అన్వేషించండి

Rishi Panchami 2022: ఈ రోజు రుషి పంచమి,మీ వంశానికి మూలపురుషులైన వీరిని ఓసారి గుర్తుచేసుకోండి!

Rishi Panchami 2022: భాద్రపద శుద్ధ పంచమిని రుషి పంచమిగా వ్యవహరిస్తారు. ఈ రోజున అత్రి, కశ్యప, భరద్వాజ, గౌతమ, వశిష్ట, విశ్వామిత్ర మహర్షులను తలచుకోవాలని, వారి గొప్పతనాన్ని తెలుసుకోవాలని చెబుతారు..

Rishi Panchami 2022: భారతీయ పురాణ కథల ప్రకారం ప్రతివారి వంశానికి ఓ రుషి మూలపురుషుడిగా ఉంటారు. ప్రాచీన రుషుల వంశానుక్రమమే ఇప్పటికీ కొనసాగుతోంది. కొందరికి గోత్ర రూపంలో రుషులను స్మరించుకుంటుంటే..మరికొందరికి వారి పూర్వ రుషులు తెలియకపోయినప్పటికీ వారి వంశాలకు రుషులున్నారు. అయితే ఎంతమంది రుషులు ఉన్నా సప్తరుషులను ప్రత్యేకంగా పూజిస్తాం. భాద్రపద శుద్ధ పంచమి( వినాయకచవతి మరుసటి రోజు)ని రుషి పంచమిగా పిలుస్తారు...
కశ్యప అత్రి భరద్వాజ
విశ్వామిత్రోథ గౌతమః!
వశిష్టో జమదగ్నిశ్చ
సప్తైతే ఋషయః స్మృతాః!!
1. కశ్యప 
సప్తర్షుల్లో కశ్యపుడు ఒక ప్రజాపతి. మరీచి, కళల పుత్రుడు. దక్షప్రజాపతి పుత్రికల్లో 13 మందిని, వైశ్వానరుని పుత్రికల్లో ఇద్దరిని పెళ్లిచేసుకున్నాడు.  కశ్యపుడి సంతానం ఎవరంటే...దైత్యులు, ఆదిత్యులు,  సిద్ధులు, గంధర్వులు, అప్సరసలు, మానేయులు, యక్షులు, రాక్షసులు, వృక్ష- లతా జాతులు, మృగాలు, సర్పాలు, గోగణాలు, అనూరుడు, గరుడుడు, నాగులు, కాలకేయులు, పౌలోములు, పర్వతుడు అనే దేవర్షిని, విభండకుడు అనే బ్రహ్మర్షి.
2. అత్రి 
సప్తర్షుల్లో రెండోవాడు అత్రి మహర్షి. బ్రహ్మ మానస పుత్రుల్లో ఒకడు. అత్రి భార్య అనసూయ. అత్రి తన తపోబలంతో త్రిమూర్తులను పోలిన సోమ, దూర్వాస, దత్తాత్రేయులను కుమారులుగా పొందాడు.
3. భరద్వాజ 
ఉతథ్యుడు-మమత కుమారుడు భరద్వాజ మహర్షి.  బృహస్పతి కృప వల్ల జన్మించి, ఘృతాచీపై మనసు పడి  ద్రోణుడి జన్మకు కారకుడవుతాడు.

