అన్వేషించండి

Ksheerabdi Dwadasi Pooja Vidhi In Telugu 2024: లక్ష్మీనారాయణుల అనుగ్రహం కోసం క్షీరాబ్ధి ద్వాదశి పూజ ఇలా ఈజీగా చేసేసుకోండి !

Tulsi Vivah 2024: ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి 4నెలల పాటూ యోగనిద్రలో ఉన్న విష్ణువు భూమ్మీదకు వచ్చే రోజు క్షీరాబ్ధి ద్వాదశి.. ఈరోజునే  ఉత్ధాన ఏకాదశి అంటారు.. ఈ రోజు పూజ చేయాల్సిన విధానం ఇదే..

Ksheerabdi Dwadasi  Pooja Vidhi In Telugu 2024: క్షీరాబ్ధి ద్వాదశి రోజే శ్రీ మహాలక్ష్మిని విష్ణువు వివాహం చేసుకున్నట్టు పురణాల్లో ఉంది. మహాలక్ష్మీ సమేతంగా విష్ణువు ఈ రోజు తులసివనంలో ఉంటాడు. అందుకే తులసిని అందంగా అలంకరించి లక్ష్మీనారాయణులను పూజిస్తే ఐశ్వర్యం, ఆనందం. విష్ణుస్వరూపంగా భావించే ఉసిరిని తీసుకొచ్చి తులసి మొక్కలో ఉంచి పూజచేయాలి.. పూజా విధానం ఇదే..

యన్మూలే సర్వ తీర్థాని యన్మధ్యే సర్వ దేవతా 
యథాగ్రే సర్వ వేదశ్చ తులసీ త్వం నామం మధ్యం 

ఈ శ్లోకం చదువుతూ తులసికి పసుపు, కుంకుమ సమర్పించాలి. తులసికి చుట్టుపక్కలా కన్నులపండువగా దీపాలు వెలిగించాలి. షోడసోపచార పూజ పూర్తిచేసి నైవేద్యం సమర్పించాలి. 

ఏ పూజ చేసినా ముందుగా గణపతి పూజ చేయాల్సిందే.. ఆ పూజ లింక్ కోసం ఇది క్లిక్ చేయండి...
 
గణనాథుడి పూజ తర్వాత క్షీరాబ్ది ద్వాదశి పూజ ప్రారంభమవుతుంది

 ఈ కింది శ్లోకాలు చదువుతూ పూలు, అక్షతలు సమర్పించాలి

దక్షిణాగ్రకరే శంఖం పద్మం తస్యాన్యథః 
కరే చక్రమూర్ధ్వకరే వామం, గదా తస్యా న్యధః
 కరే దధానం సర్వలోకేశం సర్వాభరణ భూషితం 
క్షీరాబ్ధిశయనం దేవ ధ్యాయే న్నారాయణం ప్రభుం 
తులసీ ధాత్రీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః 
ధ్యాయామి ధ్యానం సమర్పయామి..(పూలు వేయండి)

ఆవాహనం 
ఓం సహస్రశీర్షా పురుషః సహస్రాక్షస్సహస్రపాత్, స భూమిం విశ్వతోవృత్వా, అత్యతిష్ఠ ద్దశాంగులమ్... తులసీధాత్రీసమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినేనమః ఆవాహయామి ఆవాహనం సమర్పయామి.  

ఆసనం 
అనేకహారసంయుక్తం నానామణి విరాజితం రత్నసింహాసనందేవ ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం తులసీధాత్రీసమేత శ్రీ లక్ష్మీనారాయణస్వామినేనమః రత్నసింహాసనం సమర్పయామి.  

పాద్యం 
పద్మనాభ సురారాద్య పాదాంబుజ శుభప్రద పాద్యంగృహాణ భగవాన్ మయానీతం శుభావహం తులసీధాత్రీసమేతశ్రీలక్ష్మీనారాయణస్వామినేనమః పాద్యం సమర్పయామి. (నీరు చిలకరించాలి) 

అర్ఘ్యం
నిష్కళంక గుణారాధ్య జగత్రయ రక్షక, ఆర్ఘ్యం గృహాణమద్దత్తం శుద్దోదక వినిర్మితం తులసీ ధాత్రీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః  ఆర్ఘ్యం సమర్పయామి. (మరోసారి నీళ్లు) 

ఆచమనీయం 
సర్వారాధ్య నమస్తేస్తు సంసారార్ణవతారక గృహాణ దేవమద్దత్తంపరమాచమనీయకం . తులసీ ధాత్రీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః ఆచమనీయం సమర్పయామి. (నీరు చూపించి విడిచిపెట్టాలి) 

