Sravana Sukravaram Pooja Vidhanam in Telugu: శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం - సులభమైన పూజా విధానం!
Varalakshmi Vratam process in Telugu : శ్రావణమాసం మొత్తం పూజల సందడే. శ్రావణమాసంలో వచ్చే శుక్రవారాలు మరింత ప్రత్యేకం. ఇంట్లోనే పూజ ఇలా ఈజీగా చేసేసుకోండి

Varalakshmi Vratam
వరలక్ష్మీ వ్రతకల్పం.. వరలక్ష్మి పూజా విధానం
శ్రీ మహాగణాధిపతయే నమః
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే
ముందుగా వినాయక ప్రార్థన చేయాలి..గణపతి పూజ అనంతరం అమ్మవారి పూజ చేసుకోవాలి --- గణపతి పూజ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
దీపం వెలిగించి ఈ క్రింది కేశవనామాలను స్మరిస్తూ ఆచమనం చేయాలి.
ఓం కేశవాయస్వహా
ఓం నారాయణస్వాహా
ఓం మాధవాయస్వాహా
ఓం గోవిందాయ నమః
ఓం విష్ణవే నమః
ఓం మధుసూదనాయ నమః
ఓం త్రివిక్రమాయ నమః
ఓం వామనాయ నమః
ఓం శ్రీధరాయ నమః
ఓం హౄషికేశాయ నమః
ఓం పద్మనాభాయ నమః
ఓం దామోదరాయ నమః
ఓం సంకర్షణాయ నమః
ఓం వాసుదేవాయ నమః
ఓం ప్రద్యుమ్నాయ నమః
ఓం అనిరుద్దాయ నమః
ఓం పురుషోత్తమాయ నమః.
ఓం అధోక్షజాయ నమః
నారసింహాయ నమః
ఓం అచ్యుతాయ నమః
జనార్ధనాయ నమః
ఓం ఉపేంద్రాయ నమః
ఓం హరయే నమః
ఓం శ్రీకృష్ణాయ నమః
ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమికారకాః
ఏతేషా మవిరోధేన బ్రహ్మకర్మ సమారభే !!
పై శ్లోకము చదివి అక్షతలు వాసన చూచి తమ ఎడమవైపున వేసుకొనవలయును.
కుడిచేతితో ముక్కు పట్టుకుని ప్రాణాయామం చేయాలి.
ఓంభూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః
ఓగ్ ఒసత్యం ఓంతత్ సవితుర్వరేణ్యం భర్గోదేవస్యధీమహీ ధీయోయోనః ప్రచోదయాత్ ఓంఅపోజ్యోతిరసోమృతం బ్రహ్మభూర్భువస్సువరోం॥ .
సంకల్పం
మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనముహుర్తే ఆద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేత వరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రధమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరో ర్దక్షణదిగ్భాంగే శ్రీశైలస్య ఈశాన్యప్రదేశే కృఇష్ణా గోదావరి మధ్యప్రదేశే,శోభనగౄహే(అద్దె ఇల్లు అయినచో ,వసతి గ్రుహే అనియు,సొంత ఇల్లైనచో స్వగౄహే అనియు చెప్పుకొనవలెను ) సమస్తదేవతాభ్రాహ్మణ హరిహర సన్నిదౌ అస్మిన్ వర్తమానే వ్యవహారిక చాంద్ర మానేన......సంవత్సరే,(ఇక్కడ తెలుగు సంవత్సరము అంటే పూజ చేయునపుడు ఏ సంవత్సరము జరుగుచున్నదో ఆ సంవత్సరము యొక్క పేరును చెప్పుకోవలిను), దక్షిణాయనే, వర్షఋతుః,(వసంత,గీస్మ,వర్ష మొదలగు ఋతువులలో పూజసమయంలో జరుగుచున్న ఋతువుపేరు.) శ్రావణమాసే, పక్షే (పౌర్ణమికి ముందు అయితే శుక్ల పక్షే, అమావాస్యకు ముందు కృష్ణ పక్షే) ... పూజ జరిగే రోజు పక్షం, తిథి, వారం చెప్పుకుని శుభ నక్షత్రే, శుభయోగే, శుభ కరణే, ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ మమౌపాత్త సమస్త దురితక్షయద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య, శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం అని గోత్రనామాలు చెప్పుకోవాలి. సహకుటుంబస్య,క్షేమ,స్థైర్య , వీర్య, విజయ, అభయ, ఆయురారోగ్య, ఐశ్వర్యాభివౄధ్యార్థం, పుత్రపౌత్రాభివౄధ్యార్థం, మమధర్మార్థ, కామమోక్ష, చతుర్విధ ఫలపురుషార్థం, సర్వ్వాభీష్ట సిధ్యర్థం శ్రీవరలక్ష్మీ దేవతా ముద్దస్య వరలక్ష్మీ దేవతా ప్రీతార్థం కల్పోక్త ప్రకారేణ యావచ్చక్తి ధ్యానావాహనాది షోడోపచార పూజాం కరిష్యే .తద్ధంగ కలశపూజాం కరిష్యే.
