Remedy to Enhance Aura: 'గాసిప్స్' వద్దు, త్వరగా ముసలైపోతారట! మీ అందం పెంచుకునేందుకు ఆధ్యాత్మిక మార్గం ఇదే!
Gossip from perspective of Ayurveda: మనం మాట్లాడే మాటల్లో శక్తి దాగి ఉంటుంది. ఆయుర్వేదం ప్రకారం, గాసిప్స్ మన తేజస్సును తగ్గిస్తుంది.

Best Techniques to Improve Your Aura: ఆయుర్వేదం కేవలం శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచే ఒక విధానం మాత్రమేకాదు... ఇది ఒక సంపూర్ణమైన జీవనశైలి. ఇందులో మీ ఆహారం, ప్రవర్తన, ఆలోచనలు, మాటలకు కూడా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. మీ మాటలు ధ్వని మాత్రమే కాదు, వాటిలో శక్తి కూడా ఉంటుంది, ఇది మీ ప్రకాశం (Aura) మీద మంచి మరియు చెడు ప్రభావాలను చూపిస్తుంది. గాసిప్ (gossip) సమయం వృధా మాత్రమే కాదు, మీ ఆభామండలం జీవశక్తిని కూడా దొంగిలిస్తుందని మీరు ఎప్పుడైనా అనుకున్నారా?
మాటల్లో శక్తి ఉంటుంది
ఆయుర్వేదంలో మాటను (వాక్) పవిత్రంగా భావిస్తారు. ప్రతి మాటలోనూ శక్తి ఉంటుంది, అది మీలోపల - బయట ప్రభావం చూపిస్తుంది. మీరు నకారాత్మక, విమర్శనాత్మక లేదా అవసరంలేని మాటల్లో పాల్గొన్నప్పుడు, మీరు మీ ఓజస్ తగ్గించుకుంటారు.
ఓజస్ అంటే ఏమిటి?
ఓజస్ అనేది మీ శరీరం, మనస్సు , ఆత్మ యొక్క జీవశక్తిని నిలుపుకునే ఒక సూక్ష్మ అంశం. ఇది మీ సహజ ప్రకాశాన్ని, మానసిక స్థిరత్వాన్ని, రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. ప్రకాశించే వ్యక్తి శాంతంగా, ఆకర్షణీయంగా , ఆత్మవిశ్వాసంతో కనిపిస్తారు. కానీ గాసిప్, కోపం లేదా నింద వంటి ప్రవర్తన ఈ శక్తిని క్షీణింపజేస్తుంది.
గాసిప్ ఎందుకు ప్రమాదకరం?
గాసిప్ చెప్పినా లేదా వినడం వల్ల మీ సూక్ష్మ శరీరం ఒత్తిడికి గురవుతుంది.
ఇది వాత , రజో గుణాలను ఉత్తేజితం చేస్తుంది, దీనివల్ల మానసిక అస్థిరత పెరుగుతుంది.
గాసిప్‌తో ముడిపడి ఉన్న సమస్యలు
మానసిక అలసట గందరగోళం
శక్తి కోల్పోవడం
నిద్రలేమి లేదా disturbed sleep
భావోద్వేగ అసమతుల్యత
ప్రకాశం (Aura) తగ్గిపోవడం
ఆయుర్వేదం ప్రకారం మీ సూక్ష్మ శరీరం ప్రతి సంభాషణను 'రికార్డ్' చేస్తుంది. ప్రతికూల విషయాలు వినడం కూడా మీ శక్తిపై ప్రభావం చూపుతుంది. దీనివల్ల మీరు కారణం లేకుండా ఆందోళన, అలసట లేదా ఒత్తిడిని అనుభవించవచ్చు.
| మాటలను ఎలా శుద్ధి చేయాలి? |
| రోజులో కొంత సమయం మౌనం పాటించండి. ఇది మానసిక పోషణను ఇస్తుంది. |
| కంఠ చక్రం శుద్ధి కోసం మంత్రాలను జపించండి. ఉదాహరణకు- "ఓం నమః శివాయ" |
| సత్యమైనవి, ఇష్టమైనవి, అవసరమైనవి మాట్లాడండి. ఇది వాక్ శుద్ధికి మూలమంత్రం. |
| గాసిప్ చేసే ముందు మిమ్మల్ని మీరు ఈ ప్రశ్న వేసుకోండి. |
| ఆలోచించి మాట్లాడటం కేవలం మర్యాద మాత్రమే కాదు, ఇది ఒక ఆధ్యాత్మిక అభ్యాసం. |
| మీరు సానుకూలంగా ఉద్దేశపూర్వకంగా మాట్లాడినప్పుడు, అది మీ ప్రకాశాన్ని మెరుగుపరుస్తుంది. |
ఆయుర్వేదంలో అందం కేవలం శరీరం యొక్కది కాదు, శక్తి యొక్కది. మీ దుస్తులు లేదా అలంకరణ కాదు, మీ శాంతియుతమైన మాటలు, శక్తి మిమ్మల్ని ఆకర్షణీయంగా చేస్తాయి. అందువల్ల గాసిప్ కాదు, మౌనాన్ని ఎంచుకోండి. ఇది మీ ప్రకాశాన్ని పెంచుతుంది.
గమనిక: వివిధ శాస్త్రాలు, గ్రంథాలు, పండితులు పేర్కొన్న కొన్ని ఆధ్యాత్మిక అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ బాధ్యత వహించదని గమనించగలరు. ఈ సమాచారం లేదా నమ్మకాన్ని ఆచరించే ముందు, సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.
శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం - సులభమైన పూజా విధానం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
శ్రీవరలక్ష్మీ వ్రతకథ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి






















