Raksha Bandhan 2025 Date: రక్షాబంధన్ 2025 భద్రకాలం ఉందా - రాఖీ కట్టే ముహూర్తం ఏంటి?
Raksha Bandhan 2025 : శ్రావణ పూర్ణిమ రోజు రాఖీ పండుగ జరుపుకుంటారు. భద్ర ప్రభావం ఉంటుందా? వివరాలు ఇక్కడ తెలుసుకోండి

Raksha Bandhan 2025: రక్షాబంధన్ పండుగ సోదర సోదరీమణుల మధ్య అందమైన బంధానికి, విడదీయరాని ప్రేమకు ప్రతీక. సోదరి తన సోదరుడి కుడి మణికట్టుకు రాఖీ కట్టి ...ఆరోగ్యకరమైన విజయవంతమైన జీవితాన్ని కోరుకుంటుంది. సోదరుడు కూడా తన సోదరిని జీవితాంతం రక్షిస్తానని వాగ్దానం చేస్తాడు.
ఏటా శ్రావణమాసంలో పౌర్ణమి రోజు రక్షాబంధన్ పండుగ జరుపుకుంటారు. రక్షాబంధన్ నాడు రాఖీ కట్టే సమయంలో భద్రకాలాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటారు. ఎందుకంటే భద్ర కాలంలో రాఖీ కడితే అశుభం జరుగుతుందనే భయం ఉంటుంది. అందుకే పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం రక్షాబంధన్ సరైన తేదీ ఏంటి? భద్రకాలం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది? సోదరుడికి రాఖీ కట్టడానికి అత్యంత శుభ సమయం ఏంటో ఇక్కడ పూర్తివివరాలు తెలుసుకోండి.
ఆగస్టు 8 లేదా 9న రక్షాబంధన్ ఎప్పుడు (Raksha Bandhan 2025 Exact Date 8 or 9 August)
రక్షాబంధన్ పండుగ ప్రతి సంవత్సరం శ్రావణ పూర్ణిమ రోజున జరుపుకుంటారు. అయితే ఈ తేదీ గురించి ప్రజలలో గందరగోళం ఉంది, రక్షాబంధన్ ఆగస్టు 8 న ఉంటుందా లేదా ఆగస్టు 9 న ఉంటుందా? ఎందుకంటే పూర్ణిమ తిథి రెండు రోజులూ ఉంటుంది.
పంచాంగం ప్రకారం పూర్ణిమ తిథి ఆగస్టు 8 శుక్రవారం మధ్యాహ్నం 01:45 గంటలకు ప్రారంభమవుతుంది
ఆగస్టు 9 శనివారం మధ్యాహ్నం 01:32 గంటలకు ముగుస్తుంది
ప్రత్యేక పూజలు చేసేవారు, పున్నమి నోములు చేసేవారు, కార్తీక పౌర్ణమి లాంటి ప్రత్యేక సందర్భాల్లో పౌర్ణమి తిథి రాత్రివేళ ఉండడాన్ని పరిగణలోకి తీసుకుంటారు. కానీ రాఖీ పండుగ ఉదయం జరుపుకునేది. సోదరుడి చేతికి రాఖీ కట్టే సమయం ఉదయమే. అందుకే సూర్యోదయానికి పౌర్ణమి తిథి ఉన్న ఆగష్టు 09 శనివారమే రక్షాబంధన్ జరుపుకోవాలని సూచిస్తున్నారు పండితులు.
రక్షాబంధన్ నాడు భద్రకాలం ఉంటుందా ?(Raksha Bandhan 2025 Bhadra Time)
భద్రకాలం ఆగష్టు 08 శుక్రవారం రాత్రి సమయానికి ముగుస్తుంది. అంటే ఆగష్టు 09 ఉదయం ఎలాంటి భద్రకాలం ఉండదు. ఆగస్టు 9 న ఏ శుభ ముహూర్తంలోనైనా సోదరుడికి రాఖీ కట్టొచ్చు. వర్జ్యం, దుర్ముహూర్తం లేకుండా చూసుకోవాలి. మధ్యాహ్నం వరకూ పౌర్ణమి ఘడియలున్నాయి
ఈ శుభ ముహూర్తాలలో రాఖీ కట్టవచ్చు (Rakhi Tide Muhurat 2025)
శనివారం, ఆగస్టు 9 శనివారం ఉదయం 5:35 నుంచి మధ్యాహ్నం 1:24 వరకు రాఖీ కట్టడానికి శుభ సమయం. సూర్యోదయం సమయం నుంచి ఉదయం 6 గంటల 38 నిముషాల వరకూ అమృత ఘడియలున్నాయి. అభిజిత్ ముహూర్తంలో రాఖీ కట్టడానికి ఆగస్టు 9 మధ్యాహ్నం 12 గంటల నుంచి 12:53 వరకు సమయం కూడా చాలా శుభప్రదం.
జూలై to అక్టోబర్ ఈ నాలుగు నెలలు ఈ నియమాలు పాటిస్తే ఆరోగ్యం, ఐశ్వర్యం, జీవితంపై సానుకూల ప్రభావం..పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి!
జీవితం ఎటుపోతోందో అర్థంకావడం లేదా? అంతా ముగిసిపోయింది అనుకుంటున్నారా..అయితే ఇది మీకోసమే..ఈ లింక్ క్లిక్ చేయండి
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం నమ్మకాలు ఆధారంగా సేకరించి అందించింది మాత్రమే. ఈ సమాచారాన్ని ఎంతవరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం. దీనిని అనుసరించేముందు మీకు నమ్మకమైన పండితులను, సంబంధిత నిపుణులను సంప్రదించండి.






















