్ అయిపోతోంది. తమ భద్రత కోసం, పిల్లల భద్రత కోసం ఇంట్లో CCTV కెమెరా ఏర్పాటు చేసుకుంటున్నారు. అయితే వీటిని ఫిట్ చేసేటప్పుడు కొన్ని వాస్తు నియమాలు పాటించాలని చెబుతున్నారు వాస్తు నిపుణులు. తప్పు దిశలో అమర్చిన CCTV కెమెరా వారి ఇంట్లో సమస్యలకు కారణం కావొచ్చంటున్నారు వాస్తు నిపుణులు.
CCTV కెమెరాను ఆగ్నేయం, నైరుతి , పశ్చిమ, వాయువ్య దిశలో ఉంచితే ఆ ఇంట్లో సమస్యలు పెరుగుతాయని, గొడవలు జరుగుతాయని చెప్పారు వాస్తు నిపుణలు.
మెరుగైన నిఘా కోసం మాత్రమే కాదు..వాస్తు ప్రకారం కూడా కెమెరాలను ఈశాన్య దిశలో ఉంచాలి. రెండు కెమెరాలు ఏర్పాటు చేసినట్టైతే అవి ఎదురెదురుగా ఉండకూడదు. ఈ కారణంగా విభేదాలు పెరుగుతాయి
గడియారాన్ని తూర్పు, పడమర, ఉత్తరవైపు గోడలకు పెట్టొచ్చు కానీ దక్షిణం వైపు గోడకు ఎప్పుడూ ఉంచకూడదు.
ఇంటి ఎంట్రన్స్ డోర్ కి వెనుకవైపు కొందరు వాల్ క్లాక్ పెడతారు..కానీ ఇలా ఎప్పుడూ పెట్టకూడదు..ఇలాంటి ఇంట్లో మనశ్సాంతి ఉండదు. గొడవలు, చికాకులు వెంటాడుతాయి
పాత క్లాక్ లు, పాత వాచ్ లు చాలామంది భద్రంగా దాచుకుంటారు. కానీ వాస్తు శాస్త్రం ప్రకారం పాడైన , పనిచేయని వస్తువులు దాచితే మీ జీవితంలో సంతోషం ఆగిపోతుంది. ఇంట్లో ఉండే వాల్ క్లాక్స్ అన్నీ పనిచేయాలి. ఆగిపోయిన వాచ్ లు ఉన్న ఇంట్లోవారు ఏ పని చేసినా పూర్తికాదు
గోడగడియారం ఉత్తర దిశవైపు ఉంచితే సంపద పెరుగుతుంది
చెక్క క్లాక్స్ ఏమైనా ఉంటే తూర్పు గోడకు పెట్టండి..మీరు చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి
నైరుతి దిశలో కెమెరాలను ఉంచితే ఆర్థిక నష్టం, దొంగతనాలు జరుగుతాయి
గిడ్డంగి లాంటి ప్రదేశాల్లో CCTV కెమెరాను ఉంచేందుకు ఉత్తమ దిశ ఉత్తరం లేదా తూర్పు దిశ. ఇది గిడ్డంగి సరైన నిఘా & భద్రతను నిర్ధారిస్తుంది.
వ్యాపార ప్రదేశాల్లో కెమెరాలు ఎప్పుడూ దక్షిణం, నైరుతి దిశల్లో ఉంచకూడదు..ఇది వ్యాపారంలో ప్రతికూల శక్తికి కారణం అవుతుంది. ఆర్థికంగా నష్టపోతారు.
CCTV కెమెరాలు పెట్టకూడదని దిశల్లో పిల్లల ఫొటోలు, అద్దం, గడియారాలు కూడా ఉండకూడదు.
8 దిక్కులకు ఉండే అధిపతులను అష్ట దిక్పాలకులు అంటారు
తూర్పు - అధిపతి ఇంద్రుడు
ఆగ్నేయం - అధిపతి అగ్ని
దక్షిణం - అధిపతి యముడు
నైరుతి - అధిపతి నైరుతి
పడమర - అధిపతి వరుణుడు
వాయువ్యం - అధిపతి వాయువు
ఉత్తరం - అధిపతి కుబేరుడు
ఈశాన్యం - అధిపతి ఈశ్వరుడు
గమనిక: వాస్తు పండితులు సూచించిన వివరాలు, వాస్తు గ్రంధాల ఆధారంగా తీసుకుని అందించిన వివరాలు ఇవి. ఇది కేవలం ప్రాధమిక సమాచారం మాత్రమే. దీనిని పరిగణలోకి తీసుకునే ముందు మీరు విశ్వశించే వాస్తు నిపుణులను సంప్రదించండి.






















