అన్వేషించండి

Varalakshmi Vratham 2025: వరలక్ష్మీ వ్రతం 2025 తేదీ , సమయం, శుభ ముహూర్తం, పూజా విధానం - మీకోసం ప్రత్యేక గైడ్!

Varalakshmi Vratham 2025 Date and Time: ప్రతి సంవత్సరం శ్రావణమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మీ వ్రతం ఆచరిస్తారు. ఈ ఏడాది ఆగష్టు 08న వచ్చింది. ఈ రోజు పూజా సమయం, ఇతర వివరాలు తెలుసుకోండి.

Varalakshmi Vratham Pooja Vidhanam :  వరలక్ష్మీ వ్రతం ఏటా శ్రావణమాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం జరుపుకుంటారు. 2025లో ఆగస్టు 9 శనివారం పౌర్ణమి వచ్చింది.. ఆ ముందురోజు వచ్చే ఆగష్టు 08 శుక్రవారం వ్రతాన్ని ఆచరిస్తారు

 శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం - సులభమైన పూజా విధానం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

శ్రీవరలక్ష్మీ వ్రతకథ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఆగష్టు 08 శుక్రవారం వరలక్ష్మీ వ్రతం ఆచరించేందుకు శుభ ముహూర్త సమయాలు

సింహ లగ్నం: ఉదయం 6:42 నుంచి 8:47 వరకు

వృశ్చిక లగ్నం: మధ్యాహ్నం 1:00  నుంచి 3:13 వరకు

కుంభ లగ్నం: సాయంత్రం 7:11  నుంచి  రాత్రి 8:50  వరకు

వృషభ లగ్నం: అర్ధరాత్రి 12:14 (ఆగష్టు 09 ) నుంచి తెల్లవారుజామున 2:15 వరకు

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం  వృషభం, సింహం, వృశ్చికం, కుంభం లగ్నంలో పూజ చేయడం శ్రేష్ఠంగా భావిస్తారు. 

ఆగష్టు 08 శుక్రవారం పంచాంగం

చతుర్థశి శుక్రవారం మధ్యాహ్నం 1:45 వరకు అనంతరం పౌర్ణమి ఘడియలు ప్రారంభమవుతాయి

ఉత్తరాషాడ నక్షత్రం మధ్యాహ్నం 3:08 వరకు తదుపరి శ్రవణం నక్షత్రం  

అమృత ఘడియలు ఉదయం 8:28 నుంచి 10:08 వరకు

వర్జ్యం రాత్రి 7:11 నుంచి 8:49 వరకు

దుర్ముహూర్తం ఉదయం 8:17 నుంచి 9:08 వరకు తిరిగి మధ్యాహ్నం 12:32 నుంచి 1:23 వరకు

వర్జ్యం, దుర్ముహూర్తం లేని సమయం చూసి వరలక్ష్మీ వ్రతం ప్రారంభించవచ్చు. తెలుగు పంచాంగం ప్రకారం ఉదయం 8 లోపు లేదంటే 9 నుంచి 12న్నర లోపు పూజ ప్రారంభించుకోవచ్చు.

పూజా విధానం

వరలక్ష్మీ వ్రతం ఆచరించేవారు ముందుగా పూజా సామగ్రి... దీపం కుందులు, వత్తులు, నెయ్యి, పూలు, పండ్లు, పసుపు, కుంకుమ, తమలపాకులు, వక్కలు,  అగరవత్తులు, నాణేలు, నూతన వస్త్రం, కలశం, పంచామృతాలు, అమ్మవారి విగ్రహం, కలశకు కట్టే దారం, బియ్యం, నైవేద్యాలు, కర్పూరం సిద్ధం చేసి పెట్టుకోవాలి.

వేకువజామునే నిద్రలేచి... పూజా మందిరాన్ని శుభ్రం చేసి ముగ్గువేసి తూర్పుదిశగా కూర్చుని పూజ చేసుకునేలా ఏర్పాట్లు చేసుకోవాలి. అమ్మవారిని నూతన వస్త్రం, ఆభరమాలతో  అలంకరించుకోవాలి. 

