Sri Mukhalingam Baliatra: ఈ నెల 17న శ్రీముఖలింగంలో బాలియాత్ర - అంటే ఏంటి, ఏం చేస్తారు!
Baliatra: ఈనెల 17న మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కళింగరాజ్య పూర్వ రాజధానిశ్రీముఖలింగం (కళింగనగరం)లో బాలియాత్రను ఘనంగా నిర్వహించేందుకు భక్తబృందం ఏర్పాట్లు చేస్తోంది...అసలేంటీ యాత్ర?
Sri Mukhalingam Baliatra: బాలియాత్ర అంటే..ప్రపంచానికి సముద్రయానం తెలియని రోజుల్లో 5 వేల సంవత్సరాల పూర్వం మన పూర్వీకులైన కళింగసీమ ప్రజలు తమ నౌకలపై సరుకులతో తూర్పు ఆగ్నేయ దేశాలైన ఇండోనేసియా, మలేసియా జావా, సుమిత్ర,సింగపూర్, శ్రీలంక, చైనా తదితర దేశాలకు వ్యాపార నిమిత్తం ఇండోనేషియాలోని బాలి ద్వీపానికి బయలుదేరేవారు. అలా బయలు దేరిన మన ప్రాంత ప్రజలు క్షేమంగా వెళ్లి లాభాలతో తిరిగి రావాలని ఆకాంక్షిస్తూ మన మహిళలు కార్తీక పౌర్ణమి తర్వాత వచ్చే మూడు రోజులు శ్రీముఖలింగం పుణ్య క్షేత్రంలోని వంశధార నదీ తీరంలో అరటి దొప్పలపై దీపాలు వదిలి దీపోత్సవం గావించేవారు.
Also Read: క్షీరాబ్ధి ద్వాదశి వ్రత కథ ఇదే.. తులసి కోట దగ్గర దీపాలు వెలిగించాక చదువుకోవాలి!
బాలి యాత్ర ఎందుకు పునః ప్రారంభించాలి
ఒక మహర్షి శాపం తగిలి కళింగసీమ ప్రజలు తమ పూర్వీకుల సాంప్రదాయమైన బాలి యాత్ర చేయడం మర్చిపోయారు. ఫలితంగా తమ పితృ దేవతల అనుగ్రహాన్ని కోల్పోయి తమ రాజ్యాన్ని పోగొట్టుకుని, విభజించబడి (ఒడిస్సా, ఉత్తరాంధ్ర) వలస పాలకుల చేతిలో నిరాదరణకు గురై, తమకు అందుబాటులో ఉన్న నీటిని కూడా వాడుకోలేక (ఒడిశా, ఆంధ్ర అంతర్ రాష్ట్ర నదీ జలాల వివాదాలు) అభివృద్ధికి దూరంగా, పాలితులుగా ఉండి పోతారని, తమ భూములు, ఖనిజాలు, కొండలు ,వనరులు అన్యాక్రాంతమై వలస కూలీలుగా మారి దేశాలు పట్టుకు తిరుతారని, స్థానికేతరుల అజమాయిషీ, పెత్తనం స్థానికులపై అధికమవుతుందని, స్థానికేతరులు స్థానికుల హక్కులను హరించివేస్తారని చైనా యాత్రికుడు హుయాన్ త్సాంగ్ ఒక గ్రంథంలో రాశాడు.
కొంత కాలం క్రితం వరకు శ్రీముఖలింగంలో వంశధార నదీ తీరంలో కార్తీక పౌర్ణమి తరువాత మూడు రోజులపాటు బాలియాత్ర జరిగేది. తరువాత ఆ సంప్రదాయం ఆగిపోయింది. అందుకే కోల్పోయిన వైభవాన్ని తిరిగి పొందడానికి నాటి ప్రాచీన కళింగసీమ సాంప్రదాయమైన బాలి యాత్రను పునః ప్రారంభించాలని భక్తులు నిర్ణయించారు. భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వమే ఈ బాలియాత్రను శ్రీముఖలింగం లో అధికారికంగా నిర్వహించేలా కార్యాచరణ చేయాలని భక్తులు కోరుతున్నారు.
Also Read: తెలుగు రాష్ట్రాల్లో సీతమ్మకు ఒకే ఒక ఆలయం - దేశంలో ఇంకెక్కడున్నాయో తెలుసా!
ఓ సాహసయాత్ర
బాలి యాత్ర ఒక సాహస యాత్ర. ఈ నౌకాయానంలో తుఫానుల వలన, సముద్ర జీవుల దాడుల వలన, అనారోగ్యం వలన ఎంతో మంది చనిపోయేవారు. వారి సాహసం కళింగసీమకు భారత దేశంలోనే కాక ప్రపంచంలోనే పేరు ప్రఖ్యాతులు తెచ్చి పెట్టాయి. 5 వేలు సంవత్సరాలుగా సముద్ర యానంలో చనిపోయిన మన పూర్వీకుల ఆత్మ శాంతి కలగాని నివాళులు అర్పించడం ద్వారా వారి ఆశీస్సులు పొంది, అన్ని కుటుంబాలు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహిస్తారు.
బాలయాత్రలో అన్ని కుటుంబాలు పాల్గొనాలని...ముఖ్యంగా ఆడపడుచులు మెట్టినింట సౌభాగ్యం, పుట్టినింటి ఆనందం కోసం ఈ దీపోత్సవంలో పాల్గొనాలని భక్త బృందం పిలుపునిచ్చింది. ఆ రోజు శ్రీముఖలింగం రాలేని వారు మీకు అందుబాటులో ఉన్న నదుల్లో, చెరువుల్లో లేదా ఇంట్లోనే ఒక బకెట్ నీళ్లలో అరటి దొప్పలో దీపాలు వదలండి, 2 సంవత్సరాలు అలా చేసి 3వ సంవత్సరం శ్రీముఖలింగం వచ్చి ముఖలింగేశ్వరుని దర్శనం చేసుకుని ఆ ఏడాది బాలి యాత్రలో పాల్గొని మీ పూర్వీకుల ఆత్మశాంతికి ప్రయత్నించండి అని పిలుపునిచ్చారు.
Also Read: లక్ష్మీనారాయణుల అనుగ్రహం కోసం క్షీరాబ్ధి ద్వాదశి పూజ ఇలా ఈజీగా చేసేసుకోండి !