కలశ పూజ
వెండి,రాగి,లేక కంచు చెంబులోకి నీటిని తీసుకుని దానికి గంధం రాసి కుంకుమ పెట్టాలి. పూలు, అక్షతలు, గంధం నీటిలో వేసి.. ఆ కలశాన్ని కుడిచేతితో మూసివుంచి...
కలశస్య ముఖే విష్ణు: కంఠే రుద్ర స్సమాశ్రిత:|
మూలే తత్ర స్థితో బ్రహ్మా మధ్యే మాత్రు గణా: స్మృతా:||
కుక్షౌతు సాగరా: సరేసప్త దీపా వసుంధరా|
ఋగ్వేదొ విధ యజుర్వేద: సామవేదొ హ్యధర్వణ:||
అంగైశ్చ సహితా: సర్వే కలశాంబు సమాశ్రితా:|
ఆయంతు దేవ పూజార్థం దురితక్షయ కారకా:||
గ్లాసులో నీళ్ళు అమ్మవారిమీద పూజద్రవ్యాల మీద చల్లండి
గంగేచ యమునే చైవ గొదావరి సరస్వతి|
నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు||
కలశొదకేన పూజా ద్రవ్యాణి దేవమండపఆత్మానంచ సంప్రొక్ష్య
(కలశములొని నీటిని పూజ ద్రవ్యములపై, పూజ చేసేవారిపై చల్లుకోవాలి)
ఓం అపవిత్రః పవిత్రోవా సర్వావస్థాంగ తో పివా
యస్స్మరేత్పుండరీకాక్షం సభాహ్యాభ్యంతరశ్శుచిః
అక్షంతలు, పూలు, కుంకుమ అమ్మవారిపై వేసి నమస్కరించాలి
ధ్యానమ్
పద్మాసనే పద్మకరే సర్వలోకైకపూజితే
నారాయణప్రియే దేవి సుప్రితాభవసర్వదా
క్షీరోదార్ణవ సంభూతే కమలే కమలాలయే
సుస్థిరాభవమేగేహే సురాసుర నమస్కౄతే
శ్రీవరలక్ష్మీదేవతాయైనమః ధ్యానమ్ సమర్పయామి
ఆవాహనం
సర్వమంగళ మాంగల్యే విష్ణువక్షఃస్థలాలయే
ఆవాహయామిదేవి త్వాం సుప్రీతాభవసర్వదా
శ్రీవరలక్ష్మీదేవతాయైనమః ఆవాహయామి
ఆసనం
సూర్యాయుత నిభస్ఫూర్తే స్ఫురద్రత్నవిభుషితే
సింహాసనమిదం దేవీ స్వీయతాం సురపూజితే
శ్రీవరలక్ష్మీదేవతాయైనమః ఆసనం సమర్పయామి
పాద్యం
సువాసిత జలం రమ్య సర్వతీర్థం సముద్భవం,
పాద్యం గృహాణదేవీ త్వం సర్వదేవ నమస్కృతే
శ్రీవరలక్ష్మీదేవతాం పాద్యం సమర్పయామి
అర్ఘ్యం
శుద్ధోదకంచ పాత్ర స్థంగంధ పుష్పాది మిశ్రితం,
అర్ఘ్యం దాస్యామి తే దేవీ గృహాణ సురపూజితే
శ్రీవరలక్ష్మీ దేవతాం అర్ఘ్యం సమర్పయామి
ఆచమనీయం
సువర్ణ కలశానీతం చందనాగరు సమ్యుతం,
గృహాణచమనందేవిమయాదత్తం శుభప్రదే
వరలక్ష్నీదేవతాం ఆచమనీయం సమర్పయామి
పంచామృత స్నానం
పయోదధీఘృతోపేతం శర్కరా మధుసంయుతం,
పంచామృతస్నాన మిదం గృహాణ కమలాలయే
శ్రీవరలక్ష్మీదేవతాం పంచామృతస్నానం సమర్పయామి
శుద్ధోదకస్నానం
గంగాజలం మయానీతం మహాదేవ శిరఃస్థితం,
