అన్వేషించండి

Raja Shyamala Yagam: KCR రాజశ్యామల యాగం - ఈ యాగంతో కేసీఆర్‌కు మళ్లీ అధికారం ఖాయమా!

Raja Shyamala Yagam :తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజశ్యామల సహిత సుబ్రహ్మణ్యేశ్వర యాగం చేస్తున్నారు. ఈ యాగం ఎందుకు చేస్తారు.. దానివల్ల వచ్చే ఫలితం ఏంటి!

Raja Shyamala Yagam:  పురాణాల్లో, రాజుల కాలంలో రాజసూయ యాగం చేసేవారు. అలా చేస్తే రాజ్యంలో ఉ్నన సమస్యలన్నీ తీరిపోయి రాజ్యం సుభిక్షంగా ఉంటుందని విశ్వసించేవారు. అయితే ఇప్పుడు రాజకీయ నాయకులు రాజ శ్యామల యాగం చేస్తున్నారు. ఈ రెండు యాగాలు ఒకటేనా? రాజ శ్యామల యాగం చేయడం వల్ల ఎలాంటి ఫలితాలొస్తాయి.... 

రాజసూయ యాగం

'సూయం' అంటే శాశ్వతం... రాజ్యాన్ని, రాజుని శాశ్వతంగా ఉండేలా చేసేది కనుకే రాజసూయ యాగం అంటారు.
తమ సార్వభౌమాత్వాన్ని ప్రకటించుకునేందుకు రాజు నుంచి చక్రవర్తిగా మారేందుకు చేసే యాగం ఇది. రాజసూయ యూగం రాజ్యం నిలబడడానికి, నా విజయానికి ఎదురులేదని చెప్పడానికి, శత్రువులు తనముందు నిలిచేందుకు కూడా సహాసించలేరని చెప్పేందుకు ప్రతీక.

Also Read: దీపావళి రోజు సాయంత్రం లక్ష్మీ పూజలో పాటించాల్సిన నియమాలివే!

యాగం ఎన్నాళ్లు

ఈ యాగాన్ని ఏడాది కాలం చేయొచ్చు, మండలం రోజులు అంటే 41 రోజులు చేయొచ్చు..ఇంకా 21 రోజులు, 16 రోజులు, 3 రోజులు చేయొచ్చు.  యాగం ముగిసిన తర్వాత పూర్ణాహుతి సమర్పించే సమయానికి అక్కడున్న సభలో ఎవరు గొప్పవారైతే వారికి ఆ ఫలితం ధారపోస్తారు. 

ధర్మరాజుతో శ్రీకృష్ణుడు చేయించిన యాగం

రాజసూయ యాగం..ధర్మరాజుతో శ్రీకృష్ణుడు చేయిస్తాడు. మహాభారతంలో సభాపర్వంలోనే ఉంటుంది ఈ యాగం ప్రస్తావన.  శత్రు క్షయాన్నీ, కీర్తినీ, విజయాన్నీ సిద్ధింప చేస్తుంది కాబట్టి తప్పక ఈ యాగాన్ని చేయాలని శ్రీ కృష్ణుడు సూచించాడు.  మయసభలో దుర్యోధనుడి పరాభవం - మహాభారత యుద్ధానికి మూలం కూడా ఇక్కడే జరిగింది. యాగం పూర్తైన తర్వాత శిశుపాలుడి వధ జరిగిందీ ఇక్కడే అంటే యాగం పూర్తైన వెంటనే శత్రు సంహారం జరిగింది

రాజ శ్యామల యాగం ఎందుకు?

రాజ్యలక్ష్మి అంటే అధికారం వరించాలని..శత్రువులను ఓడించి విజేతగా నిలిచేలా చేయాలని చేసేదే రాజశ్యామలయాగం. ఈ యాగం చేస్తే  తమ బలం పెరగడంతో పాటూ శత్రువు బలం తగ్గుతుంది రాజకీయాల్లో విజయం వరిస్తుందని విశ్వాసం.

Also Read: ధన త్రయోదశి రోజు ఈ వస్తువులు కొనితెచ్చుకున్నా శుభమే - తక్కువ ఖర్చే!

రాజసూయ యాగం- రాజ శ్యామల యాగం రెండూ ఒకటేనా!

