అన్వేషించండి

Bhagavad Gita Motivational Quotes: జీవితం ఎటుపోతోందో అర్థంకావడం లేదా? అంతా ముగిసిపోయింది అనుకుంటున్నారా..అయితే ఇది మీకోసమే!

Bhagavad Gita: మహాభారత యుద్ధానికి ముందు కృష్ణుడు అర్జునుడికి చెప్పిన ఈ 8 విషయాలు నేటి జీవితంలో వైఫల్యం, కోపం, భయాన్ని తొలగిస్తాయి. జీవితానికి మార్గదర్శకం చేసే రహస్యాలు ఇవే..

 8 Life Changing Secrets of Bhagavad Gita

మన జీవితంలో ఏదో ఒక యుద్ధం జరుగుతూనే ఉంటుంది

కొన్నిసార్లు లక్ష్యాలతో యుద్ధం

మరికొన్నిసార్లు బంధుత్వాలతో యుద్ధం

ఇంకొన్నిసార్లు మనతోనే మనం యుద్ధం చేస్తుంటాం

కొన్నిసార్లు ప్రపంచం అంతా సంతోషంగా ఉన్నట్టు కనిపిస్తుంది.. కానీ మనలో శాంతి ఉండదు
 
ఏం జరుగుతోందో అర్థంకాదు..ఏం చేయాలో తెలియదు..

సమాధానం లేని ప్రశ్నలెన్నో..

మార్గం తెలియక మధ్యలో ఆగిపోయినట్టు అనిపిస్తుంది
 
సరిగ్గా ... మహాభారత కురుక్షేత్ర సంగ్రామ సమయంలో యుద్ధభూమిలో అర్జునుడు కూడా ఇలాగే నిలబడ్డాడు. విరిగిన మనస్సుతో, గందరగోళంతో.   అప్పుడు శ్రీకృష్ణుడు చెప్పిన మాటలు కేవలం ఒక యోధుడి కోసమో, యుద్ధాన్ని గెలిచేందుకో కాదు..జీవితంతో పోరాడుతున్న ప్రతి ఒక్కరికీ వర్తిస్తాయి.

ఈ 8 ఉపదేశాల్లో కేవలం ధర్మం మాత్రమే కాదు, జీవితానికి సంబంధించిన లెక్కలెన్నో ఉన్నాయి. దీన్ని అర్థం చేసుకున్న వ్యక్తి భయం, వైఫల్యం, కోపం, భ్రమ నుంచి బయటకు వచ్చేస్తారు..

ఇవే ఆ 8 కీలక విషయాలు
 
1. కోపం మిమ్మల్ని నాశనం చేస్తుంది

భగవద్గీత 2.63 ప్రకారం, కోపం భ్రాంతిని కలిగిస్తుంది, భ్రాంతి జ్ఞాపకశక్తిని నాశనం చేస్తుంది, జ్ఞాపకశక్తి లేకపోతే బుద్ధి నశిస్తుంది. బుద్ధి లేనివాడు నాశనాన్ని పొందుతాడు. నిజానికి కోపం మిమ్మల్ని ప్రతిదీ కోల్పోయే స్థితికి తీసుకొచ్చేస్తుంది..అవి సంబంధాలు, కెరీర్ , మీ ఆత్మగౌరవం ఏదైనా కావొచ్చు.
 
2. మనస్సును గెలిస్తే, అంతా గెలిచినట్లే

గీతా శ్లోకం 6.6 ప్రకారం, మనస్సును గెలిచిన వ్యక్తికి అది మిత్రుడిగా ఉంటుంది లేకపోతే శత్రువుగా ఉంటుంది. తన కోరికలు, భయాలు, నిరాశ  లోభంపై నియంత్రణ ఉంచుకున్న వ్యక్తిని ఎవరూ ఓడించలేరు.

3. మాట - మౌనం

తెలివితక్కువ వారు మాట్లాడటం ప్రారంభించినప్పుడు, తెలివైనవారు మౌనంగా ఉన్నప్పుడు అది వినాశనానికి దారితీస్తుంది. మౌనంగా ఉండాల్సిన సమయంలో మాట్లాడడం ఎంత తప్పో..మాట్లాడాల్సిన సమయంలో మౌనం కూడా అంతే ప్రమాదం. ఇలాంటి పరిస్థితుల్లో లాభం కన్నా నష్టమే ఎక్కువ జరుగుతుంది

4. జ్ఞానం గొప్ప ఔషధం

నీరు అగ్నిని ఎలా చల్లబరుస్తుందో, అదేవిధంగా జ్ఞానం కోపం - ఆందోళనను శాంతింపజేస్తుంది. ధ్యానం, పఠనం, మౌనం ఇవన్నీ ఇందులో విభాగాలే
 
5. కోపాన్ని అణిచివేసుకోవద్దు

కోపాన్ని అణచివేయడం కన్నా సంయమనంతో వ్యక్తపరచడం మంచిది. మీలోపల మండుతున్నది నెమ్మదిగా మిమ్మల్ని అనారోగ్యానికి గురి చేస్తుంది ఎప్పుడో అప్పుడు పేలిపోయేలా భగ్గు మంటుంది. 

