అన్వేషించండి

Sravan Month 2023: జూలై 18 నుంచి అధిక శ్రావణం ప్రారంభం, వరలక్ష్మీ వ్రతం ఎప్పుడు చేసుకోవాలి!

ఈ ఏడాది అధిక శ్రావణం వచ్చింది. అంటే శ్రావణమాసం 2 నెలలు ఉంటుంది. హిందువులకు అత్యంత ముఖ్యమైన శ్రావణంలో నోములు, వ్రతాలు చాలా ఉంటాయి. ఇంతకీ అవన్నీ ఎప్పుడు జరుపుకోవాలి అనే సందేహం ఉండేవారికోసమే ఈ వివరణ

Sravan Month 2023:  శ్రావణ మాసం వచ్చిందంటే ప్రతి ఇంట్లో ఆధ్యాత్మికత వెల్లివిరుస్తుంది. ఉదయం, సాయంత్రం పూజా కార్యక్రమాల్లో ఇళ్లు కళకళలాడిపోతుంటాయి. హిందూ సనానత ధర్మం ప్రకారం శ్రావణమాసానికి ఎంతో విశిష్ఠత ఉంది. పౌర్ణమి రోజు చంద్రుడు శ్రవణం నక్షత్రంలో సంచరించడం వల్ల ఈ మాసానికి శ్రవణం అనే పేరొచ్చింది. తెలుగు పంచాంగం ప్రకారం 

శ్రావణం ఎప్పుడు మొదలు

శ్రావణం వచ్చిందంటే ప్రతి ఇంట్లోనూ ఆధ్యాత్మికత వెల్లివిరుస్తుంది. ఉదయం, సాయంత్రం పూజాది కార్యక్రమాలు జరుగుతుంటాయి. హిందూ సనాతన ధర్మం ప్రకారం, తెలుగు మాసాల్లో శ్రావణ మాసానికి ఎంతో విశిష్టత ఉంది. హిందూ సాంప్రదాయం ప్రకారం శ్రావణ మాసాన్ని అత్యంత పవిత్రమైన నెలగా పరిగణిస్తారు. తెలుగు సంవత్సరంలో ఐదో నెల శ్రావణ మాసం. ఏటా జులై, ఆగస్టు నెలల్లో వస్తుంది. పౌర్ణమి రోజుల చంద్రుడు శ్రవణం నక్షత్రంలో కలిసిన రోజు కాబట్టి ఈ నెలను శ్రావణం అంటారు. తెలుగు పంచాంగం ప్రకారం జులై 18వ తేదీ నుంచి శ్రావణ మాసం మొదలు కానుంది. ఈ సంవత్సరం అధికమాసం కావడం వల్ల మొదట వచ్చేది అధిక శ్రావణమాసం అంటారు. నిజ శ్రావణమాసం ఆగస్టు 17 నుంచి మొదలై సెప్టెంబరు 15 వరకూ ఉంటుంది. దక్షిణాయణంలో వచ్చే అత్యంత విశిష్టమైన నెల శ్రావణం.ఈ నెలలో లక్ష్మీఆరాధన, గౌరీ ఆరాధనతో పాటూ శివారాధన అత్యంత పుణ్యఫలం అని భావిస్తారు భక్తులు. 

Also Read: ఈ ఏడాది శ్రావణం అధికమాసం, ఇంతకీ అధికమాసం - క్షయమాసం అంటే ఏంటి!

అధికమాసంలో పూజలు తగదు

అధిక మాసం అనుష్ఠానాలకు, జపతపాలకు విశిష్టమైంది. యధాశక్తి దాన ధర్మాలు, సంతర్పణలు చేయడం మంచిది. పితృకార్యాలు మాత్రం యథావిధిగా నిర్వహించాలని శాస్త్రం చెబుతోంది. కాని నిజమాసంలో జరిగే పూజలు, నోములేవీ అధికమాసంలో నిర్వహించరు. అందుకే మంగళగౌరి వ్రతం ఆచరించేవారు, శ్రావణశుక్రవారం వరలక్ష్మీ వ్రతం చేసేవారు నిజ శ్రావణంలోనే చేస్తారు. అధికమాసాన్ని అస్సలు పరిగణలోకి తీసుకోరు. 
పండుగలన్నీ నిజ శ్రావణంలోనే వస్తాయి. శ్రావణమాసంలో మంగళగౌరీ వ్రతం చేసేవారికోసం ఈ ఏడాది నాలుగు మంగళవారాలు( ఆగస్టు 22, 29 సెప్టెంబరు 4, 11) మాత్రమే వచ్చాయి. శ్రావణ శుక్రవారం ఆగస్టు 25న వచ్చింది. 

Also Read: వీధిపోటు ఈ దిశగా ఉంటే ఆస్తి నష్టం, కోర్టు కేసులు - ఆ 4 దిశల్లో ఉంటే ఆయుష్షు, ఐశ్వర్యం!

ఈసారి శ్రావణమాసంలో వచ్చే పండుగల వివరాలు-తేదీలు ఇవే!