మహాభారతంలో ధర్మరాజు తో శ్రీ కృష్ణుడు చేయించిన రాజసూయ యాగం, ప్రస్తుతం కేసీఆర్ చేస్తున్న రాజ శ్యామల యాగం ఒకటేనా అంటే...ఈ రెండు యాగాలు ఒకటే కాకపోయినా వాటి వెనకున్న ఆంతర్యం, పరమార్థం మాత్రం ఒకటే. ప్రారంభించిన కార్యంలో విజయం వరించాలి, శత్రువులు క్షీణించాలి,  సార్వ భౌమాధికారం సిద్ధించాలి, రాజ్యలక్ష్మి శాశ్వతంగా ఉండాలన్నదే ఆంతర్యం . అయితే రాజసూయ యాగం చేయడం చాలా పెద్ద క్రతువు అది నిర్వహించడం అంత సుసాధ్యం కాదు అందుకే అందుకు ప్రతిగా రాజశ్యామల యాగం ద్వారా విజయం సిద్ధించేలా చేయేమని శ్యామలా దేవిని ప్రశన్నం చేసుకుంటారు. 

తెలుగు రాష్ట్రాల సర్వతోముఖాభివృద్ధి కోరుకుంటూ సీఎం కేసీఆర్‌ తలపెట్టిన రాజశ్యామల సహిత సుబ్రహ్మణ్యేశ్వర యాగం శాస్త్రోక్తంగా ప్రారంభమైంది. తొలి రోజున ఉదయం గోపూజ అనంతరం కేసీఆర్‌ దంపతులు యాగశాల ప్రవేశం చేశారు. గణపతిపూజ, పుణ్యహవచనం, పంచగవ్య ప్రసనతో అంకురార్పణ చేశారు. తెలుగు రాష్ట్రాలతోపాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన 170 మంది రుత్విక్కులు ఈ యాగంలో పాల్గొన్నారు.

యాగం చేసిన ప్రతిసారీ విజేతగా నిలిచిన KCR

ఇప్పటికే అనేక సార్లు  యాగం చేసిన కేసీఆర్..గత ఎన్నికలకు ముందు రాజ శ్యామల యాగం చేసి ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో విజేతగా నిలిచారు. ఎన్నికల విజయం తరువాత సహస్ర చండీ యాగం చేశారు. BRS జాతీయ రాజకీయాల్లో అడుగుపెడుతున్న సందర్భంగా ఢిల్లీలో రాజ శ్యామల యాగం చేశారు. తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కేసీఆర్ మరోసారి యాగం తలపెట్టారు. ఈ సారి కూడా రాజ శ్యామల యాగం ద్వారా తెలంగాణలో మరోసారి అధికారం దక్కడం ఖాయం అని ఫిక్సైపోయారు పార్టీ వర్గాలు.