6. నరకానికి 3 ద్వారాలు

త్రివిధ నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః. కామః క్రోధస్తథా లోభస్తస్మాదేతత్త్రయం త్యజేత్. (గీత 16.21).. కోరిక, కోపం, లోభం ఈ మూడింటినీ నియంత్రించలేనివాడు తనను తానే నాశనం చేసుకుంటాడు.

7. కర్మ ఆగిపోతే, విధి కూడా ఆగిపోతుంది

ఇప్పుడు నా విధి బాగాలేదని ఎవరైతే అంటారో విధి ఏర్పడేదే కర్మతో అనే విషయాన్ని మర్చిపోయినట్టే... మీ కర్మలను ఆచరించడం ఎప్పుడూ మానేయకూడదు

8.కోరికలు ఎప్పటికీ తీరవు

కోర్కెలు లేని వ్యక్తి ఉండడు..కానీ ఆ కోర్కెకు సంతృప్తి అనేది కూడా తోడవ్వాలి. సంతృప్తి లేనివారు ఎప్పటికీ సంతోషంగా ఉండలేరు.
 
కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన

ఇది కేవలం గీతలో ఒక వాక్యం మాత్రమే కాదు ఇదే జీవితాన్ని నడిపించే మార్గం

కెరీర్‌లో అనిశ్చితి - కర్మ చేయండి, ఫలితం గురించి చింతించకండి
సంబంధాలలో తగాదాలు - కోపాన్ని అదుపులో ఉంచుకోండి, సంయమనం పాటించండి
స్వీయ పోరాటం - మనస్సును గెలుచుకోండి, అదే నిజమైన విజయం
లక్ష్యానికి ఆటంకం - కర్మ ద్వారానే విధి ఏర్పడుతుంది

ఈ సూత్రాలను నేటి తరం అనుసరిస్తే  మానసిక ఒత్తిడి, సంబంధాల మధ్య గందరగోళం ,  నిర్ణయాల్లో అస్థిరతకు స్పష్టమైన మార్గదర్శకత్వం అందిస్తాయి. అన్నిటికిన్నా మానసిక ఆరోగ్యాన్ని అందిస్తాయి
 
గమనిక: గ్రంధాల నుంచి సేకరించిన, ఆధ్యాత్మికవేత్తలు అందించిన వివరాలు ఇవి. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలి అనేది , విశ్వశించాలా వద్దా అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.  

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ind vs SA 3rd ODI Highlights: జైస్వాల్ తొలి సెంచరీ, రాణించిన రోహిత్, కోహ్లీ.. దక్షిణాఫ్రికాపై 2-1తో వన్డే సిరీస్ కైవసం
జైస్వాల్ తొలి సెంచరీ, రాణించిన రోహిత్, కోహ్లీ.. దక్షిణాఫ్రికాపై 2-1తో వన్డే సిరీస్ కైవసం
CM Revanth Reddy: కేటీఆర్ బీఆర్ఎస్‌ను సమాధి చేస్తాడు - మంచి రోజులు ఎలా వస్తాయి? - కేసీఆర్‌కు రేవంత్ కౌంటర్
కేటీఆర్ బీఆర్ఎస్‌ను సమాధి చేస్తాడు - మంచి రోజులు ఎలా వస్తాయి? - కేసీఆర్‌కు రేవంత్ కౌంటర్
Adulterated Liquor Scam Charge Sheet: జోగి రమేష్ అండతో అద్దేపల్లి సోదరుల నకిలీ లిక్కర్ దందా - విజయవాడ ఎక్సైజ్ కోర్టులో 8 మందిపై చార్జ్ షీట్
జోగి రమేష్ అండతో అద్దేపల్లి సోదరుల నకిలీ లిక్కర్ దందా - విజయవాడ ఎక్సైజ్ కోర్టులో 8 మందిపై చార్జ్ షీట్
RGV ఊర్మిళ: రంగీలా బ్యూటీతో అఫైర్ గురించి ఫస్ట్ టైమ్ మాట్లాడిన రామ్ గోపాల్ వర్మ! అసలు నిజం ఇదేనా?
RGV ఊర్మిళ: రంగీలా బ్యూటీతో అఫైర్ గురించి ఫస్ట్ టైమ్ మాట్లాడిన రామ్ గోపాల్ వర్మ! అసలు నిజం ఇదేనా?

