Baba Vanga's Forecast 2025: ప్రధాని మోదీ తర్వాత పవన్ కళ్యాణేనా..బాబా వంగా, ఆస్ట్రో శర్మిష్ఠ చెప్పింది నిజమవుతుందా?
Baba Vanga 2025: 2025లో ఏం జరగబోతోందో బాబా వాంగా భవిష్యవాణి చెప్పారు. ఇందులో రాజకీయాలకు సంబంధించిన విషయాలూ ఉన్నాయ్. ఈ విషయాన్ని బలపచ్చేలా ఉన్నాయ్ ఆస్ట్రో శర్మిష్ఠ..

Baba Vanga's 2025 predictions and Astro Sharmistha on Pawan Kalyan
2025లో ఏం జరగుతుందో ముందే చెప్పిన బాబా వంగా.. దక్షిణాదికి చెందిన ఓ నాయకుడు ప్రపంచ స్థాయిలో పేరు తెచ్చుకుంటారని ప్రస్తావించారు.
లేటెస్ట్‌గా ఆస్ట్రో శర్మిష్ఠ కూడా అదే మాట చెప్పడంతో ఈ వాదన మరింత బలపడింది.
బల్గేరియన్‌కి చెందిన బాబా వంగాకు భవిష్యత్తును చూసే దైవిక శక్తి ఉందని చెబుతారు. ఏం జరుగబోతోందో ఆమె ముందుగా చెప్పిన చాలా ఘటనలు నిజంగానే జరిగాయ్. అందుకే ప్రతి సంవత్సంలో ఏం జరగబోతోందో? బాబా వంగా ఏం చెప్పారు? అనే విషయాలపై ప్రత్యేక చర్చ జరుగుతుంటుంది. ఇప్పటికే 2025కి సంబంధించి బాబా వంగా చేసిన సూచనలు ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించాయి. ఆమె చేసిన సూచనల్లో భూకంపాలు, సునామీ వంటి ప్రకృతి వైపరీత్యాలు కూడా ఉన్నాయి.
2025 గురించి బాబా వంగా చెప్పిన విషయాల్లో.. ఈ ఏడాది ప్రపంచానికి విషాదంతో నిండిన సంవత్సరం, ఇందులో భూకంపాలు, సునామీలతోపాటు చాలా ఊహించని ఘటనలు చోటుచేసుకుంటాయి' అన్నారు. వీటిలో సిరియా పతనం నుంచి తూర్పు, పశ్చిమ దేశాల మధ్య గొప్ప యుద్ధం కూడా ఉండవచ్చు.
వాతావరణానికి సంబంధించి కూడా 2025ను విషాద సంవత్సరంగా అభివర్ణించారు. ఈ సంవత్సరం అంతర్జాతీయ మిషన్ ద్వారా మానవులు ఇతర ప్రపంచాలతో రిలేషన్స్ పెట్టుకుంటారని చెప్పారు. వాతావరణంలో ఆశ్చర్యకరమైన మార్పులు కనిపిస్తాయని.. దీనితోపాటు, యూరప్‌లో వాతావరణ మార్పులు ప్రజలను ఎక్కువగా ప్రభావితం చేస్తాయన్నారు. ఇప్పటివరకూ బాబా చేసిన చాలా విపత్తు సంబంధిత సూచనలు నిజమయ్యాయి. ఢిల్లీలో వచ్చిన భూ ప్రకంపనలు కూడా ఈ కోవకే చెందుతాయి.
హిందూ మతం గురించి కూడా ప్రస్తావించిన బాబా వంగా.. దక్షిణ భారతదేశానికి చెందిన ఒక నాయకుడు ప్రపంచ స్థాయిలో పేరు తెచ్చుకుంటారు. అలాగే రష్యా వంటి శక్తివంతమైన దేశం కూడా హిందూ మతాన్ని ప్రచారం చేస్తుందన్నారు.
ఆస్ట్రో శర్మిష్ఠది కూడా ఇదే మాట
అయితే ఈ విషయంలో బాబా వంగా భవిష్యవాణిని బలపరుస్తూ ప్రముఖ జ్యోతిష్యశాస్త్ర నిపుణురాలు శర్మిష్ఠ.. కూడా ఇదే మాట చెప్పారు. మోదీ తర్వాత జాతీయ రాజకీయాల్లో జెండా ఎగరేవేసే వ్యక్తులు ముగ్గురు అని చెప్పారామె. వారిలో ఫడ్నవీస్, పవన్ కళ్యాణ్, అన్నామలై ఉన్నారన్నారు. ప్రధాని నరేంద్రమోదీకి పవన్ కళ్యాణ్... రాముడికి హనుమంతుడిలాంటి వ్యక్తి అన్నారు. ఇంకా భారత్ - పాక్ యుద్ధం గురించి, ఇరాన్-యుఎస్, రష్యా-ఉక్రెయిన్ మధ్య ఘర్షణ గురించి అంచనా వేశారు ఆస్ట్రో శర్మిష్ఠ. ఇంకా 2029 తర్వాత నరేంద్ర మోదీ ప్రధానిగా కొనసాగుతారా? అమిత్ షా, యోగి, కేజ్రీవాల్ వంటి ఇతర రాజకీయ నాయకుల భవిష్యత్ గురించి కూడా ఈ ఇంటర్యూలో షేర్ చేసుకున్నారామె. అయితే ఎన్నిచెప్పినా.. సౌత్ నాయకులు, ముఖ్యంగా తెలుగువారి కాన్సన్ట్రేషన్ పవన్ కళ్యాణ్ గురించి ఆమె చేసిన కామెంట్స్ దగ్గరే ఆగింది.
Power of Vedic Astrology 🙏
— Kumar (Pawan and Modi Ka Parivar) 🚩 (@JSPWorks) June 30, 2025
Our @AstroSharmistha Ji in an interview to Karan Verma Ji @KARAN_author told that chief @PawanKalyan is one of the trusted Leader of @narendramodi Ji and has a bigger role to play in coming days.
She predicted 💯 True till date including recent Air… https://t.co/6Q7LegAw19 pic.twitter.com/OpSZsnuYRo
మొత్తానికి అప్పటి బాబా వంగా, ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న జ్యోతిష్యశాస్త్ర నిపుణులైన శర్మిష్ట ఇద్దరు చెప్పిన ప్రకారం భవిష్యత్‌తో మోదీ తర్వాత పవన్ కళ్యాణ్ జాతీయ రాజకీయాల్లో ఓ వెలుగు వెలగుతారా అన్నది తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశం





