  • రాయలసీమలో నాగులచవితి- ఆగస్టు 20
  • నాగ పంచమి, గరుడ పంచమి - ఆగస్టు 21
  • శ్రావణ మంగళగౌరీ వ్రతం - ఆగస్టు 22
  • దూర్వాష్టమి - ఆగస్టు 24
  • వరలక్ష్మీ వ్రతం - ఆగస్టు 25
  • రాఖీ పౌర్ణమి - ఆగస్టు 30
  • శ్రీ కృష్ణ జన్మాష్టమి - సెప్టెంబర్ 6
  • గోకులాష్టమి - సెప్టెంబర్ 7
  • సెప్టెంబరు 14 పోలాల అమావాస్య

శ్రావణం శివుడికి ప్రీతికరం
శ్రావణమాసం అంటే కేవలం అమ్మవారి పూజలు,నోములు మాత్రమే కాదు పరమేశ్వరుడికి కూడా అత్యంత ప్రీతికరమైన మాసం. శ్రావణమాసంలో వచ్చే ప్రతిసోమవారం శివపూజ తప్పనిసరిగా చేయాలంటారు పండితులు. ఈ నెలలో ఎన్నో మంచి రోజులు, విశిష్ట పండుగలు  ఉండడం వల్లే శుభకార్యాలు ఎక్కువగా శ్రావణంలో నిర్వహిస్తారు.

Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Politics: విపక్ష పాత్ర కూడా కూటమిదే - పవన్ కల్యాణ్ మాస్టర్ ప్లాన్ - వైసీపీకి అర్థమవుతోందా ?
విపక్ష పాత్ర కూడా కూటమిదే - పవన్ కల్యాణ్ మాస్టర్ ప్లాన్ - వైసీపీకి అర్థమవుతోందా ?
Telangana Politics: కులగణనతో బీసీల్లో చాంపియన్ అయ్యే వ్యూహం - రేవంత్ రెడ్డి ప్లాన్ అదేనా ?
కులగణనతో బీసీల్లో చాంపియన్ అయ్యే వ్యూహం - రేవంత్ రెడ్డి ప్లాన్ అదేనా ?
Vizianagaram MLC: విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో వైసీపీకే పూర్తి మెజార్టీ - టీడీపీ పోటీ చేస్తుందా ?
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో వైసీపీకే పూర్తి మెజార్టీ - టీడీపీ పోటీ చేస్తుందా ?
Game Changer Teaser Release: హైదరాబాద్, చెన్నై, ముంబైలో కాదు... 'గేమ్ చేంజర్' టీజర్ రిలీజ్‌కు రామ్ చరణ్ నయా ప్లాన్!
హైదరాబాద్, చెన్నై, ముంబైలో కాదు... 'గేమ్ చేంజర్' టీజర్ రిలీజ్‌కు రామ్ చరణ్ నయా ప్లాన్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పవన్ కల్యాణ్ కడుపు మంటతో మాట్లాడి ఉంటారు - హోం మంత్రి స్పందనAndhra Pradesh Assembly on Nov 11th | వైసీపీనే వెంటాడుతూనే ఉన్న 11వ నెంబర్ | ABP DesamKasturi Entry Telangana Politics | జనసేనలో చేరుతున్న నటి కస్తూరీ..? | ABP DesamKasturi Insult Telugu People | తెలుగువాళ్లపై నోరు పారేసుకున్న కస్తూరి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Politics: విపక్ష పాత్ర కూడా కూటమిదే - పవన్ కల్యాణ్ మాస్టర్ ప్లాన్ - వైసీపీకి అర్థమవుతోందా ?
విపక్ష పాత్ర కూడా కూటమిదే - పవన్ కల్యాణ్ మాస్టర్ ప్లాన్ - వైసీపీకి అర్థమవుతోందా ?
Telangana Politics: కులగణనతో బీసీల్లో చాంపియన్ అయ్యే వ్యూహం - రేవంత్ రెడ్డి ప్లాన్ అదేనా ?
కులగణనతో బీసీల్లో చాంపియన్ అయ్యే వ్యూహం - రేవంత్ రెడ్డి ప్లాన్ అదేనా ?
Vizianagaram MLC: విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో వైసీపీకే పూర్తి మెజార్టీ - టీడీపీ పోటీ చేస్తుందా ?
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో వైసీపీకే పూర్తి మెజార్టీ - టీడీపీ పోటీ చేస్తుందా ?
Game Changer Teaser Release: హైదరాబాద్, చెన్నై, ముంబైలో కాదు... 'గేమ్ చేంజర్' టీజర్ రిలీజ్‌కు రామ్ చరణ్ నయా ప్లాన్!
హైదరాబాద్, చెన్నై, ముంబైలో కాదు... 'గేమ్ చేంజర్' టీజర్ రిలీజ్‌కు రామ్ చరణ్ నయా ప్లాన్!
US Presidential Election 2024: సాయంత్రం 4.30కి యుఎస్ ఎన్నికల ఓటింగ్ ప్రారంభం- సర్వేలు ఏం చెబుతున్నాయి?
సాయంత్రం 4.30కి యుఎస్ ఎన్నికల ఓటింగ్ ప్రారంభం- సర్వేలు ఏం చెబుతున్నాయి?
Thandel: సేఫ్ జోన్‌లో 'తండేల్' నిర్మాతలు - 80 కోట్ల బడ్జెట్ మూవీ వాయిదా పడినా నష్టం లేదా?
సేఫ్ జోన్‌లో 'తండేల్' నిర్మాతలు - 80 కోట్ల బడ్జెట్ మూవీ వాయిదా పడినా నష్టం లేదా?
Telangana: బీసీ రిజర్వేషన్ల కోసం స్పెషల్ కమిషన్ ఏర్పాటు, తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు
బీసీ రిజర్వేషన్ల కోసం స్పెషల్ కమిషన్ ఏర్పాటు, తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు
Andhra Pradesh Assembly on Nov 11th | వైసీపీనే వెంటాడుతూనే ఉన్న 11వ నెంబర్ | ABP Desam
Andhra Pradesh Assembly on Nov 11th | వైసీపీనే వెంటాడుతూనే ఉన్న 11వ నెంబర్ | ABP Desam
Embed widget