వీడియోలు

Ind vs SA 3rd ODI Highlights | సెంచరీతో సత్తా చాటిన జైశ్వాల్..సిరీస్ కొట్టేసిన భారత్ | ABP Desam
Virat Kohli Records in Vizag Stadium | వైజాగ్ లో విరాట్ రికార్డుల మోత
Team India Bowling Ind vs SA | తేలిపోయిన భారత బౌలర్లు
Smriti Mandhana Post after Wedding Postponement | పెళ్లి వాయిదా తర్వాత స్మృతి తొలి పోస్ట్
India vs South Africa 3rd ODI Preview | వైజాగ్ లో మూడో వన్డే మ్యాచ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ind vs SA 3rd ODI Highlights: జైస్వాల్ తొలి సెంచరీ, రాణించిన రోహిత్, కోహ్లీ.. దక్షిణాఫ్రికాపై 2-1తో వన్డే సిరీస్ కైవసం
జైస్వాల్ తొలి సెంచరీ, రాణించిన రోహిత్, కోహ్లీ.. దక్షిణాఫ్రికాపై 2-1తో వన్డే సిరీస్ కైవసం
CM Revanth Reddy: కేటీఆర్ బీఆర్ఎస్‌ను సమాధి చేస్తాడు - మంచి రోజులు ఎలా వస్తాయి? - కేసీఆర్‌కు రేవంత్ కౌంటర్
కేటీఆర్ బీఆర్ఎస్‌ను సమాధి చేస్తాడు - మంచి రోజులు ఎలా వస్తాయి? - కేసీఆర్‌కు రేవంత్ కౌంటర్
Adulterated Liquor Scam Charge Sheet: జోగి రమేష్ అండతో అద్దేపల్లి సోదరుల నకిలీ లిక్కర్ దందా - విజయవాడ ఎక్సైజ్ కోర్టులో 8 మందిపై చార్జ్ షీట్
జోగి రమేష్ అండతో అద్దేపల్లి సోదరుల నకిలీ లిక్కర్ దందా - విజయవాడ ఎక్సైజ్ కోర్టులో 8 మందిపై చార్జ్ షీట్
RGV ఊర్మిళ: రంగీలా బ్యూటీతో అఫైర్ గురించి ఫస్ట్ టైమ్ మాట్లాడిన రామ్ గోపాల్ వర్మ! అసలు నిజం ఇదేనా?
RGV ఊర్మిళ: రంగీలా బ్యూటీతో అఫైర్ గురించి ఫస్ట్ టైమ్ మాట్లాడిన రామ్ గోపాల్ వర్మ! అసలు నిజం ఇదేనా?
CM Revanth Reddy: గచ్చిబౌలి బాలయోగి స్టేడియంలో రేసింగ్ లీగ్.. హాజరైన సీఎం రేవంత్ రెడ్డి, సల్మాన్ ఖాన్
గచ్చిబౌలి బాలయోగి స్టేడియంలో రేసింగ్ లీగ్.. హాజరైన రేవంత్ రెడ్డి, సల్మాన్ ఖాన్
Discount On Cars: టాటా, మారుతి కార్లపై భారీ డిస్కౌంట్! గరిష్టంగా 1 లక్షకు పైగా బెనిఫిట్స్ మీ సొంతం
టాటా, మారుతి కార్లపై భారీ డిస్కౌంట్! గరిష్టంగా 1 లక్షకు పైగా బెనిఫిట్స్ మీ సొంతం
Telangana Rising Summit:  పెట్టుబడుల సదస్సుకు పబ్లిక్ టచ్ -  రైజింగ్ సమ్మిట్‌ను జనానికి దగ్గర చేస్తున్న సీఎం రేవంత్
పెట్టుబడుల సదస్సుకు పబ్లిక్ టచ్ - రైజింగ్ సమ్మిట్‌ను జనానికి దగ్గర చేస్తున్న సీఎం రేవంత్
Bogapuram vs Vijayawada: పరుగులు పెడుతున్న బోగాపురం - నత్తనడకన విజయవాడ టెర్మినల్ -  తెప్పవరిది?
పరుగులు పెడుతున్న బోగాపురం - నత్తనడకన విజయవాడ టెర్మినల్ - తెప్పవరిది?
Embed widget