అన్వేషించండి
Advertisement
ఇంటి ముందు కాకులు గుంపులుగా అరుస్తున్నాయా? ఏం జరుగుతుందో తెలుసా?
కాకి కొన్ని సార్లు శుభ సూచకమైతే కొన్ని సార్లు అశుభం కూడా అని పండితులు చెబుతున్నారు. ఎలాంటి సందర్భాల్లో కాకి శుభ సూచకం ఎలాంటి సందర్భాల్లో కాదో ఒకసారి తెలుసుకుందాం.
‘బలగం’, ‘విరూపాక్ష’ సినిమాల వల్ల ఇటీవల కాకి బాగా ట్రెండింగ్‌లో ఉంది. అయితే, రెండు సినిమాల్లో కాకులను రెండు విధాలుగా చూపించారు. ‘బలగం’లో కాకి మనల్ని ఇష్టపడే పెద్దలకు ప్రతీకగా చూపించారు. ‘విరూపాక్ష’లో కాకులను చెడుకు సంకేతాలుగా చూపించారు. మరి, వీటిలో ఏది కరెక్టు? కాకులు ముందుగానే మంచి చెడులు గురించి చెబుతాయా? వాటిని ఎలా తెలుసుకోవాలి?
ఈ సినిమాల దయ వల్ల ఇప్పుడు అందరి ఫోకస్ కాకులపై పడింది. కాకికి పెట్టడం, పిట్టతినడం ఇలా రకరకాల కారణాలతో కాకుల గురించి మాట్లాడుకుంటున్నారు. అయితే నిజంగానే శకునశాస్త్రంలో కాకి గురించిన అనేక విషయాలు ప్రస్తావించారు. మన ప్రాంతంలో కాకులు చాలా సాధారణంగా కనిపించే పక్షులు. భారతీయ సంస్కృతి ప్రకృతి, చుట్టూ ఉండే చెట్టూ చేమ, పశుపక్ష్యాదులన్నింటితో కలిసి నడిచే జీవి. కాకిని యుముని దూతగా పురాణాలు చెబుతున్నాయి. అంటే ఆ నల్లని పక్షి భవిష్యత్తులో మనం ఎదుర్కోబోయే మంచి చెడులను గురించిన సందేశాన్ని మనకు తెలియజేస్తుందని నమ్మకం. అందుకే కాకి అందించే సంకేతాన్ని నిర్లక్ష్యం చెయ్యకూడదని శాస్త్రం సలహా ఇస్తోంది. కాకి శకునాల్లో ఏవి శుభమో, ఏవి కాదో చూద్దాం.
- కాకి ఇంటి ముందు లేదా బాల్కనీలో లేదా ఇంటి ఆవరణలో కూర్చుని అదేపనిగా అరుస్తుంటే త్వరలో ఆ ఇంటికి అతిథులు రాబోతున్నారని అర్థం. లేదా కుటుంబానికి దూరంగా ఉంటున్న కుటుంబ సభ్యుల రాకకు సంకేతం కావచ్చు.
- శకున శాస్త్రాన్ని అనుసరించి ఇంటికి ఉత్తరం వైపున పగటి పూట కాకి అరిస్తే లేదా తూర్పు వైపున కాకి అరిచినా అది శుభ శకునమే. ఏదో మంచి జరుగుతుందని అర్థం.
- ఏదైనా టూర్ లేదా విహారానికి వెళ్లేందుకు బయలుదేరుతున్న సమయంలో కాకి కిటికిలో కూర్చుని అరిస్తే మీ ట్రిప్ విజయవంతం అవతుందని అర్థం.
- కాకుల గుంపు బాల్కాని లేదా ఇంటి ఆవరణలో చేరి అరుస్తుంటే మాత్రం అది అంత మంచి శకునం కాదు. ఈ పక్షులు ఇంట్లో ఏదో అశుభం జరగబోతోందనే సంకేతాన్ని ఇవ్వడానికి వచ్చాయని అర్థం. ఆ కుటుంబం ఏదో ఇబ్బందుల్లో పడబోతోందని లేదా ఇంట్లో ఎవరో ఒకరికి అనారోగ్యం కలుగబోతోందని అర్థం.
- దక్షిణం దిశగా కాకి అరిస్తే మాత్రం శుభ శకునం కాదు. ఇది మీ పితృదేవతలు కోపంగా ఉన్నారనడానికి సంకేతం. లేదా మీకు పితృదోషం ఉందని అర్థం.
- నీళ్లు తాగే కాకి కనిపిస్తే అది శుభసూచకమని శకున శాస్త్రం చెబుతోంది. ఇలా కాకి నీళ్లు తాగుతూ కనిపిస్తే తలపెట్టిన కార్య సిధ్ధికి సూచకంగా భావించాలట. కచ్చితంగా చెయ్యాలనుకున్న పని విజయవంతంగా చేస్తారని నమ్మకం.
- ఆహారాన్ని ముక్కున కరుచుకుని వెళ్లే కాకి కనిపిస్తే అది కూడా శుభ సూచకమే అని శాస్త్రం చేబుతోంది. మీరు చిరకాలంగా కోరుకుంటున్న పెద్ద కోరికేదో తీరబోతోందని అనడానికి ప్రతీక.
- కాకి తల మీద తన్నడం లేదా, మీద వాలడం, లేదా తల మీదుగా రెక్కలాడిస్తూ ఎగిరిపోవడం అస్సలు మంచి శకునాలు కాదు. ఇది ఇంట్లో లేదా ఆత్మీయుల మరణానికి ప్రతీక కావచ్చని పండితులు అంటున్నారు.
- కలలో గుంపులుగా కాకులు కనిపించడం అంతమంచి శకునం కాదట. ఇది త్వరలోజరగబోయే చెడుకు సంకేతంగా భావించాలట.
- పూర్తిగా ఎండిపోయిన చెట్ట మీద కాకి కూడా మంచి శకునం కాదు ఇది కూడా ఇంట్లో ఎవరికో జరగబోయే కీడుకి సూచకంగా భావించాలి.
- ముక్కుతో తల లేదా రెక్కల్లో గోక్కుంటున్నట్టుగా కనిపించే కాకి మంచి శకునం. ఇది ఎన్నో రోజులుగా మీరు కలలు కంటున్న అంశం సాకారం కాగలుగుతుందనడానికి సంకేతమట.
Also Read: సింహాద్రి అప్పన్నకు చందనలేపనం ఇందుకే? క్షేత్ర పురాణం ఏం చెబుతోందంటే?
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఐపీఎల్
ఓటీటీ-వెబ్‌సిరీస్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement