అన్వేషించండి

Mrigashira Karte 2026 Dates: రోహిణి కార్తె ముగింపు, మృగశిర కార్తె ప్రారంభం - వానలు ఎప్పటి నుంచి మొదలవుతాయి?

Mrigashira Karte 2026 Rains: ప్రస్తుతం రోహిణి కార్తె నడుస్తోంది..తర్వాత మృగశిర కార్తె ప్రారంభమవుతుంది. మృగశిర కార్తె మొదలైందంటే వానాకాలం మొదలైనట్టేనా? ఈ ఏడాది ఎప్పటి నుంచి మృగశిర కార్తె ప్రారంభం?

Mrigasira Karthi 2026 Dates: తెలుగు పంచాంగం ప్రకారం వైశాఖమాసం చివరల్లో వచ్చే రోహిణి కార్తె సమయంలో రోళ్లు పగిలే ఎండలు మండిపోతాయనే సామెత ఉంది. 15 రోజుల పాటూ రోహిణి కార్తె పూర్తైన వెంటనే మృగశిర కార్తె మొదలవుతుంది. ఈ ఏడాది మే 25న ప్రారంభమైన రోహిణి కార్తె..జూన్ 8వరకు ఉంటుంది. ఆ తర్వాత మృగశిర కార్తె మొదలవుతుంది. రోహిణి కార్తె ఎండల్లో ఉక్కిరిబిక్కిరి అయినవారికి మృగశిర కార్తె ఉపశమనాన్నిస్తుంది. గ్రీష్మతాపాకి స్వస్తి చెప్పి చల్లని చిరుజల్లులతో ఆహ్వానం పలుకుతుంది. మృగశిర కార్తె మొదలైందంటే రైతన్నలు పండుగే. నైరుతి రుతుపవనాలు ఆగమనంతో తొలకరి చినుకులతో మొదలై భారీ వర్షాలు కురుస్తాయి.   

రోహిణి కార్తె అంటే ఏంటి? 2026లో రోహిణి కార్తె ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? ఈ సమయంలో ఏం చేయకూడదు?

అశ్విని నుంచి రేవతి వరకూ సూర్యుడు ఏ నక్షత్రంలోకి ప్రవేశిస్తే ఆ కార్తె మొదలవుతుంది. దాదాపు రెండువారాలకు ఓ నక్షత్రంలో సంచరిస్తాడు ప్రత్యక్షనారాయణుడు. రోహిణి నక్షత్రంలో సంచరించే సమయంలో రోహిణికార్తె అయితే..మృగశిర నక్షత్రంలోకి ప్రవేశించే సమయంలో మృగశిర కార్తె మొదలవుతుంది. ఈ ఏడాది పంచాంగం ప్రకారం జూన్ 8 నుంచి మృగశిర కార్తె మొదలవుతుంది..తొలకరి వానల ప్రారంభానికి సూచన ఇది.  తెలుగు రాష్ట్రాల్లో మృగశిర కార్తె కోసం రైతులు ఆతృతగా ఎదురుచూస్తారు. ఈ సమయంలో పొలాలు సిద్ధం చేసుకుని పంట వేసేందుకు సన్నాహాలు చేసుకుంటారు.  

పంచాంగం ప్రకారం మృగశిర కార్తె ప్రారంభ తేదీ 2026 జూన్ 08 సోమవారం

శ్రీ పరాభవ నామ సంవత్సరం సూర్యుడు మృగశిర నక్షత్రంలోకి ప్రవేశించే రోజు మృగశిర కార్తె ప్రారంభం

మృగశిర కార్తె కాల వ్యవధి - 13 నుంచి 15 రోజులు ( జూన్ 8 నుంచి జూన్ 22 వరకు)
 
మృగశిరకు ముందు కార్తె - రోహిణి మే 25 నుంచి జూన్ 8 వరకు  

మృగశిర తర్వాత కార్తె - ఆరుద్ర కార్తె ( జూన్ 23 నుంచి ప్రారంభం)
 
మృగశిర కార్తె ఆరోగ్యం, వ్యవసాయం, ప్రకృతి మార్పులకు సంబంధించిన శుభాశుభాలు ఎక్కువగా ఉంటాయి. 

ఆహారం
 
మొదటి రోజున..మాంసాహారులైతే చేపలు తింటారు.. శాఖాహారులు అయితే ఇంగువ-బెల్లం కలిపిన మిశ్రమం తీసుకుంటారు. వర్షాకాలంలో వచ్చే జబ్బులు, శ్వాస సమస్యల, ఆస్తమా నుంచి ఇవి రక్షణ కల్పించి రోగనిరోధక శక్తిని పెంచుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతారు. 

వ్యవసాయం

మృగశిర కార్తె ప్రారంభమవగానే వ్యవసాయదారులు దుక్కుదున్ని విత్తనాలు వేయడం ప్రారంభిస్తారు. మృగశిరలో పెట్టిన పైరు మంచిదనే సామెత ఉంది
 
ప్రకృతి సంరక్షణ

మృగశిర కార్తె సమయంలో మొక్కలు నాటడం, ఇంకుడు గుంతలు తవ్వడం, వర్షపు నీటిని సద్వినియోగం చేసుకోవడం చేస్తారు
 
ఆధ్యాత్మిక ప్రాముఖ్యత

మృగశిర కార్తెకు ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది..ఈ సమయంలో వరుణుడు, ఇంద్రుడిని పూజిస్తారని తైత్తిరీయోపనిషత్ లో ఉంది.  

