Chaturmasya Deeksha 2025: జూలై to అక్టోబర్ ఈ నాలుగు నెలలు ఈ నియమాలు పాటిస్తే ఆరోగ్యం, ఐశ్వర్యం, జీవితంపై సానుకూల ప్రభావం!
Chaturmasya 2025 : చాతుర్మాస వ్రతంలో భాగంగా శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజం, కార్తీకం.. ఈ నాలుగు నెలలు ధర్మం, ఆహారం, ప్రవర్తనకు ప్రాముఖ్యతనిస్తాయి. నియమాలు ఉన్నాయి.

Chaturmasya Deeksha 2025: ఆషాఢమాసం, శ్రావణమాసం, భాద్రపదమాసం, ఆశ్వయుజమాసం... జూలై, ఆగష్టు, సెప్టెంబర్, అక్టోబర్.. ఈ నాలుగు నెలలు చేసేదే చాతుర్మాస్య దీక్ష. ఏటా తొలి ఏకాదశి రోజు ప్రారంభమై కార్తీకమాసంలో వచ్చే ఏకాదశితో ముగుస్తుంది. ఈ నాలుగు నెలల పాటూ ఆధ్యాత్మికంగా, ఆరోగ్యపరంగా అత్యుత్తమ చాతుర్మాస్, ఇది ఆషాఢ శుక్ల పక్షంలోని ఏకాదశి నుండి కార్తీక శుక్ల పక్షంలోని ఏకాదశి వరకు ఉంటుంది.
2025లో చాతుర్మాస్య దీక్ష జూలై 6 న ప్రారంభమైంది.. నవంబరు 01 వరకూ ఉంటుంది. ఈ నాలుగు నెలలు ఆత్మ పరిశీలన, ఆధ్యాత్మిక అభివృద్ధి, పూజలకు అంకిత చేసేందుకు ముఖ్యమైన సమయం. ఈ సమయంలో భక్తులంతా ఉపవాసం, ధ్యానానికి సమయం కేటాయిస్తారు. మత గ్రంథాలను పఠిస్తారు . సంపూర్ణంగా సాత్విక జీవనశైలిని అనుసరిస్తారు. చాతుర్మాస్య దీక్ష 4 నెలల కాలం ఈ నియమాలు పాటిస్తే... జీవితంపై , ఆరోగ్యంపై అత్యంత సానుకూల ప్రభావం చూపిస్తుందని చెబుతారు ఆధ్యాత్మికవేత్తలు.
చాతుర్మాస్య కాలంలో భగవంతుడి ఆరాధానకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు అందుకే ఈ సమయంలో శుభకార్యాలు చాలా తక్కువగా జరుగుతాయి. ఆధ్యాత్మిక గ్రంధాలు పఠించేందేకు, యోగసాధనకు ఇదే సరైన సమయంగా భావిస్తారు. గురు పౌర్ణమి వచ్చేది కూడా ఈ సమయంలోనే. ఈ ఏడాది ఆషాఢ పౌర్ణమి జూలై 10న వచ్చింది. వేదపఠనం, సాధన చేయాలి అనుసునేవారు, గురువు నుంచి దీక్ష తీసుకోవాలి అనుకునేవారు గురు పౌర్ణమి రోజు మంత్రాన్ని పొందుతారు. మంత్రం అనేది అత్యంత పవిత్రమైన ధ్వని. దీనిని గురువు నుంచి స్వీకరిస్తేనే ఆధ్యాత్మిక పురోగతికి సహాయపడుతుంది. ఈ సందర్భంగా గురువు నుంచి స్వీకరించిన మంత్రాన్ని గుప్తంగా ఉంచాలి. సాధన చేయాలి. అప్పుడే ఆధ్యాత్మిక యాత్రలో ముందుకు సాగుతారు. గురువు ఉపదేశించిన మంత్రాన్ని బయటకు చెబితే దాని శక్తి తగ్గుతుందంటారు. అదే జరిగితే సాధకుడి ఆధ్యాత్మిక అభివృద్ధికి ఆటంకం కలుగుతుంది. అంతుకే చాతుర్మాస్య దీక్షలో భాగంగా..గురుపౌర్ణమిని అత్యంత విశిష్టమైన రోజుగా భావిస్తారు.
ఈ నాలుగు నెలలకాలం ఆధ్యాత్మిక సాధన చేస్తారు కానీ ఇంట్లో శుభకార్యాల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహించరు. మాఘమాసంలో మిస్సైనవారు శ్రావణమాసంలో గృహారంభం, వివాహాది కార్యక్రమాలు జరుపుకుంటారు. అయితే వివాహాగి శుభకార్యాల కన్నా హోమాలు, ప్రత్యేక పూజలకు ప్రధానమైన రోజులివి. ఈ నాలుగు నెలల కాలంలో ఉన్న ప్రదేశం నుంచి వేరే ప్రదేశానికి వెళ్లకుండా సాధన చేస్తారు.
చాతుర్మాస్య సమయం...ఆధ్యాత్మికపరంగానే కాదు ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకునేందుకు అనువైన కాలం. రోజువారి జీవనశైలిపై వాతావరణ ప్రభావం చాలా ఉంటుంది. ముఖ్యంగా వానాకాలం కావడం, సూర్య కిరణాల వేడి తగ్గడంతో జీర్ణశక్తి బలహీనపడుతుంది. తీసుకునే ఆహారం, నీటిలో బ్యాక్టీరియా పెరుగుతుంది..అందుకే ఆహారానికి దూరంగా ఉంటూ ఉపవాస నియమాలు పాటించమని చెబుతారు. దైవారాధన కన్నా ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసమే ఉపవాసం చేయమంటారు. మితంగా తినడం, సాత్విక ఆహారం మాత్రమే స్వీకరించడం వల్ల సాత్విక ఆలోచనలు కలిగి, ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుందని పండితులు చెబుతారు.
చాతుర్మాసంలో...
ఈ నాలుగు నెలలు లో నేలపైనే నిద్రించండి
సూర్యోదయానికి ముందే నిద్రలేవండి
సూర్యోదయం కన్నా ముందే స్నానమాచరించి సూర్యుడికి అర్ఘ్యం సమర్పంచండి
వృధా చర్చల్లో పాల్గొనవద్దు, వీలైనంత వరకు మౌనంగా ఉండండి
ఆషాఢం నుంచి కార్తీకమాసం వరకూ మాంసాహారానికి దూరంగా ఉండండి, మితాహారం తీసుకోండి.
అరుణాచలంలో గిరి ప్రదక్షిణ ఏ రోజు చేస్తే మంచిది - పౌర్ణమి వేళ అగ్నిలింగ క్షేత్రంలో భక్తుల రద్దీ ఎందుకుంటుంది... పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి
అరుణాచల గిరిప్రదక్షిణ - ఈ 44 ఎనర్జీ పాయింట్స్ మిస్ చేయొద్దు ..ఇదిగో రూట్ మ్యాప్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి!
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం నమ్మకాలు ఆధారంగా సేకరించింది మాత్రమే. దీనిని పరిగణలోకి తీసుకోవాలా వద్దా అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం. అనుసరించే ముందు మీరు విశ్వసించే నిపుణులు, పండితుల సలహాలు స్వీకరించండి.






