పంచామృతస్నానం: 
స్వాపాదపద్మసంభూత గంగాశోభిత విష్ణునం పంచామృతైః స్నాపయిష్యేతంశుద్ధో దకేనాపిచ .. తులసీ ధాత్రీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః  పంచామృతస్నానం సమర్పయామి.  పంచామృత స్నానానంతరం శుద్ధోదకస్నానం సమర్పయామి. ( ఉంటే పంచామృతాలు లేదంటే నీరు)
 
వస్త్రం 
వస్త్రయుగ్మం గృహణేదం భక్తాదత్తం మయాప్రభో తులసీధాత్రీసమేత శ్రీలక్ష్మీనారాయణ స్వామినేనమః వస్త్రయుగ్మం సమర్పయామి

ఉపవీతం 
స్వర్ణోపవీతం మద్దత్తం స్వర్ణంచ ప్రతిగృహ్యతాం తులసీధాత్రీసమేత శ్రీ లక్ష్మీనారాయణస్వామినేనమః యజ్ఞోపవీతం సమర్పయామి

గంధం 
రమాలింగన సంలిప్త రమ్య కాశ్మీర వక్షసే కస్తూరీమిళితం దాస్యే గంధంముక్తిప్రదాయకం.. తులసీ ధాత్రీసమేత శ్రీ లక్ష్మీనారాయణస్వామినే నమః గంధం సమర్పయామి

అక్షతలు 
అక్షతానక్షతాన్ శుభ్రాన్ పక్షిరాజధ్వ జావ్యయ గృహాణ స్వర్ణవర్ణాంశ కృపయాభక్త వత్సల తులసీధాత్రీసమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినేనమః అక్షితాన్ సమర్పయామి 

పుష్పం
 పుష్పై బిల్వ ప్రవాళతులసీదళ మల్లికాభిస్త్వాం పూజయామి జగదీశ్వర వాసుదేవః పుష్పం సమర్పయామి 

అథాంగపూజా  
పారిజాతాపహారకాయనమః పాదౌ పూజయామి గుణాధరాయ నమః గుల్ఫౌ పూజయామి జగన్నాథాయ నమః జంఘే పూజయామి జానకీవల్లభాయ నమః జానునీ పూజయామి, ఉత్తాలతాల భేత్రై నమః ఊరూ పూజయామి, కమలానాథాయ నమః కటిమ్ పూజయామి, నిరంజనాయ నమః నితంబర పూజయామి, నారయణాయ నమః నాభిమ్ పూజయామి వామ్నాయ నమః వళిత్రయం పూజ, కాలాత్మనేనమః గుహ్యం పూజయామి కుక్షిస్థాఖిలభువనాయ నమః ఉదరమ్ పూజయామి హృషీకేశాయ నమః హృదయమ్ పూజయామి లక్ష్మీవక్షస్థలాయ నమః వక్షఃస్థలమ్ పూజయామి పార్థసారథయే నమః పార్శ్వే పూజయామి మధురానాథాయ నమః మధ్యమ్ పూజయామి హరయే నమః హస్తాన్ పూజయామి, అనిరుద్ధాయనమః అంగుళీః పూజయామి శంఖచక్ర గదాశారఙ్గథారిణే నమః బాహూన్ పూజయామి వరదాయనమః స్తనౌ పూజయామి అధోక్షజాయ నమః అంసౌ పూజయామి కంబుకంఠాయ నమః కంఠం పూజయామి, ఓజిస్వినే నమః ఓష్ఠౌ పూజయామి దామోదరాయ నమః దన్తాన్ పూజయామి పూర్ణేందునిభవక్త్రాయ నమః ముఖమ్ పూజయామి,
గరుడవాహనాయ నమః గండస్థలమ్ పూజయామి నరనారాయణాత్మకాయ నమః నాసికమ్ పూజయామి నీలోత్పలదళశ్యామాయ నమః నేత్రే పూజయామి, భృగ్వాదిమునిసేవితాయై నమః భ్రువౌ పూజయామి భృంగరాజవిరాజిత పాదపంకజాయ నమః భ్రూమధ్యమ్ పూజయామి, కుండలినే నమః శ్రోత్రే పూజయామి లక్ష్మీపతయే నమః లలాటమ్ పూజయామి శిశుపాలశిరశ్చేత్త్రే నమః శిరః పూజయామి సత్యభామారతాయ నమః సర్వాణ్యాంగాని పూజయామి

