అన్వేషించండి

Sabarimala Yatra History: శబరిమల యాత్ర ఎప్పటి నుంచి ప్రారంభమైంది .. అయ్యప్ప స్వామి మొదటి ఆదాయం ఎంతో తెలుసా!

Sabarimala Yatra: శబరిమల యాత్ర ..వర్ణనకు అందని ఆధ్యాత్మిక అనుభూతి. 41 రోజలు మండల దీక్షకు ఫలితం శబరిగిరిపై కొలువైన అయ్యప్ప దర్శనం..ఇంతకీ ఈ యాత్ర ఎన్నేళ్ల క్రితం మొదలైందో తెలుసా.. 

Sabarimala: శబరిమల.. ఈ పేరు వింటనే భక్తిభావం ఉప్పొంగుతుంది. లక్షలాది భక్తుల ఇష్టదైవం అయ్యప్ప. నిత్య పూజలు, అభిషేకాలు, ఎన్నో ఆలయాలు ఉన్నప్పటికీ శబరిమల ప్రత్యేకతే వేరు. 41 రోజుల పాటూ మండల దీక్ష చేసి కాలినడకన అయ్యప్ప సన్నిధికి చేరుకునే వరకూ  ప్రతిక్షణమూ ఆధ్యాత్మి పరవశమే. లక్షల మంది భక్తుల శరణుఘోషతో మారుమోగే అయ్యప్ప సన్నిధికి మొదట భక్తులు ఎప్పుడు వెళ్లారు? అప్పట్లో స్వామివారి ఆదాయం ఎంతో తెలుసా..

పందలరాజు వంశీయుల రికార్డులో నమోదైన వివరాల ప్రకారం.. 1819లో శబరిమలకు మొదటిసారిగా భక్తులు వెళ్లారు. అప్పట్లో శబరిమల ఆదాయం ఇప్పటి లెక్కల ప్రకారం చూసుకుంటే 7 రూపాయలు అని రికార్డుల్లో ఉంది.  205 ఏళ్ల క్రితం 7 రూపాయల ఆదాయం అంటే అప్పట్లో అది చాలా ఎక్కువనే చెప్పాలి. 

కేరళ (Kerala) రాష్ట్రం పశ్చిమ కనుమల్లో సయ్యాద్రి పర్వత శ్రేణుల మధ్య సముద్రమట్టానికి సుమారు 3 వేల అడుగుల ఎత్తులో దట్టమైన అడవులు, 18 కొండల మధ్య కొలువయ్యాడు అయ్యప్ప. అప్పట్లో శబరిమలకు చేరుకునేందుకు పంబా నుంచి కాలినడక తప్ప మరో రవాణా సౌకర్యం లేదు

Also Read: 12 ఏళ్లకోసారి విభీషణుడు సందర్శించే ఆలయం ఇది.. ధనుర్మాసంలో స్వామి వైభవం చూసితీరాల్సిందే!

శబరిమల అయ్యప్ప సన్నిధిలో ఉండే పదునెట్టాంబడి..అంటే 18 మెట్లు మొదట్లో రాతివి ఉండేవి. ఆ రాతి మెట్ల మీదనుంచి వెళ్లి స్వామిని దర్శించుకుని తరించేవారు. అప్పట్లో భక్తులు ఎన్నిసార్లు దీక్ష తీసుకుంటే అన్ని మెట్లకు కొబ్బరికాయ కొట్టే ఆచారం ఉండేది. ఈ ఆచారం వల్ల రాను రాను మెట్లు పాడైపోవడంతో..పంచలోహాల మెట్లు ఏర్పాటు చేశారు. పంచలోహాలంటే బంగారం, వెండి, రాగి, ఇనుము, తగరం... ఈ మెట్లపైనుంచి ఇతరును అనుమతించరు..కేవలం 41 రోజులు దీక్ష చేసి ఇరుముడి తలపై పెట్టుకున్నవారిని మాత్రమే అనుమతిస్తారు. 18 మెట్లు ఎక్కిన భక్తుడికి మొదట ధ్వజస్తంభం కనిపిస్తుంది. మొన్నటి వరకూ పంచలోహాలతో తయారు చేసిన ధ్వజస్తంభం ఉండేది.. ఆ తర్వాత తెలుగు రాష్ట్రాలకు చెందిన ఓ భక్తుడి విరాళంతో బంగారు ధ్వజస్తంభంగా మారింది.  

205 ఏళ్ల క్రితం అయ్యప్ప స్వామి గర్భగుడిపై బంగారు రేకులతో కప్పిఉంచారు. వాటిపై అయ్యప్ప జన్మరహస్యాన్ని చెక్కిఉంటుంది.  పిల్లలు లేని పందలరాజుకు కనిపించిన అయ్యప్పను తన కుమారుడిగా పెంచుకోవడం, తల్లి  అనారోగ్యాన్ని నయం చేసేందుకు పులిపాల కోసం అడవికి వెళ్లడం, యోగముద్రలో శబరిగిరులపై కొలువుతీరడం వరకూ..ఈ కథ మొత్తం బంగారురేకులపై లిఖించారు. ఈ వివరాలు మొత్తం    శబరిమల రికార్డులలో ఉంది.

Also Read: శబరిమలలో పెద పాదం, చిన పాదం అంటే ఏంటి - వనయాత్ర ఎందుకు చేయాలి!

 శ్రీ అయ్యప్ప స్తోత్రనిధి పారాయణ గ్రంథంలో ఉన్న అయ్యప్ప మాలా ధారణ మంత్రం  (Sri Ayyappa Mala Dharana Mantram)

జ్ఞానముద్రాం శాస్త్రముద్రాం గురుముద్రాం నమామ్యహమ్ |
వనముద్రాం శుద్ధముద్రాం రుద్రముద్రాం నమామ్యహమ్ ||  

శాంతముద్రాం సత్యముద్రాం వ్రతముద్రాం నమామ్యహమ్ |
శబర్యాశ్రమసత్యేన ముద్రాం పాతు సదాపి మే || 

గురుదక్షిణయా పూర్వం తస్యానుగ్రహకారిణే |
శరణాగతముద్రాఖ్యం త్వన్ముద్రాం ధారయామ్యహమ్ ||  

చిన్ముద్రాం ఖేచరీముద్రాం భద్రముద్రాం నమామ్యహమ్ |
శబర్యాచలముద్రాయై నమస్తుభ్యం నమో నమః ||  

వ్రతమాలా ఉద్యాపన మంత్రం

అపూర్వమచలారోహ దివ్యదర్శనకారణాత్ |
శాస్త్రముద్రాత్మక దేవ దేహి మే వ్రతమోచనమ్ ||

Also Read: మీలో ఈ మార్పులు రానప్పుడు మీరు మళ్లీ మళ్లీ అయ్యప్ప మాల వేయడం వృధా!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: సీజ్ ద షిప్ - సోషల్ మీడియాను షేక్ చేసిన పవన్ కల్యాణ్ !
సీజ్ ద షిప్ - సోషల్ మీడియాను షేక్ చేసిన పవన్ కల్యాణ్ !
TG 10th Exams Pattern: తెలంగాణలో టెన్త్ మార్కుల విధానంపై కీలక అప్ డేట్, వచ్చే ఏడాది నుంచి కొత్త పాట్రన్
తెలంగాణలో టెన్త్ మార్కుల విధానంపై కీలక అప్ డేట్, వచ్చే ఏడాది నుంచి కొత్త పాట్రన్
Andhra Pradesh Weather:మధ్యాహ్నం తీరం దాటనున్న ఫెంగల్‌- నెల్లూరు సహా ఈ జిల్లాలకు రెడ్‌ అలర్ట్- ప్లాష్‌ ఫ్లడ్స్‌ వచ్చే ప్రమాదం
మధ్యాహ్నం తీరం దాటనున్న ఫెంగల్‌- నెల్లూరు సహా ఈ జిల్లాలకు రెడ్‌ అలర్ట్- ప్లాష్‌ ఫ్లడ్స్‌ వచ్చే ప్రమాదం
Revanth Reddy on Allu Arjun: పుష్ప 2 హీరో అల్లు అర్జున్‌ను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి, ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ హ్యాపీ
పుష్ప 2 హీరో అల్లు అర్జున్‌ను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి, ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ హ్యాపీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Lagacharla Land Acquisition Cancelled | లగచర్ల భూసేకరణ రద్దు వెనుక మాస్టర్ ప్లాన్ ఇదే..! | ABP DesamPanama Ship Stops Deputy CM Pawan Kalyan | పవన్ కళ్యాణ్ ను అడ్డుకున్న వెస్ట్ ఆఫ్రికా ఓడ | ABP DesamAllu Arjun Speech Pushpa 2 Mumbai | పుష్ప 2 ముంబై ఈవెంట్లో అల్లు అర్జున్ మాస్ స్పీచ్ | ABP DesamRashmika Mandanna Pushpa 2 Mumbai | ముంబై పుష్ప ఈవెంట్ లో మెరిసిపోయిన శ్రీవల్లి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: సీజ్ ద షిప్ - సోషల్ మీడియాను షేక్ చేసిన పవన్ కల్యాణ్ !
సీజ్ ద షిప్ - సోషల్ మీడియాను షేక్ చేసిన పవన్ కల్యాణ్ !
TG 10th Exams Pattern: తెలంగాణలో టెన్త్ మార్కుల విధానంపై కీలక అప్ డేట్, వచ్చే ఏడాది నుంచి కొత్త పాట్రన్
తెలంగాణలో టెన్త్ మార్కుల విధానంపై కీలక అప్ డేట్, వచ్చే ఏడాది నుంచి కొత్త పాట్రన్
Andhra Pradesh Weather:మధ్యాహ్నం తీరం దాటనున్న ఫెంగల్‌- నెల్లూరు సహా ఈ జిల్లాలకు రెడ్‌ అలర్ట్- ప్లాష్‌ ఫ్లడ్స్‌ వచ్చే ప్రమాదం
మధ్యాహ్నం తీరం దాటనున్న ఫెంగల్‌- నెల్లూరు సహా ఈ జిల్లాలకు రెడ్‌ అలర్ట్- ప్లాష్‌ ఫ్లడ్స్‌ వచ్చే ప్రమాదం
Revanth Reddy on Allu Arjun: పుష్ప 2 హీరో అల్లు అర్జున్‌ను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి, ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ హ్యాపీ
పుష్ప 2 హీరో అల్లు అర్జున్‌ను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి, ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ హ్యాపీ
SCR: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ - తిరుపతికి వీక్లీ స్పెషల్ ట్రైన్స్, ఆ వందేభారత్‌కు అదనపు కోచ్‌లు
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ - తిరుపతికి వీక్లీ స్పెషల్ ట్రైన్స్, ఆ వందేభారత్‌కు అదనపు కోచ్‌లు
YS Jagan: జనవరి నుంచి జగన్ జిల్లాల పర్యటన - కష్టపడేవారికే భవిష్యత్ - పార్టీ నేతలకు జగన్ సందేశం
జనవరి నుంచి జగన్ జిల్లాల పర్యటన - కష్టపడేవారికే భవిష్యత్ - పార్టీ నేతలకు జగన్ సందేశం
Royal Enfield Retro Bike: రెట్రో థీమ్‌తో రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్త బైక్ - ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
రెట్రో థీమ్‌తో రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్త బైక్ - ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
Team India: పాకిస్తాన్‌కు బిగ్ షాక్ - భారత జట్టు అక్కడికి వెళ్లేది లేదని విదేశాంగ శాఖ క్లారిటీ
పాకిస్తాన్‌కు బిగ్ షాక్ - భారత జట్టు అక్కడికి వెళ్లేది లేదని విదేశాంగ శాఖ క్లారిటీ
Embed widget