Also Read: అద్దం పగిలితే అరిష్టమా.. పగిలిన అద్దాన్ని ఇంట్లో ఎందుకు ఉంచకూడదు.. ఏం జరుగుతుంది..
4. విశ్వామిత్ర 
విశ్వామిత్రుడు రాజర్షి. త్రిశంకుని స్వర్గానికి పంపడానికి కొంత తపోఫలాన్ని, మేనక వల్ల తపోభంగం జరిగి మరికొంత ఫలాన్ని పోగొట్టుకుంటాడు. విశ్వామిత్రుడు-మేనకి జన్మించిన పుత్రికే  శకుంతల. దుష్యంతుడు, శకుంతల పుత్రుడే భారతదేశ నామకరణానికి ఆదిగా నిలిచాడు.
5. గౌతమ మహర్షి
తీవ్ర కరువు ఏర్పడినప్పుడు ఋషులు, మునులందరికీ గౌతముడు తన తపోబలంతో భోజన వసతి కల్పించాడు. ఇతర ఋషుల ఈర్ష్య వలన మాయా గోవును దర్భతో అదిలించి, బ్రహ్మహత్యా పాతకం అంటగట్టుకొన్నాడు. ఆ దోష పరిహారం కోసం  గోదావరిని భూమిపైకి తెచ్చాడు గౌతముడు.  తన భార్య అహల్యను శిలగా మారమని శాపమిచ్చింది గౌతముడే.
6. వశిష్ఠ మహర్షి
విశిష్ఠుడి భార్య అరుంధతి. వసిష్ఠుడు బ్రహ్మమానస పుత్రుల్లో ఒకడు. వైవస్వత మన్వంతరాల సప్తర్షుల్లో ఒకడు. దక్ష ప్రజాపతి కుమార్తె ఊర్జ ద్వారా రజుడు, గోత్రుడు, ఊర్ధ్వబాహుడు, సువనుడు, అనఘుడు, సుతవుడు, శుక్రుడు అనే ఏడుగురు పుత్రులను పొందాడు. 

Also Read: రాళ్లు మాట్లాడతాయా… విగ్రహాలకు పూజలెందుకు అనేవారి ఇదే సమాధానమా..!
7. జమదగ్ని మహర్షి
రుచికముని, సత్యవతుల కుమారుడు జమదగ్ని మహర్షి. జమదగ్ని కుమారుడే పరశురాముడు. జమదగ్ని భార్య రేణుక మనసులో కలిగిన అన్యపురుష వ్యామోహం వలన, ఆమెను తన కొడుకైన పరశురామునిచే నరికించేస్డుతాడు. ఆ తర్వాత పరశురాముడి ప్రార్థన మేరకు ఆమెను మళ్లీ బతికించాడు జమదగ్ని. 

అరణ్యవాసంలో సీతారాములకు అభయమిచ్చినవాడు అత్రి మహర్షి. సాక్షాత్తూ శ్రీహరినే పుత్రునిగా పొందిన మహానుభావుడు, సీతారాములకు చిత్రకూటానికి దారి చూపినవాడు భరద్వాజ మహర్షి, తన భార్య అహల్య ద్వారా రామునికి తన తప:ఫలాన్ని అందింపజేసిన మహారుషి గౌతముడు, రాముని గురువు విశ్వామిత్రుడు, కులగురువు వశిష్టుడు , విష్ణువు అంశావతారమైన పరశురాముని కన్న తండ్రి జమదగ్ని మహర్షి, దశావతారాల్లో ఒకటైన వామనుడి జనకుడు కశ్యపమహర్షి...అందుకే రుషిపంచమినాడు రామాయణం చదివితే ఈ మహర్షులందరినీ తలుచుకున్నట్టే.

  సప్తఋషిభ్యో నమః

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Jagan : చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
BRS Mews : సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
Chandrababu :  జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
YouTube Videos Delete: ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Karimnagar Young Voters Opinion Poll Elections: కరీంనగర్ యువ ఓటర్లు ఏమంటున్నారు? వారి ఓటు ఎవరికి..?YSRCP Varaprasad | Pathapatnam: వైసీపీ ఎమ్మెల్యే రెడ్డి శాంతిపై రెబెల్ తులసీ వరప్రసాద్ ఫైర్Adilabad Aatram Suguna Face To Face: ఆదిలాబాద్ లో కాంగ్రెస్ గెలుపు ఖాయమంటున్న ఆత్రం సుగుణTDP Sankar | Srikakulam | పదవి ఉంటే ఒకమాట.. లేదంటే మరో మాట... ధర్మాన ఎప్పుడూ అంతే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Jagan : చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
BRS Mews : సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
Chandrababu :  జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
YouTube Videos Delete: ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
BJP Chengicherla politics : తెలంగాణలో మళ్లీ పాత ఫామ్‌లోకి వస్తున్న బీజేపీ - చెంగిచెర్ల ఘటనపై దూకుడు రాజకీయం !
తెలంగాణలో మళ్లీ పాత ఫామ్‌లోకి వస్తున్న బీజేపీ - చెంగిచెర్ల ