Mayasabha : మయసభ కాదు మాయాసభ, వైజ్ఞానిక అద్భుతం, నిర్మాణానికి ఎన్నాళ్లు పట్టిందో తెలుసా?
Mayasabha in Mahabharata: మయసభ.. ఇది మయసభ కాదు మాయాసభ. అంటే ఉన్నదిలేనట్టు లేనిది ఉన్నట్టు కనిపించే వైజ్ఞానిక అద్భుతం. పాండవులపై కృతజ్ఞతగా మయుడు నిర్మించి ఇచ్చిన ఈ భవనం గురించి తెలుసా?

Mayasabha : అగ్నిదేవుడు తన ఆకలి తీర్చుకునేందుకు కాండవ వనాన్ని దహనం చేస్తాడు. ఆ సమయంలో మంటల్లో చిక్కుకున్న దానవ శిల్పి మయుడిని పాండవులు రక్షిస్తారు. ఇందుకు ప్రతిగా ఏం కావాలో చెప్పమని అడిగాడు మయుడు. అక్కడే ఉన్న శ్రీకృష్ణుడు స్పందిస్తూ ధర్మరాజు వైభవానికి తగినట్లు ఓ భవనం నిర్మించి ఇవ్వమని అన్నాడు. ఈ భూమిపై ధర్మజుడికి సమానమైన రాజు లేడు..అందుకు తగ్గట్టుగా భవనాన్ని నిర్మిస్తానని మాటిచ్చాడు.
వృషపర్వుడనే రాజుకోసం సభ నిర్మించి ఇచ్చేందుకు అన్ని ఉపకరణాలు సమకూర్చుకున్నాను కానీ అది కార్యరూపం దాల్చలేదని చెప్పిన మయుడు...ఆ ఉపకరణాలు తీసుకొచ్చి అద్భుతమైన భవనం నిర్మిస్తానని చెప్పాడు. నీటికి బదులుగా ఇంద్రనీల మణులు, నీటిలో పద్మాలకోసం పద్మరాగ మణులు, రజతంతో తెల్లని తామరలు రాజహంసలు, వజ్రాలతో చేపలు, ముత్యాలతో నురగ, మరకతమణులతో నాచుని రూపొందించాడు. వీటితో పాటూ చెట్లు, పక్షులు, పక్షిగూళ్లు సహా భవనం మొత్తం రత్నకాంతులతో వెలిగిపోయేలా తీర్చిదిద్దాడు. దీని నిర్మాణానికి పట్టిన సమయం 14 నెలలు. ఇదే దుర్యోధనుడి అసూయకు కారణమైంది.
మయుడు నిర్మించిన భవనంలోకి ప్రవేశించేందుకు ఓ ముహూర్తం నిర్ణయించుకున్నారు. ఈ సందర్భంగా రాజసూయయాగం (Rajasuya Yagya ) తలపెట్టాడు ధర్మరాజు. ఇందులో భాగంగా వివిధ దేశాధినేతలను, సామంతరాజులను ఆహ్వానించాడు. ఈ సభన చూసి భ్రాంతిని కలిగించే ప్రదేశంలో భ్రమపడి అవమానపడ్డాడు దుర్యోధనుడు. ఇదే పాండవులపై వైరాన్ని మరింత పెంచింది.
ఈ నగరానికి ఇంద్రప్రస్థం (Indraprastha) అనే పేరు..ఎందుకంటే ఇంద్రుడి స్వర్గంతో సమానంగా ఉండే నిర్మాణం కావడంతో ఇంద్రప్రస్థం అనే పేరు పెట్టారు. ధర్మరాజు ఇంద్రప్రస్థం నుంచి ధర్మంగా పరిపాలన సాగించాడు. ఈ నగరం సంపద, సంస్కృతి, శక్తికి చిహ్నంగా నిలిచింది. ఇంద్రప్రస్థం పాండవుల గొప్పతనాన్ని శ్రీకృష్ణుడితో వారి బంధాన్ని సూచిస్తుంది. ఈ ఇంద్రప్రస్థం ఢిల్లీలో పురానా ఖిలా సమీప ప్రాంతంతో సంబంధం కలగి ఉండొచ్చని పురావస్తు శాస్త్రవేత్తలు భావిస్తారు..కానీ వీటికి సంబంధించి ఖచ్చితమైన ఆధారాలు లేవు.
మానవ జీవితంలో భ్రమకి-వాస్తవానికి మధ్య నడిచే మార్గానికి ప్రతీక మయసభ. తృప్తికి, భద్రతకు, గౌరవానికి హామీ ఉండదు..అహంకారానికి, అసూయకు చోటిస్తే ప్రజ్ఞనాశనం అవుతుందనే గొప్ప సందేశం ఈ మయసభ.
మయసభ అనేది కేవలం శిల్పకళా సౌందర్యం మాత్రమే కాదు వైజ్ఞానిక అద్భుతం. కాంతిపరావర్తనం, అద్దంలో ప్రతిబింబం కనిపించడం, అదే బింబం ఇంద్రధనస్సులా వికృతి పొందడం , ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు..ఇలాంటి వైజ్ఞానికి అద్భుతాల నిలయం మయసభ.
మానవమేధస్సుకి అందని వైజ్ఞానిక అద్భుతాలు మహాభారతంలో ఎన్నో ఉన్నాయ్. సాంకేతికత, లైవ్ టెలికాస్ట్, టెస్ట్‌ట్యూబ్ బేబీ, సరోగసీ, అణ్వాయుధాలు సహా భారతదేశంలో లేనిది ఏదీ లేదంటూ వేదవ్యాసుడు మహాభారతంలో ప్రస్తావించారు. ఇక దక్షిణ అమెరికా పెరులో మయాన్ నాగరికత మూలపురుషుడు మయుడు.
మహాభారత యుద్ధంలో ఏరోజు ఎంతమంది చనిపోతారో ముందు రోజు రాత్రే క్లారిటీ ఇచ్చేసిన కృష్ణుడు...ఈ వివరాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి
మహాభారతం ప్రకారం విజయం, సంతోషం కోసం నిత్యం ఈ నాలుగు పాటించాలి.. పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి






















