Dreams Reason: మీకు మిఠాయి కలలోకి వచ్చిందా? అది దేనికి సూచనో తెలుసా?
ప్రతి కలలోనూ శుభాశుభ సంకేతాలు కచ్చితంగా ఉంటాయి. కలలు భవిష్యత్తు సంఘటనలకు ప్రతీకలు కావచ్చు. కలలను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చెయ్యడం తగదు.
కలలు భవిష్యత్తులో జరిగే సంఘటనలకు సంకేతాలని స్వప్నశాస్త్రం చెబుతోంది. కేవలం కలలే కదా అని నిర్లక్ష్యం తగదని కూడా అంటోంది.
కలలు చాలా సహజమైన ప్రక్రియ. నిద్రపోయే ప్రతి ఒక్కరికి ఏదో ఒక కల వస్తుంది. వాటిలో కొన్ని మంచివి కావచ్చు లేదా పీడ కలలు కావచ్చు. కలలను విశ్లేషించే పరిజ్ఞానం స్వప్నశాస్త్రం. ప్రతి కలలోనూ శుభాశుభ సంకేతాలు కచ్చితంగా ఉంటాయి. కలలు భవిష్యత్తు సంఘటనలకు ప్రతీకలు కావచ్చు. కలలను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చెయ్యడం తగదు. ఒక్కోసారి అది జీవితం మనకు అందించే సందేశం కూడా కావచ్చు. కలలో స్వీట్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా? మీకు కనిపించే స్వీటును బట్టి సంకేతం, భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.
స్వీట్ తింటున్నట్టు
కలలో మీరు స్వీట్ తింటున్నట్టు కనిపిస్తే అది శుభసూచకంగా పరిగణించాలి. మీరు ఎప్పటినుంచో జరగాలని కోరుకుంటున్న పని ఇప్పుడు విజయవంతం కాబోతుందని అర్థం. సంఘంలో మీకు గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయనడానికి సంకేతం. మీరేదో శుభవార్త వినబోతున్నారనేందుకు ప్రతీక ఈ కల. ఈ కల మీ జీవితంలో మాధుర్యానికి సంకేతం.
మిఠాయి తయారవుతున్న కల
కలలో మీరు మిఠాయి తయారుచేస్తున్నట్టు కనిపిస్తే అది శుభప్రదమైన కలగా చెప్పవచ్చు. ఇది జీవితంలో రాబోయే శుభపరిణామాలకు సంకేతం. ఇది మీకు త్వరలో ధనప్రాప్తి కలగబోతోందని చెప్పే కల. మీ వ్యాపారంలో వృద్ధి జరగవచ్చు. అకస్మాత్తుగా ఏదైనా శుభవార్త వినవచ్చు.
మిఠాయి పంచుతున్నట్టు
కలలో మీరు మిఠాయి పంచుతున్నట్టు కలలో కనిపిస్తే అది కూడా శుభసూచకమే. మీరు త్వరలో శుభవార్త వినబోతున్నారనడానికి సంకేతం. ఉద్యోగంలో ప్రమోషన్ రాబోతోందని అనడానికి ప్రతీక. వ్యాపారంలో విజయం లభిస్తుందని అర్థం. ఇలాంటి కలల గురించి ఎవరితోనూ చర్చించకూడదు. ఇలా చర్చించడం వల్ల వాటి ప్రభావం తగ్గిపోయి ఫలించవు.
మిఠాయి చేజారినట్టు
కలలో మీ చేతిలోంచి మిఠాయి పడిపోయినట్టు కల వస్తే ఇది అశుభానికి సంకేతం. ఈ కల మీకు భవిష్యత్తులో రాబోయే ఆర్థిక నష్టానికి సంకేతం. లేదా మీ ఉపాధి కోల్పోవచ్చు. వ్యాపారం ముందు సాగకుండా నిలిచిపోతుంది. ఈ కల త్వరలో కలగబోయే నష్టానికి ప్రతీకగా భావించాల్సి ఉంటుంది.
మిఠాయి దొంగిలించినట్టు
మీరు దొంగతనంగా మిఠాయి తీసుకుంటున్నట్టుగా కలలో కనిపిస్తే అది చాలా అసహ్యకరమైన కల గా భావించాలి. ఈ కల మీకు రాబోయే కష్టాల కు సంకేతం మాత్రమే కాదు.. అది మీరు ఆ కష్టాల నుంచి పారిపోతుంటారని చెప్పే కల. ఇలాంటి కల వస్తే తప్పకుండా జాగ్రత్త పడాలి. మీకు రాబోయే కాలంలో వచ్చే కష్టాలు ఏమై ఉండవచ్చు? వాటిని ఎలా ఎదుర్కోవాలని ఆలోచించాలి. ఏ పని వల్ల మీరు ఇబ్బందుల్లో పడిపోవచ్చని అనుమానంగా ఉంటే అటువంటి పనులు చెయ్యకుండా ఉండడం మంచిది.
కలలు కనాలి వాటిని సాకారం చేసుకోవాలని పెద్దలు చెప్పారు. కలలు కేవలం భవిష్యత్తు నిర్మాణం గురించి మాత్రమే కాదు, రాబోయే కష్టాలను గురించి కూడా వివరిస్తాయి. కనుక కలలో కనిపించే విషయాలను నిర్లక్ష్యం చెయ్యకూడదు. కచ్చితంగా గుర్తున్న ప్రతి కలను విశ్లేషించి చూసుకోవాలి. ఫలితాలను బట్టి కొన్ని కష్టాలను తప్పించుకోవచ్చు, కొన్ని ఆనందాలకు సంసిద్ధం కావచ్చు.
Also Read: ఈ 5 కలలు పొరపాటున కూడా ఇతరులతో పంచుకోకూడదు