By: ABP Desam | Updated at : 23 Apr 2022 01:15 PM (IST)
Edited By: RamaLakshmibai
Spirituality
మూడు సార్లు శాంతి మంత్రాన్ని చెప్పడం వెనుక ఆంతర్యం ఏంటంటే...
1 ఆధ్యాత్మిక ...
2 ఆదీ దైవిక ...
3 ఆది భౌతిక...
మొదటి " శాంతి "
ప్రకృతి పరంగా సంభవించే ( భూకంపాలు / అగ్నిప్రమాదాలు / వరదలు / తుఫాన్లు ) ఉపద్రవాలు వలన ఏవిధమైన ఆపదలు కలగకుండా మానవాళిని రక్షించమని అర్థం. దీన్ని ఆధ్యాత్మిక శాంతి అంటారు.
రెండవ " శాంతి "
మనం, మన చుట్టూ ఉన్నవారు, పరిసరాలు, అంతా బావుండాలని, శారీరక , మానసిక పరంగా సంభవించే ఉపద్రవం ( అనారోగ్యం ) నుంచి ఉపశమనం పొందడానికి, అందరిపైనా దేవుడి అనుగ్రహం, ఆశీస్సులు ఉండాలని ప్రార్థించేదే ఆదీ దైవిక శాంతి అంటారు.
మూడవ " శాంతి "
ఇతర జీవరాశుల నుంచి , మనుషుల నుంచి ఏ విధమైన ఆపదలు, ముప్పు సంభవించకుండా సురక్షితంగా ఉండేందుకు మూడో శాంతి మంత్రం పఠిస్తారు. దీన్ని ఆది భౌతికము అంటారు.
ఈ మూడు ఉపద్రవాలనుంచీ రక్షించమని వేడుకుంటూ వేదం చివర్లో " శాంతి " పదాన్ని మూడు సార్లు ఉచ్చరిస్తారు
Also Read: ఉద్యోగం, వ్యాపారం, విద్య, సంతానం- మీ సమస్యను బట్టి మీరు పఠించాల్సిన శ్లోకాలివే
తైత్తిరీయ ఉపనిషత్తు, కథా ఉపనిషత్తు, శ్వేతాశ్వతార ఉపనిషత్తులలో శాంతి మంత్రం
ఓం సహ నావవత్తు |
సహ నౌ భునక్తు |
సహ వీర్యం కరవావహై |
తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై ||
ఓం శాంతిః శాంతిః శాంతిః ||
బృహదారణ్యక ఉపనిషత్తు, ఈశావాస్య ఉపనిషత్తులో శాంతి మంత్రం
ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే |
పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే ||
ఓం శాంతిః శాంతిః శాంతిః ||
నమః శంభవేచ మయోభవేచ
నమః శంకరాయచ
మయస్కరాయచ
నమః శ్శివాయచ శివతరయాచ
ఈశాన సర్వ విద్యానాం
ఈశ్వర సర్వభూతానాం
బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి
బ్రహ్మా శివోమే అస్తు సదా శివోం
ఓం శాంతిః శాంతిః శాంతిః ||
దేవుడిని పూజించినప్పుడు మనకోసమే కాకుండ మనతో సహా జీవింవించే సాటి ప్రాణులను, ప్రకృతిని ఈ సృష్టిలోని సమస్తం బాగుండాలని కోరుకుంటేనే మనం బాగుంటాం. అందరూ బాగుంటే అందులో మనం ఉంటాం. కేవలం మనమే బాగుండాలి అంటే అది రాక్షసత్వం అవుతుంది. మనం కోరుకునేది శాశ్వతమైన దైవత్వ ఆనందమా...లేక అశాశ్వతమైన రాక్షసత్వ స్వభావమా అన్నది ఆలోచించుకోవాలి. మనం చేసే పనిలో ఏది మంచి,చెడు అనే విషయం మన అంతరాత్మ చెబుతుంది. అది అర్థం చేసుకుని వ్యవహరిస్తే అంతా మంచే జరుగుతుంది.
Also Read: పక్కవాళ్లకు స్వీట్ ఇవ్వకుండా తింటే కూడా పాపమే? గరుడ పురాణంలో ఘోరమైన శిక్ష?
Also Read: పాండవుల విజయం కోసం అర్జునుడి కొడుకును పెళ్లి చేసుకున్న శ్రీకృష్ణుడు
Tirumala News : తిరుమలకు పోటెత్తిన భక్తులు, శ్రీవారి దర్శనానికి 48 గంటలు పట్టే అవకాశం!
Horoscope Today 28th May 2022: ఈ రాశులవారు తమ పనిని పక్కవారికి అప్పగించేందుకు ప్లాన్ చేస్తారు, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి
Today Panchang 28 May 2022: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, దుఃఖం, శనిని ప్రశన్నం చేసుకునే శాంతిమంత్రం
Shani Trayodashi: ఈ ఆలయానికి వెళ్లినవారు దర్శనానంతరం వెనక్కు తిరిగి చూడకూడదు!
Shri Nimishamba Devi Temple: పెళ్లి కాని ప్రసాద్లకు గుడ్న్యూస్, ఈ అమ్మవారిని దర్శించుకుంటే ఓ ఇంటివారైపోతారట
Ysrcp Bus Yatra : సామాజిక న్యాయమే సీఎం జగన్ ఫిలాసఫీ, నరసరావుపేట సభలో మంత్రులు
Redmi 11 5G Launch: రెడ్మీ చవకైన 5జీ ఫోన్ వచ్చేస్తుంది - జూన్లోనే లాంచ్ - ధర లీక్!
Beer With Urine: నీళ్లు సేవ్ చేసేందుకు మూత్రంతో బీర్ తయారీ, మీ బ్రాండ్ ఇది కాదు కదా?
Dhaakad box office collection: కంగనా సినిమాకి దారుణమైన కలెక్షన్స్ - 20 టికెట్లు మాత్రమే అమ్ముడుపోయాయి!