By: RAMA | Updated at : 14 Jan 2023 07:20 AM (IST)
Edited By: RamaLakshmibai
Image Credit: Pinterest
Sankranthi Gobbilla Patalu In Telugu: సంక్రాంతి పండుగ ప్రారంభానికి నెల ముందు నుంచే పండుగ శోభ మొదలైపోతుంది. ధనుర్మాసం ప్రారంభం నుంచీ లోగిళ్లన్నీ రంగుల ముగ్గులతో కళకళలాడుతాయి. రంగులు నింపిన ముగ్గుల మధ్య గొబ్బిళ్లు చేసి వాటిపై గుమ్మడి, బంతి, చామంతి పూలతో అలంకరించి..పసుపు-కుంకుమతో గౌరీ దేవిని పెడతారు. భోగి రోజు సాయంత్రం ఈ గొబ్బిళ్ల చుట్టూ తిరుగుతూ పాటలు పాడతారు. ఆ పాటలు కొన్ని మీకోసం..
పాట-1
కొలని దోపరికి గొబ్బిళ్ళో యదు | కుల స్వామికిని గొబ్బిళ్ళో ||
చ|| కొండ గొడుగుగా గోవుల గాచిన | కొండొక శిశువునకు గొబ్బిళ్ళో |
దండగంపు దైత్యుల కెల్లను తల | గుండు గండనికి గొబ్బిళ్ళో ||
చ|| పాప విధుల శిశుపాలుని తిట్టుల | కోపగానికిని గొబ్బిళ్ళో |
యేపున కంసుని యిడుమల బెట్టిన | గోప బాలునికి గొబ్బిళ్ళో ||
చ|| దండివైరులను తరిమిన దనుజుల | గుండె దిగులునకు గొబ్బిళ్ళో |
వెండిపైడి యగు వేంకట గిరిపై | కొండలయ్యకును గొబ్బిళ్ళో ||
Also Read: శని బాధలు తొలగిపోవాలంటే సంక్రాంతికి ఇలా చేయండి
పాట-2
దుక్కు దుక్కు దున్నారంట
గొబ్బియళ్ళొ గొబ్బియళ్ళొ గొబ్బియళ్ళొ గొబ్బియళ్ళొ
దుక్కు దుక్కు దున్నారంట - ఏమి దుక్కు దున్నారంట
రాజా వారి తోటలో జామ దుక్కు దున్నారంట
అలనాటి అక్కల్లారా చంద్రగిరి భామల్లారా
భామలసిరి గొబ్బిళ్ళో గొబ్బియళ్ళొ గొబ్బియళ్ళొ
విత్తు విత్తు వేశారంట - ఏమి విత్తు వేశారంట
రాజా వారి తోటలోన జామ విత్తు వేశారంట
అలనాటి అక్కల్లారా చంద్రగిరి భామల్లారా
గొబ్బిళ్ళో గొబ్బియళ్ళొ గొబ్బియళ్ళొ
మొక్క మొక్క మొలిచిందంట - ఏమి మొక్క మొలిచిందంట
రాజా వారి తోటలోన జామ మొక్క మొలిచిందంట
అలనాటి అక్కల్లారా చంద్రగిరి భామల్లారా
గొబ్బిళ్ళో గొబ్బియళ్ళొ గొబ్బియళ్ళొ
పువ్వు పువ్వు పూసిందంట - ఏమి పువ్వు పూసిందంట
రాజా వారి తోటలోన జామ పువ్వు పూసిందంట
అలనాటి అక్కల్లారా చంద్రగిరి భామల్లారా
గొబ్బిళ్ళో గొబ్బియళ్ళొ గొబ్బియళ్ళొ
పిందె పిందె వేసిందంట - ఏమి పిందె వేసిందంట
రాజా వారి తోటలోన జామ పిందె వేసిందంట
అలనాటి అక్కల్లారా చంద్రగిరి భామల్లారా
గొబ్బిళ్ళో గొబ్బియళ్ళొ గొబ్బియళ్ళొ
కాయ కాయ కాసిందంట - ఏమి కాయ కాసిందంట
రాజా వారి తోటలోన జామ కాయ కాసిందంట
అలనాటి అక్కల్లారా చంద్రగిరి భామల్లారా
గొబ్బిళ్ళో గొబ్బియళ్ళొ గొబ్బియళ్ళొ
పండు పండు పండిందంట - ఏమి పండు పండిందంట
రాజా వారి తోటలోన జామ పండు పండిందంట
అలనాటి అక్కల్లారా చంద్రగిరి భామల్లారా
గొబ్బియళ్ళొ గొబ్బియళ్ళొ గొబ్బియళ్ళొ గొబ్బియళ్ళొ
Also Read: భోగి రోజు మీ బంధుమిత్రులకు ఇలా శుభాకాంక్షలు చెప్పండి
పాట-3
అటవీ స్థలములు కడుగుదమా
చెలి వట పత్రమ్ములు కోయుదమా!!2 సార్లు!!