ఎప్పటిలా మందుగా గణపతి పూజ చేసి అనంతరం వరలక్ష్మీ పూజా ఆచరించాలి , చారుమతీదేవి కథ చదువుకోవాలి... పూజ పూర్తైన తర్వాత ముత్తైదువులకు తాంబూలం ఇవ్వాలి

వరలక్ష్మీ వ్రతం ప్రాముఖ్యత

వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించడం అంటే లక్ష్మీదేవి అష్టలక్ష్మీ రూపాలను ఆరాధించడమే. తద్వారా అష్ట ఐశ్వర్యాలను పొందవచ్చని భక్తుల విశ్వాసం. ఈ వ్రతాన్ని వివాహితులు తమ భర్త ఆరోగ్యం, దీర్ఘాయుష్షు, కుటుంబ శ్రేయస్సు కోసం ఆచరిస్తారు. అవివాహితులు మంచి భర్త లభించాలని ఆచరిస్తారు. స్కాంద పురాణం ప్రకారం ఈశ్వరుడు పార్వతీదేవికి ఈ వ్రతాన్ని ఆచరించమని ఉపదేశించారు. చారుమతి అనే స్త్రీకి వరలక్ష్మీదేవి కలలో కనిపించి ఈ వ్రతాన్ని ఆచరించమని చెప్పగా ఆమె అనుగ్రహంలో సకల ఐశ్వర్యాలు పొందించి చారుమతీదేవి.  

పూజ చేసే విధానం, అలంకారం, ఆర్భాటం కన్నా భక్తి ప్రధానం.

వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించేవారు ఈ రోజు కేవలం సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి...మాంసాహారం నిషిద్ధం
 
పూజ తర్వాత సుమంగళిలకు తాంబూలం, వాయనదానం ఇవ్వాలి
 
గమనిక: ఆధ్యాత్మికవేత్తలు సూచించిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల్లో పొందుపరిచిన సమాచారం ఆధారంగా అందించిన కథనం ఇది. దీనిని అనుసరించేముందు మీరు విశ్వశించే పండితుల సలహాలు స్వీకరించగలరు.

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More

టాప్ హెడ్ లైన్స్

22-08-2026 శనివారం మీ రాశిఫలాలు! ధనస్సు, మకరం, కుంభం, మీన రాశుల దినఫలాలు!
22-08-2026 శనివారం మీ రాశిఫలాలు! ధనస్సు, మకరం, కుంభం, మీన రాశుల దినఫలాలు!
22-08-2026 శనివారం మీ రాశిఫలాలు! సింహం, కన్య, తుల, వృశ్చికం మీ భవిష్యత్ తెలుసుకోండి!
22-08-2026 శనివారం మీ రాశిఫలాలు! సింహం, కన్య, తుల, వృశ్చికం మీ భవిష్యత్ తెలుసుకోండి!
22-08-2026 శనివారం మీ రాశిఫలాలు! మేషం, వృషభం, మిథునం, కర్కాటక రాశుల దినఫలాలు!
22-08-2026 శనివారం మీ రాశిఫలాలు! మేషం, వృషభం, మిథునం, కర్కాటక రాశుల దినఫలాలు!
రోకలి నుంచి ఉద్భవించి ఏటా పెరిగే శివలింగం రహస్యం! 13వ జ్యోతిర్లింగాన్ని ఎప్పుడైనా దర్శించుకున్నారా?
రోకలి నుంచి ఉద్భవించి ఏటా పెరిగే శివలింగం రహస్యం! 13వ జ్యోతిర్లింగాన్ని ఎప్పుడైనా దర్శించుకున్నారా?

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
Breaking News: యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Arpitha Mohithe: తెలుగు బుల్లితెర వారసురాలు.. అర్పిత గురించి మీకు తెలియని విషయాలు!
తెలుగు బుల్లితెర వారసురాలు.. అర్పిత గురించి మీకు తెలియని విషయాలు!
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
NO BPL This Year:  పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Embed widget