అథాంగపూజ అనంతరం తులసి అష్టోత్తర శతనామావళి - విష్ణు అష్టోత్తర శతనామావళి చదువుకోవాలి
 
ధూపం 
దశాంగం గుగ్గులో పేతం చందనాగురువాసితం ధూపంగృహాణదేవేశ దూర్జటీనుతసద్గుణా ... తులసీ ధాత్రీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినేనమః ధూప మాఘ్రాపయామి

దీపం 
అజ్ఞానధ్వాంతనాశాయ అఖండ లోకశాలినే ఘృతాక్తవర్తి సంయుక్తం దీపందద్యామి శక్తితః... తులసీ ధాత్రీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినేనమః దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్దాచమనీయం సమర్పయామి

నైవేద్యం  
పృధుకానిక్షుఖండాంశ్చ కదళీఫల కానిచ, దాపయిష్యే భవత్ప్రీత్యై గృహాణసురపూజిత . నైవేద్యం పెట్టిన పదార్థాలపై నీళ్లు చల్లూతూ.... 
ఓం భూర్భువ స్సువః ఓం త తసవితు ర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ సత్యం త్వర్తేన పరిషించామి  అమృతమస్తు  అమృతోపస్తరణ మసి ఓం ప్రాణాయస్వాహా  ఓం అపానాయ స్వాహా ఓంవ్యానాయస్వాహా ఓంఉదనాయస్వాహా ఓంసమనాయ స్వాహా  ఓంబ్రహ్మణే నమ:  తులసీ ధాత్రీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినేనమః నైవేద్యంసమర్పయామి మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. అమృతాభిధానమపి - ఉత్తరాపోషనం సమర్పయామి హస్తౌ పక్షాళయామి పాదౌ ప్రక్షాళయామి శుద్దాచమనీయం సమర్పయామి. 

తాంబూలం 
విస్తీర్ణ సుసంయుక్తం నాగవల్లీ విరాజితం కర్పూరేణసుసమ్మి శ్రం తాంబూలం స్వీకురుప్రభో .. తులసీ ధాత్రీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినేనమః తాంబూలం సమర్పయామి. 

నీరాజనం
ప్రదీపితంచ కర్పూరఖండకైః జ్ఞానదాయినం గృహాణేదంమయాదత్తం నీరాజనమిదంప్రభో తులసీధాత్రీసమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినేనమః నీరాజనంసమర్పయామి , నీరాజనాంతరంశుద్ధాచమనీయంసమర్పయామి 

మంత్రపుష్పం
పుష్పాంజలిం ప్రదాస్యామి భక్త్యాభక్తాశ్రయ ప్రభో అనుగ్రహంతుభద్రం మే దేహి దేవేశ్వరార్చిత! తులసీధాత్రీసమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినేనమః మంత్రపుష్పం సమర్పయామి

ప్రదక్షిణ
యానికానిచ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదేపదే పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాపసంభవ త్రాహిమాం కృపయా దేవి శరణాగత వత్సల అన్యథా శరనం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన ప్రదక్షిణం కరిష్యామి సర్వభ్రమనివారణం. సంసారసాగరా న్మాం త్వ ముద్ధరస్వ మహాప్రభో

తులసీ ధాత్రీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినేనమః ప్రదక్షిణ నమస్కారంసమర్పయామి 

సాష్టాంగ నమస్కారం
తులసీ ధాత్రీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినేనమః 
సాష్టాంగనమస్కారన్ సమర్పయామి 

యస్య స్మృత్యాచ నామోక్త్యా తపః పూజాక్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందేతమచ్యుతం ఏతత్ఫలం తులసీధాత్రీసమేత శ్రీలక్ష్మీ నారాయణార్పణమస్తు శ్రీ కృష్ణార్పణమస్తు.