శుద్దోదకమిదంస్నానం గృహాణవిధుసోదరీ
శ్రీ వరలక్ష్మీదేవతాం శుద్ధోదకస్నానం సమర్పయామి
వస్త్ర యుగ్మం
సురార్చితాం ఘ్రియుగళే దుకూలవసనప్రియే,
వస్త్ర్యుగ్మం ప్రదాస్యామి గృహాణ హరి వల్లభే
శ్రీ వరలక్ష్మీదేవతాం వస్త్రయుగ్మం సమర్పయామి
(పట్టులేదాశక్తికి తగిన వస్త్రమును దేవికీస్తున్నట్లుగాతలచి పత్తితో చేసుకొన్న వస్త్రయుగ్మమును (ప్రత్తిని గుండ్రని బిళ్ళగాచేసి తడిచేత్తో పసుపు,కుంకుమ,తీసుకొనిరెండువైపులాద్ది రెండు తయారుచేసుకోవాలి.)శ్రీవరలక్ష్మీదేవికి కలశంపై ఎడమవైపువేయవలెను.
ఆభరణం
కేయూరకంకణా దేవీ హారనూపుర మేఖలాః
విభూషణా న్య మూల్యాని గృహాణ ఋషిపూజితే
శ్రీవరలక్ష్మీదేవతాం ఆభరణం సమర్పయామి
ఉపవీతం
తప్త హేమకృతం దేవీ మాంగల్యం మంగళప్రదం,
మయాసమర్పితం దేవీ గృహాణ త్వం శుభప్రదే
శ్రీవరలక్ష్మీదేవతాం ఉపవీతం సమర్పయామి
గంధం
అక్షతాన్ దవళాన్ దివ్యాన్ శాలీయాన్ స్తండులాన్ శుభాన్,
హరిద్రా కుంకుమో పేతాన్ గృహ్యతా మబ్ది పుత్రికే
శ్రీవరలక్ష్మీదేవతాం అక్షతాన్ సమర్పయామి.
పుష్పపూజ
మల్లికాజాజికుసుమైశ్చంపకైర్వకుళైస్తధా,
నీలోత్పలైఃశ్చలళారైఃపూజయామి హరిప్రియే
శ్రీవరలక్ష్మీదేవతాం పుష్పైః పూజయామి
అధాంగ పూజ
శ్రీవరలక్ష్మీదేవి అష్టోత్తర శతనామావళి చదువుతూ.. పూలు, అక్షతలతో పూజ చేయాలి
శ్రీ వరలక్ష్మీ అష్టోత్తర శతనామావళి మీకు అందుబాటులో లేకుంటే ఈ లింక్ క్లిక్ చేయండి..ఇందులో ఉంటుంది
ధూపం
దశాంగం గుగ్గులోపేతం సుగంధం చ మనోహరం
ధూపం దాస్యామి దేవేశే గృహాణ కమలప్రియే
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః ధూపమాఘ్రాపయామి
దీపం
ఘృతావర్తి సంయుక్తం అంధకార వినాశకం
దీపం దాస్యామితే దేవీ గృహాణ ముదితా భవ
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః దీపం దర్శయామి
ధూపదీపానంతరం ఆచమనీయం సమర్పయామి
... అంటూ ఆచమనం చేయాలి.
నైవేద్యం
నైవేద్యం షడ్రషోపేతం దధిమధ్వాజ్య సంయుతం
నానాభక్ష్య ఫలోపేతం గృహాణ హరి వల్లభే
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః నైవేద్యం సమర్పయామి
ఓంప్రాణాయస్వాహా ఓంఅపానాయస్వాహా ఓంవ్యానాయస్వాహా ఓంఉదానాయస్వాహా ఓంసమానాయస్వాహా ఓంశ్రీవరలక్ష్మీదేవతాయైనమః నైవేద్యం సమర్పయామీ
నైవేద్యానంతరం...