Also Read: యుగయుగాలుగా లక్ష్మీ ఆరాధన -ఇంతకీ దీపావళి రోజే లక్ష్మీ పూజ ఎందుకు చేయాలి!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tirumala News: శ్రీవారి  లడ్డూ ప్రసాద నెయ్యి కల్తీ కేసులో సీబీఐ సిట్ దూకుడు - సూత్రధారుల వేట ప్రారంభం !
శ్రీవారి లడ్డూ ప్రసాద నెయ్యి కల్తీ కేసులో సీబీఐ సిట్ దూకుడు - సూత్రధారుల వేట ప్రారంభం !
Chilkur Balaji Temple Chief Priest Rangarajan : రంగరాజన్‌కు రేవంత్ ఫోన్ - దాడి రాజకీయానికి ఫుల్‌స్టాప్ పెట్టిన సీఎం
రంగరాజన్‌కు రేవంత్ ఫోన్ - దాడి రాజకీయానికి ఫుల్‌స్టాప్ పెట్టిన సీఎం
Lakshmi Arrest: కిరణ్ రాయల్ పై ఫిర్యాదు చేసిన లక్ష్మి అరెస్ట్- తిరుపతిలో అదుపులోకి తీసుకున్న జైపూర్ పోలీసులు
కిరణ్ రాయల్ పై ఫిర్యాదు చేసిన లక్ష్మి అరెస్ట్- తిరుపతిలో అదుపులోకి తీసుకున్న జైపూర్ పోలీసులు
KTR Visits Chilukuru Temple: చిలుకూరు అర్చకులు రంగరాజన్‌ను పరామర్శించిన కేటీఆర్, రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవంటూ ఆగ్రహం
చిలుకూరు అర్చకులు రంగరాజన్‌ను పరామర్శించిన కేటీఆర్, రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవంటూ ఆగ్రహం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Allu Aravind on Ram Charan | రామ్ చరణ్ పై వ్యాఖ్యల వివాదం మీద అల్లు అరవింద్ | ABP DesamPresident Murmu in Maha kumbh 2025 | మహా కుంభమేళాలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము | ABP DesamTirumala Ghee Adulteration Case | తిరుమల లడ్డూ కల్తీ కేసులో నలుగురు అరెస్ట్ | ABP DesamMadhya Pradesh Dhar Gang Arrest | 55కేసులున్న దొంగల ముఠాను అరెస్ట్ చేసిన అనంత పోలీసులు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirumala News: శ్రీవారి  లడ్డూ ప్రసాద నెయ్యి కల్తీ కేసులో సీబీఐ సిట్ దూకుడు - సూత్రధారుల వేట ప్రారంభం !
శ్రీవారి లడ్డూ ప్రసాద నెయ్యి కల్తీ కేసులో సీబీఐ సిట్ దూకుడు - సూత్రధారుల వేట ప్రారంభం !
Chilkur Balaji Temple Chief Priest Rangarajan : రంగరాజన్‌కు రేవంత్ ఫోన్ - దాడి రాజకీయానికి ఫుల్‌స్టాప్ పెట్టిన సీఎం
రంగరాజన్‌కు రేవంత్ ఫోన్ - దాడి రాజకీయానికి ఫుల్‌స్టాప్ పెట్టిన సీఎం
Lakshmi Arrest: కిరణ్ రాయల్ పై ఫిర్యాదు చేసిన లక్ష్మి అరెస్ట్- తిరుపతిలో అదుపులోకి తీసుకున్న జైపూర్ పోలీసులు
కిరణ్ రాయల్ పై ఫిర్యాదు చేసిన లక్ష్మి అరెస్ట్- తిరుపతిలో అదుపులోకి తీసుకున్న జైపూర్ పోలీసులు
KTR Visits Chilukuru Temple: చిలుకూరు అర్చకులు రంగరాజన్‌ను పరామర్శించిన కేటీఆర్, రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవంటూ ఆగ్రహం
చిలుకూరు అర్చకులు రంగరాజన్‌ను పరామర్శించిన కేటీఆర్, రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవంటూ ఆగ్రహం
Maha Kumbh: ప్రపంచంలోనే అతి పెద్ద ట్రాఫిక్ జామ్ - మహాకుంభమేళాలో మరో రికార్డు !
ప్రపంచంలోనే అతి పెద్ద ట్రాఫిక్ జామ్ - మహాకుంభమేళాలో మరో రికార్డు !
Vishwaksen: 'మా ప్రమేయం లేని దానికి మమ్మల్ని బలి చేయొద్దు' - 'బాయ్ కాట్ లైలా' స్పందించిన మూవీ టీం, సారీ చెప్పిన హీరో విశ్వక్ సేన్
'మా ప్రమేయం లేని దానికి మమ్మల్ని బలి చేయొద్దు' - 'బాయ్ కాట్ లైలా' స్పందించిన మూవీ టీం, సారీ చెప్పిన హీరో విశ్వక్ సేన్
Ram Gopal Varma: సీఐడీతోనే గేమ్సా ? - రామ్ గోపాల్ వర్మ పరిస్థితేంటి ?
సీఐడీతోనే గేమ్సా ? - రామ్ గోపాల్ వర్మ పరిస్థితేంటి ?
UK : యూకేలో అక్రమంగా పని చేస్తున్న వారందరికీ  బ్యాడ్ న్యూస్ - అమెరికా తరహాలో గెంటేయాలని ప్రధాని స్టార్మర్ నిర్ణయం
యూకేలో అక్రమంగా పని చేస్తున్న వారందరికీ బ్యాడ్ న్యూస్ - అమెరికా తరహాలో గెంటేయాలని ప్రధాని స్టార్మర్ నిర్ణయం
Embed widget