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

వర్షాకాలం ప్రారంభమయ్యే సమయం కావడంతో సూక్ష్మక్రిములు పెరుగుతాయి, వ్యాధులు విజృంభిస్తాయి. అనవసర ప్రయాణాలు చేయకుండా ఉండడం మంచిది. అత్యంత వేడి వాతావరణం ఒక్కసారిగా చల్లబడడంతో ఆరోగ్యంపై ప్రభావం తీవ్రంగా ఉంటుంది..చిన్న అనారోగ్య సమస్యను కూడా నిర్లక్ష్యం చేయకూడదు.

ఒక్క మాత్రతో 8 రకాల సమస్యలకు ఉపశమనం, 8 వరాలు మీ సొంతం!

గమనిక: ఆధ్యాత్మికవేత్తలు సూచించిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల్లో పొందుపరిచిన సమాచారం ఆధారంగా అందించిన కథనం ఇది. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.  దీనిని అనుసరించేముందు మీరు విశ్వశించే పండితుల సలహాలు స్వీకరించగలరు.  

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

10-08-2026 సోమవారం మీ రాశిఫలాలు!
10-08-2026 సోమవారం మీ రాశిఫలాలు!
మీన రాశి వారఫలాలు ఆగస్టు 9-15: మీ సంబంధాలలో మూడవ వ్యక్తి జోక్యం ఉద్రిక్తతను పెంచుతుంది జాగ్రత్త!
మీన రాశి వారఫలాలు ఆగస్టు 9-15: మీ సంబంధాలలో మూడవ వ్యక్తి జోక్యం ఉద్రిక్తతను పెంచుతుంది జాగ్రత్త!
కుంభ రాశి వారఫలాలు ఆగస్టు 9-15: భావోద్వేగాలకు లోనవకండి , ఈ వారం ఎలాంటి పెద్ద నిర్ణయాలు తీసుకోకండి!
కుంభ రాశి వారఫలాలు ఆగస్టు 9-15: భావోద్వేగాలకు లోనవకండి , ఈ వారం ఎలాంటి పెద్ద నిర్ణయాలు తీసుకోకండి!
మకర రాశి వారఫలాలు ఆగస్టు 9-15: చిన్న నిర్లక్ష్యం తీవ్ర పరిణామాలకు దారితీయవచ్చు, ఈ వారం అప్రమత్తంగా ఉండండి!
మకర రాశి వారఫలాలు ఆగస్టు 9-15: చిన్న నిర్లక్ష్యం తీవ్ర పరిణామాలకు దారితీయవచ్చు, ఈ వారం అప్రమత్తంగా ఉండండి!
Advertisement

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gen Z Protests India 2026: జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
Telangana BJP: తెలంగాణలో ఇకపై పోరు కాంగ్రెస్ Vs బీజేపీ మాత్రమే - రోడ్ మ్యాప్ రెడీ చేసిన హైకమాండ్ - ఇక కమలం దూకుడేనా?
తెలంగాణలో ఇకపై పోరు కాంగ్రెస్ Vs బీజేపీ మాత్రమే - రోడ్ మ్యాప్ రెడీ చేసిన హైకమాండ్ - ఇక కమలం దూకుడేనా?
Vizag and Vijayawada Metro Rail:విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులో కదలిక!లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే?
విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులో కదలిక!లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే?
Gold- Silver Price Today 10 August 2026: ఆగస్టు 10న బంగారం ధర ఎంత? వెండి ధరలు కూడా మారాయా?  
ఆగస్టు 10న బంగారం ధర ఎంత? వెండి ధరలు కూడా మారాయా?  
Korean Kanakaraju Collections Day 3 : కొరియన్ కనకరాజు ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ - వరుణ్ తేజ్ ఖాతాలో మరో హిట్
కొరియన్ కనకరాజు ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ - వరుణ్ తేజ్ ఖాతాలో మరో హిట్
PM Modi CWG: గ్లాస్గో కామన్వెల్త్ మెడలిస్ట్స్ తో ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీ భేటీ.. క్రీడాకారులపై ప్రశంసల వర్షం
గ్లాస్గో కామన్వెల్త్ మెడలిస్ట్స్ తో ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీ భేటీ.. క్రీడాకారులపై ప్రశంసల వర్షం
AP Municipal Elections: ఏపీలో ప్రత్యక్ష పద్ధతిలో మేయర్, మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు.. చట్టంలో మార్పులతో ఎవరికి లాభం?
ఏపీలో ప్రత్యక్ష పద్ధతిలో మేయర్, మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు.. చట్టంలో మార్పులతో ఎవరికి లాభం?
USB Pendrive: USB పెన్ డ్రైవ్‌లకు కాలం చెల్లినట్టేనా? డేటా స్టోరేజ్‌లో వస్తున్న మార్పులు తెలుసా? 
USB పెన్ డ్రైవ్‌లకు కాలం చెల్లినట్టేనా? డేటా స్టోరేజ్‌లో వస్తున్న మార్పులు తెలుసా? 
Embed widget