హస్తౌ ప్రక్షాళయామీ , పాదౌ పేక్షాళయామీ , పునః శుద్దాచమనీయం సమర్పయామి అని ఇంకోసారి నీరు వదలాలి)
పానీయం
ఘనసార సుగంధేన మిశ్రితం పుష్పవాసితం
పానీయం గృహ్యాతాం దేవి శీతలం సుమనోహరం
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః పానీయం సమర్పయామి
తాంబూలం
పూగీఫల సమాయుక్తం నాగవల్లీ దళైర్యుతం
కర్పూర చూర్ణసంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః తాంబూలం సమర్పయామి
(అని తమలపాకు,వక్క,సున్నం సుగంధాలతో తాంబూలం ఇవ్వాలి)
ఆ తరువాత....
శుధ ఆచమనీయం సమర్పయామి
నీరాజనం
నీరాజనం సమానీతం కర్పూరెణ సమన్వితం
తుభ్యం దాస్యామ్యహం దేవీ గృహ్యతాం విష్ణువల్లభే
శ్రీ వరలక్ష్మీ దేవతాయైనమః నీరాజనం సమర్పయామి
మంత్రపుష్పం
పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే
నారాయణే ప్రియే దేవీ సుప్రీతో భవసర్వదా
శ్రీ వరలక్ష్మీ దేవతాయైనమః మంత్రపుష్పం సమర్పయామి
ప్రదక్షిణ
యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే
పాపోహం పాప కర్మాహం పాపాత్మ పాపసంభవః
త్రాహి మాం కృపయాదేవి శరణాగతవత్సలే
అన్యధా శరణంనాస్తి త్వమేవ శరణంమమ
తస్మాత్కారుణ్య భావేన రక్షరక్ష జగధారిణి
శ్రీ వరలక్ష్మీ దేవతాయైనమః ప్రదక్షిణం సమర్పయామి.
నమస్కారం
నమస్తే లోక్యజననీ నమస్తే విష్ణువల్లభే
పాహిమాం భక్తవరదే వరలక్ష్మీ నమో నమః
శ్రీ వరలక్ష్మీ దేవతాయైనమః నమస్కారాన్ సమర్పయామి
9 వరసలు 9 ముడులు కలిగిన తోరమును పూజించాలి
తోరపూజ
ఓం కమలాయైనమః ప్రథమగ్రంథిం పూజయామి
ఓం రమాయైనమః ద్వితీయగ్రంథిం పూజయామి
ఓం లోకమాత్రే నమః తృతీయగ్రంథిం పూజయామి
ఓం విశ్వజనన్యైనమః చతుర్థగ్రంథిం పూజయామి
ఓం మహాలక్ష్మీనమః పంచమగ్రంథిం పూజయామి
ఓం క్షీరాబ్ధితనయాయైనమః షష్టమగ్రంథిం పూజయామి
ఓం విశ్వసాక్షిణ్యైనమః సప్తమగ్రంథిం పూజయామి
ఓం చంద్రసోదర్యైనమః అష్టమగ్రంథిం పూజయామి
ఓం శ్రీవరలక్ష్మీయైనమః నవమగ్రంథిం పూజయామి
తోరం కట్టుకునేటప్పుడు చదువుకోవాల్సిన శ్లోకం
బధ్నామి దక్షిణేహస్తే నవసూత్రం శుభప్రదం
పుత్రపౌత్రాభివృద్ధించ మమ సౌభాగ్యం దేహిమే రమే
వాయనం ఇచ్చేటప్పుడు
ఏవం సంపూజ్య కళ్యాణీం వరలక్ష్మీం స్వశక్తితః
దాతవ్యం ద్వాదహాపూపం వాయనం హిద్విజాతయే
ఇందిరా ప్రతిగృహ్ణాతు ఇందిరా వై దదాతిచ
ఇందిరా తారకోబాభ్యాం ఇందిరాయై నమోనమః
శ్రీవరలక్ష్మీదేవతాయైనమః వాయనదానం సమర్పయామి.
( పసుపు, కుంకుమ, వస్త్రం, గాజులు, శనగలు, పూర్ణంబూరెలు వాయనం ఇవ్వాలి )
శ్రీవరలక్ష్మీ వ్రతకథ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి






