శ్రీ తులసీ ధాత్రీ సమేత శ్రీలక్ష్మీనారాయణస్వామినే నమః షోడశోపచార పూజాసమాప్తం

Also Read: నవంబరు 12 or 13 క్షీరాబ్ధి ద్వాదశి ఎప్పుడు - కార్తీకమాసంలో ఈ రోజుకి ఎందుకంత ప్రాధాన్యత!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana: కాంగ్రెస్ ప్రభుత్వ పాలనా విజయోత్సవాలకు ఆహ్వానం - కేసీఆర్‌ను టీజ్ చేస్తున్నారా ?
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనా విజయోత్సవాలకు ఆహ్వానం - కేసీఆర్‌ను టీజ్ చేస్తున్నారా ?
YSRCP MP: పవన్ క్రేజ్ దేశం మొత్తం వ్యాపించింది - సీఎం కావాల్సిందే - వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
పవన్ క్రేజ్ దేశం మొత్తం వ్యాపించింది - సీఎం కావాల్సిందే - వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
India Vs Australia 2nd Test Match: మరోసారి చేతులెత్తేసిన భారత బ్యాటర్లు.. 180 పరుగులకే ఆలౌట్
మరోసారి చేతులెత్తేసిన భారత బ్యాటర్లు.. 180 పరుగులకే ఆలౌట్
Abhishek Singhvi Controversy:రాజ్య‌స‌భ‌లో తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీ సీటు వద్ద నోట్ల క‌ట్టలు- విచార‌ణ‌కు ఛైర్మ‌న్ ఆదేశం
రాజ్య‌స‌భ‌లో తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీ సీటు వద్ద నోట్ల క‌ట్టలు- విచార‌ణ‌కు ఛైర్మ‌న్ ఆదేశం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

తిరుమలలో పంచమితీర్థం, అస్సలు మిస్ అవ్వొద్దువిజయవాడలో రెచ్చిపోయిన  గంజాయి, బ్లేడ్ బ్యాచ్రాజ్యసభలో తెలంగాణ ఎంపీ సీట్‌లో నోట్ల కట్టలుఆ డబ్బుతో నాకు సంబంధం లేదు, ఎంపీ అభిషేక్ మనుసింఘ్వీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana: కాంగ్రెస్ ప్రభుత్వ పాలనా విజయోత్సవాలకు ఆహ్వానం - కేసీఆర్‌ను టీజ్ చేస్తున్నారా ?
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనా విజయోత్సవాలకు ఆహ్వానం - కేసీఆర్‌ను టీజ్ చేస్తున్నారా ?
YSRCP MP: పవన్ క్రేజ్ దేశం మొత్తం వ్యాపించింది - సీఎం కావాల్సిందే - వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
పవన్ క్రేజ్ దేశం మొత్తం వ్యాపించింది - సీఎం కావాల్సిందే - వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
India Vs Australia 2nd Test Match: మరోసారి చేతులెత్తేసిన భారత బ్యాటర్లు.. 180 పరుగులకే ఆలౌట్
మరోసారి చేతులెత్తేసిన భారత బ్యాటర్లు.. 180 పరుగులకే ఆలౌట్
Abhishek Singhvi Controversy:రాజ్య‌స‌భ‌లో తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీ సీటు వద్ద నోట్ల క‌ట్టలు- విచార‌ణ‌కు ఛైర్మ‌న్ ఆదేశం
రాజ్య‌స‌భ‌లో తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీ సీటు వద్ద నోట్ల క‌ట్టలు- విచార‌ణ‌కు ఛైర్మ‌న్ ఆదేశం
Sabarimala: శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - సులభ దర్శనానికి ప్రత్యేక పోర్టల్
శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - సులభ దర్శనానికి ప్రత్యేక పోర్టల్
YSRCP: కేసుల వలలో వైఎస్ఆర్‌సీపీ ముఖ్య నేతలు - ముందస్తు బెయిల్స్ కోసం పరుగులు- టీడీపీ రౌండప్ చేస్తోందా ?
కేసుల వలలో వైఎస్ఆర్‌సీపీ ముఖ్య నేతలు - ముందస్తు బెయిల్స్ కోసం పరుగులు- టీడీపీ రౌండప్ చేస్తోందా ?
Benefit Shows Cancelled In Telangana: ఫుష్ప 2 ఎఫెక్ట్‌- తెలంగాణలో బెనిఫిట్‌ షోలు రద్దు
ఫుష్ప 2 ఎఫెక్ట్‌- తెలంగాణలో బెనిఫిట్‌ షోలు రద్దు
Srikakulam Latest News:కాలు నొక్కితే ఆర్మీ కోచింగ్- కాదంటే బెల్ట్‌తో కోటింగ్‌- శ్రీకాకుళం ఆర్మీ కాలింగ్ సెంటర్‌లో అరాచకాలు
కాలు నొక్కితే ఆర్మీ కోచింగ్- కాదంటే బెల్ట్‌తో కోటింగ్‌- శ్రీకాకుళం ఆర్మీ కాలింగ్ సెంటర్‌లో అరాచకాలు
Embed widget