News
News
వీడియోలు ఆటలు
X

మీ ఇంట్లో ఇలాంటివి జరుగుతుంటే, దుష్టశక్తులు తిష్ట వేశాయని అర్థం - ఇలా చేస్తే సేఫ్!

కొన్ని ఇళ్లలో ఇలా ప్రశాంతంగా ఉండదు. అలాంటి ఇంటిలో నెగెటివ్ ఎనర్జీ చేరి ఉండొచ్చు. నెగెటివ్ ఎనర్జీ చేరినప్పుడు ఎలాంటి లక్షణాలు ఉంటాయి?

FOLLOW US: 
Share:

ల్లు అనేది ఒక గొప్ప రిలాక్సింగ్ ఫీలింగ్. నాలుగు రోజులు ఇల్లు వదిలి ఊర్లు తిరిగి వస్తే తెలుస్తుంది ఇంటి విలువ ఎవరికైనా. ఇల్లు ఇచ్చే సంతృప్తి ఇంకే స్వర్గమూ ఇవ్వదు. మనదన్న భావన అంత బలమైంది. ఇది కేవలం మానసికమైన మన భావన మాత్రమే అనుకుంటే తప్పే. ప్రతి నిర్మాణానికి ఒక ఎనర్జీ ఉంటుంది. అది పాజిటివ్ కావచ్చు, ఒక్కోసారి నెగెటివ్ కావచ్చు. పాజిటివ్ ఎనర్జీతో ఉండే ఇళ్లు ప్రశాంతంగా ఉంటాయి. ఆ ఇంట్లోకి అడుగు పెట్టగానే ఒక రకమైన హాయి భావన కలుగుతుంది. కొన్ని ఇళ్లలో ఇలా ప్రశాంతంగా ఉండదు. అలాంటి ఇంటిలో నెగెటివ్ ఎనర్జీ (దుష్ట శక్తి) చేరి ఉండొచ్చు. నెగెటివ్ ఎనర్జీ చేరినపుడు ఎలాంటి లక్షణాలు ఉంటాయి? ఎలా తెలుసుకోవాలనే విషయాలు తెలిస్తే దాన్ని పారద్రోలేందుకు ప్రయత్నం చెయ్యవచ్చు. ఆ విషయాలు ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

దుష్ట శక్తికి సంకేతాలు

 • అర్థ రాత్రి అకస్మాత్తుగా మెలకువ వస్తుంది.
 • ఇంట్లో పెంచుకుంటున్న మొక్కలు, పువ్వులు చనిపోతాయి.
 • ఇంట్లో చాలా ఎక్కువగా సాలీడ్లు చేరుతాయి. అనేక చోట్ల సాలే గూడ్లు కనిపిస్తాయి.
 • ఇంట్లో వస్తువులు కనిపించకుండా పోతాయి
 • ఇంట్లో ఉన్నపుడు నిరంతరాయంగా తలనొప్పి గా ఉంటుంది.
 • ఏదో ఒక ట్యాప్ ల నుంచి నిరంతరాయంగా నీళ్లు లీక్ అవుతూ ఉంటాయి.
 • కిటికీలు, తలుపులు మూసి తెరిచే సమయంలో నిరంతరం శబ్ధం చేస్తాయి.
 • తరచుగా పాలు పొంగి పోవడం, లేదా మాడి పోవడం లేదా చేతిలో నుంచి జారి ఒలికి పోవడం వంటివి జరుగుతుంటాయి.
 • ఒక తెలియని బాధ ఒకటి కుటుంబాన్ని వెంటాడుతుంటుంది. అనవసరపు కలహాలు చెలరేగుతుంటాయి. తరచుగా ఇంట్లో ఒకరిని ఒకరు నిందించుకవడం కోపతాపాల్లో రోజులు గుడుస్తుంటాయి.

మనం రోజువారీ తెలిసీ తెలియక చేసే పనులు, కాస్త ఆశ్రద్ధ వంటివి ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ చేరడానికి కారణాలవుతాయి ఎలాంటి పనుల వల్ల ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ చేరుతుందో తెలుసా?

 • ఇంట్లో వస్తువులు, బట్టలు ఎక్కడ పడితే అక్కడ వదిలెయ్య కూడదు. ఇల్లెప్పుడు ఆర్గనైజ్డ్ గా ఉండాలి.
 • మురికి బట్టలు ఎక్కడ పడితే అక్కడ ఉండకూడదు. వీలైనంత త్వరగా వాటిని ఉతికి శుభ్రంగా ఉంచుకోవాలి.
 • దేవుళ్ల విగ్రహాలను ఎదురెదురుగా పెట్టుకోకూడదు. పక్కపక్కన లేదా వెరువేరుగా పెట్టుకోవాలి.

ఇలాంటి లక్షణాలు కనిపించినపుడు ఇంట్లో ప్రతికూల శక్తులు చేరాయి అని అర్థం చేసుకోవాలి. కచ్చితంగా ఇంటి నుంచి వాటిని పారద్రోలాలి. అందుకు కొన్ని చిన్నచిన్న పరిహారాలను పండితులు సూచిస్తున్నారు.

పరిహారాలు

 • వాష్ రూమ్ లో ఒక గిన్నెలో కర్పూరం వేసి ఉంచాలి.
 • ఇంటికి ఈశాన్యంలో నీటి ఫౌంటైన్ ఏర్పాటు చెయ్యడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది.
 • ఇంట్లో తరచుగా ఉప్పు దీపం వెలిగించాలి.
 • ఇల్లు తుడిచే నీటిలో అప్పుడప్పుడు కాస్త సముద్రపు ఉప్పు వెయ్యాలి.
 • ఇంట్లో కర్పూరం తో పాటు కొన్ని లవంగాలు వేసి కాల్చాలి
 • ఇంట్లోకి గాలి వెలుతురు ధారలంగా వచ్చే విధంగా ఏర్పాటు చేసుకోవాలి.
 • వాడని వస్తువులు, పుస్తకాలు, దుస్తుల వంటి వాటిని వదుల్చుకోవాలి.
 • ఇల్లు నిశ్శబ్ధంగా ఉంటే చాలా మందికి నచ్చుతుంది కానీ అప్పుడప్పుడు పాటలో, మంత్రమో ఏదో ఒకటి పెద్ద సౌండ్ తో ఇంట్లో మోగిస్తే మంచిది.
 • ఇంట్లోని సోఫాలు, దీవాన్ల వంటి పెద్ద పెద్ద వస్తువులను ఎప్పుడూ ఒకే విధంగా కదపకుండా ఉంచకూడదు. అప్పుడప్పుడు వాటిని మార్చి సర్దుకుంటే ఇల్లు బోర్ కొట్టకుండా కొత్తగా ఉంటుంది. నెగెటివిటి కూడా చేరదు.

ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు, పరిహారాలతో ఇంటిని ప్రశాంతంగా, హాయిగా పెట్టుకోవచ్చు.

Also Read: భార్య, భర్తకు ఎటువైపు నిద్రపోవడం మంచిదో తెలుసా? పడక గదిలో ఈ నియమాలు తప్పనిసరి!

Published at : 26 Apr 2023 07:17 PM (IST) Tags: vastu Energy in Home remidies negetiv energy negetive Negative Energy in Home

సంబంధిత కథనాలు

Eruvaka Pournami 2023: ఏరువాక పున్నమి ఎప్పుడొచ్చింది, ప్రత్యేకత ఏంటి!

Eruvaka Pournami 2023: ఏరువాక పున్నమి ఎప్పుడొచ్చింది, ప్రత్యేకత ఏంటి!

Nirjala Ekadashi 2023: మే 31 నిర్జల ఏకాదశి, అక్షయ తృతీయ కంటే ముఖ్యమైన రోజిది!

Nirjala Ekadashi 2023: మే 31 నిర్జల ఏకాదశి, అక్షయ తృతీయ కంటే ముఖ్యమైన రోజిది!

Shukra Gochar 2023: నెల రోజుల పాటూ ఈ 4 రాశులవారికి అంత బాలేదు!

Shukra Gochar 2023: నెల రోజుల పాటూ ఈ 4 రాశులవారికి అంత బాలేదు!

మే 31 రాశిఫలాలు, ఈ రాశులవారు శత్రువులపట్ల జాగ్రత్త వహించాలి

మే 31 రాశిఫలాలు, ఈ రాశులవారు శత్రువులపట్ల జాగ్రత్త వహించాలి

గంగా దసరా అంటే ఏమిటీ? దీని వెనుకున్న కథ ఏమిటి?

గంగా దసరా అంటే ఏమిటీ? దీని వెనుకున్న కథ ఏమిటి?

టాప్ స్టోరీస్

Gorantla Butchaiah Chowdary: సీఎం జగన్ ఢిల్లీ వెళ్లినప్పుడల్లా అవినాష్ కేసుకు బ్రేకులు: గోరంట్ల బుచ్చయ్య సెటైర్లు

Gorantla Butchaiah Chowdary: సీఎం జగన్ ఢిల్లీ వెళ్లినప్పుడల్లా అవినాష్ కేసుకు బ్రేకులు: గోరంట్ల బుచ్చయ్య సెటైర్లు

Margadarsi Case: మార్గదర్శి కేసు: సీఐడీ లుక్‌అవుట్ నోటీసులపై హైకోర్టుకు శైలజా కిరణ్

Margadarsi Case: మార్గదర్శి కేసు: సీఐడీ లుక్‌అవుట్ నోటీసులపై హైకోర్టుకు శైలజా కిరణ్

Khairatabad Ganesh : ఖైరతాబాద్ గణేష్ విగ్రహం అంకురార్పణ - ఈ ఏడాది ఎన్ని అడుగులంటే ?

Khairatabad Ganesh : ఖైరతాబాద్ గణేష్ విగ్రహం అంకురార్పణ - ఈ ఏడాది ఎన్ని అడుగులంటే ?

Ugram OTT Release: ఓటీటీలోకి అల్లరి నరేష్ ‘ఉగ్రం’ - స్ట్రీమింగ్ డేట్ ఇదే!

Ugram OTT Release: ఓటీటీలోకి అల్లరి నరేష్ ‘ఉగ్రం’ - స్ట్రీమింగ్ డేట్ ఇదే!