చింత పిక్కాలాడుదమా చిరు చిరు నవ్వులు నవ్వుదమా!!అటవీ!!
చెమ్మా చెక్కాలాడుదమా చక్కిలిగింతలు పెట్టుదమా!!అటవీ!!
కోతీ కొమ్మచ్చులాడుదమా కొమ్మల చాటున దాగుదమా!!అటవీ!!
చల్లని గంధం తీయుదమా సఖియా మెడలో పూయుదమా!!అటవీ!!
పూలదండలు గుచ్చుదమా దేవుని మెడలో వేయుదమా!!అటవీ!!
పాట-4
సుబ్బీ గొబ్బెమ్మా
సుబ్బీ గొబ్బెమ్మా.. సుబ్బణ్ణీయవే..
చామంతి పువ్వంటీ చెల్లెల్నీయవే
తామర పూవంటీ తమ్ముణ్ణీయవే
బంతి పువ్వంటి బావ నివ్వవే
తాటి పండంటి తాత నివ్వవే
మల్లె పూవంటి మామా నివ్వవే
అరటి పండంటి అత్త నివ్వవే
మొగలి పూవంటీ.. మొగుణ్ణీయవే
పాట-5
ఏల వచ్చెనమ్మ కృష్ణుడేల వచ్చెను
ఆ మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చేసెను
ఆ మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చేసెను
ఉట్టి మీద పాలు పెరుగు ఎట్లు దించెనే?
ఉట్టి మీద పాలు పెరుగు ఎట్లు దించెనే?
కొట్టబోతే దొరకడమ్మ చిన్ని కృష్ణుడు!!ఏల!!
కాళింది మడుగులోన దూకినాడమ్మా
బాలుడు కాదమ్మ పెద్దవాడమ్మా!!ఏల!!
చీరలన్ని మూట కట్టి చిన్ని కృష్ణుడు
చీరలన్ని మూట కట్టి చిన్ని కృష్ణుడు
ఆ పొన్న మాను పైన పెట్టి పంతమాడెనే!!ఏల!!
పాట -6
చుంచు దువ్వి పింఛం పెట్టెద గోపాలకృష్ణ
పొంచి ఉండి పరుగులేలరా !2!
చుంచు దువ్వి పింఛం చుట్టి పంచదార పాలుపోసి !2!
ఎంచరాని బొజ్జలవేడి బువ్వపెట్టి బజ్జోపెడుదు
చుంచు దువ్వి పింఛం!2!
కాళ్లకు గజ్జెలు కట్టెదా గోపాల కృష్ణ మెళ్లోనా హారం వేసేదా!2!
కాళ్లకు గజ్జెలు కట్టి మెళ్లోనా హారం వేసి...
ఒళ్లోను పప్పుల పోసి పిల్లల గ్రోవి చేతికిచ్చెదా
చుంచు దువ్వి పింఛం
చుంచు దువ్వి పింఛం పెట్టెద గోపాలకృష్ణ
బొజ్జకు పసిడి గజ్జెలు కట్టేదా గోపాలకృష్ణ
బుజ్జి భుజములు తిప్పి ఆడేదా
బంగరు తొట్టె నా మదిలోనా బాలకృష్ణ నిద్దరపోరా
చుంచు దువ్వి పింఛం చుట్టెద గోపాలకృష్ణ
పొంచి ఉండి పరుగులేలరా !4!
Medaram Mini Jathara 2023: ఘనంగా రెండో రోజు సమ్మక్క, సారలమ్మ మినీ జాతర!
Mysterious Temples in India: శాస్త్రవేత్తలకు అంతుచిక్కని ఆలయాలివి, అడుగడుగునా మిస్టరీలే!
Maha Shivaratri 2023: మహాశివరాత్రి ఎప్పుడొచ్చింది, సర్వం ఈశ్వరమయం అంటారెందుకు!
Love Horoscope Today 02 February 2023: ఈ రాశివారు జీవిత భాగస్వామితో ఎమోషనల్ గా కనెక్ట్ అవుతారు
Horoscope Today 02nd February 2023: ఈ రాశివారికి తమ పనిపై కన్నా పక్కవారి పనిపై శ్రద్ధ ఎక్కువ, ఫిబ్రవరి 2 రాశిఫలాలు
Pawan Kalyan Marriages: మూడు పెళ్లిళ్ల వివాదంపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ - చివర్లో బాలకృష్ణ షాకింగ్ కామెంట్స్!
K.Viswanath: చిరంజీవితో విశ్వనాథ్‌కు ప్రత్యేక అనుబంధం - కళా తపస్విని కన్నతండ్రిలా భావించే మెగాస్టార్!
Anil Kumar On Kotamreddy : దమ్ముంటే రాజీనామా చెయ్, కోటంరెడ్డికి అనిల్ కుమార్ సవాల్
K Viswanath Death: టాలీవుడ్‌ను ఖండాంతరాలకు తీసుకు వెళ్ళారు, తీరని లోటు - విశ్వనాథునికి చిరంజీవి, ఎన్టీఆర్, మమ్ముట్టి నివాళులు