Day 3 Navratri: మూడో రోజు చంద్రఘంట అలంకారంలో శ్రీశైల భ్రమరాంబిక - ఈరోజు పఠించాల్సిన శ్లోకం ఇదే!
Chandraghanta Alankaram : శరన్నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా నవదుర్గలుగా దర్శనమిచ్చే శ్రీశైల భ్రమరాంబిక మూడోరోజు చంద్రఘంట అలంకారంలో దర్శనమిస్తోంది.

Srisailam Shardiya Navratri 2025: శ్రీశైలంలో శరన్నవరాత్రి బ్రహ్మోత్సవాలు కన్నులపండువగా సాగుతున్నాయి. ఇక్కడ భ్రమరాంబిక నవదుర్గల అలంకారంలో దర్శనమిస్తుంది. ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు శైలపుత్రి, రెండో రోజు బ్రహ్మచారిణిగా దర్శనమిచ్చిన భ్రమరాంబిక సెప్టెంబర్ 24 మూడో రోజు చంద్రఘంట అలంకారంలో భక్తులను అనుగ్రహిస్తోంది.
చంద్రఘంట అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకుంటే జీవితంపై ఆశ, విశ్వాసం పెరుగుతుందట. చంద్రఘంటను పూజించే ఇంట ప్రతికూల శక్తులు చేరవు. వృత్తి, వ్యాపారం, ఉద్యోగం, వ్యక్తిగత జీవితంలో నిరాశతో నిండేవారు ఈ రోజు చంద్రఘంటను పూజించండి. మీ ఆలోచనలో మార్పువస్తుందని చెబుతారు పండితులు.
శైలపుత్రిగా జన్మించిన అమ్మవారు..బ్రహ్మచారిణిగా శివుడి కోసం తపస్సు చేసింది. అలా తనకోసం తపస్సు ఆచరించిన అమ్మవారి కోసం పరమేశ్వరుడు దిగివచ్చాడు.మునులు, దేవతలు, గణాలతో పాటూ స్మశానంలో ఉండే భూతప్రేత పిశాచాలతో సహా హిమవంతుడికి ఇంటికి తరలివచ్చాడు శివుడు.
పరమేశ్వరుడి భయంకరమైన రూపం చూసి పార్వతీదేవి తల్లి మూర్ఛపోయింది..అప్పుడు పార్వతీదేవి చంద్రఘంట అలంకారంలో శివుడికి కనిపించి ఆ రూపాన్ని మార్చుకోమని కోరిందట. అప్పటికప్పుడు పరమేశ్వరుడు రాకుమారుడిలా నగలతో మెరిసిపోయాడు. నుదుటిపై చంద్రుడిని ధరించడంతో ఈ అలంకారాన్ని చంద్రఘంట అని పిలుస్తారు. చేతుల్లో కమలం, కమండలం, ఖడ్గం, త్రిశూలం, విల్లు, గద, బాణం, జపమాల ధరించి దర్శనమిస్తుంది అమ్మవారు. చంద్రఘంటను దర్శించుకుంటే శత్రువులు ఉండరని చెబుతారు.
చంద్రఘంట దేవి మంత్రం
ఓం దేవి చంద్రగుటాయై నమః
ఓం దేవి చంద్రగుటాయై నమః పిండాజ్ ప్రవార్ధ్ చండ్కోపష్ర్కైర్యుట
ప్రసాదమ్ తనుతే మధ్యమ్ చంద్రఘంటేటి విశృతా
చంద్రఘంట దేవి ప్రార్థన
పిండజా ప్రవారారుధ చండకోపస్త్రకైర్యుట
ప్రసాదమ్ తనుతే మహ్యం చంద్రఘంటేటి విశృతా !
చంద్రఘంట దేవి స్తుతి
యా దేవి సర్వభూతేషూ మా చంద్రఘంట రూపేనా సమస్తిత
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః
చంద్రఘంట దేవి ధ్యానం
వందే వాన్ఛితాభాయ చంద్రార్ధక్రితశేఖరం
సింహరుధ చంద్రఘంట యశస్వినీమ్
మణిపురా స్థితం తృతీయ దుర్గ త్రినేత్రం
ఖంగా, గధ, త్రిశూల, చపశార, పద్మ కమండాలు మాల వరభిటకరం
పటంబరా పరిధానమ్ మృదుహస్య నానాలంకర భూషితాం
మంజీర, హర, కేయూర, కింకిని, రత్నకుండల మండితాం
ప్రపుల్ల వందన బిబాధర కంట కపోలమ్ తుగమ్ కుచాం
కమనీయం లావణ్యం క్షినకటి నితంబానిమ్
చంద్రఘంట దేవి స్తోత్రం
అపదుద్ధహారిని త్వంహి అధ్య శక్తిః శుభ్పరం
అనిమది సిద్ధిధాత్రి చంద్రఘంటే ప్రణమామ్యహం
చంద్రముఖి ఇష్ట ధాత్రి ఇష్టం మంత్ర స్వరూపిణి
ధానదాత్రి, ఆనందధాత్రి, చంద్రఘంటే ప్రణమామ్యహం
నానారూపధారిణి ఇచ్ఛమయి ఐశ్వర్యదాయిని
సైభగ్యరోగ్యదాయిని చంద్రఘంటే ప్రణమామ్యహం
చంద్రఘంట దేవి కవచం
రహస్యం శ్రిను వక్ష్యామి షైవేశి కమలనానే
శ్రీ చంద్రఘంటేస్య కవచమ్ సర్వసిద్ధిదాయకం
బినా న్యాసం బినా వినియోగం బినా శపోద్ధ బినా హోమం
స్నానం శౌచది నాస్తి శ్రద్ధమత్రేన సిద్ధిదం
కుషిష్యం కుటిలయ వంచకాయ నిందకాయ చా
నా దతవ్యం న దతవ్యం న దతవ్యం కదచితాం
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం నమ్మకాలు ఆధారంగా సేకరించింది మాత్రమే. పండితులు చెప్పిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల నుంచి సేకరించి అందించనవి. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని అమలు చేయడానికి ముందు, సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.
శ్రీశైలం శక్తిపీఠంలో శరన్నవరాత్రి ఉత్సవాలు! 2025లో భ్రమరాంబిక అమ్మవారి అలంకారాలు ఇవే!
నవరాత్రులు ఆధ్యాత్మికంగానే కాదు.. మానసిక శారీరక ఆరోగ్య సాధన కూడా - అందుకే పూజలో ఈ 3 తప్పులు చేయకండి!.. పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
2025 శరన్నవరాత్రుల్లో ఏ రోజు ఏ అలంకారం? ఏ రోజు ఏ నైవేద్యం సమర్పించాలి? పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి






















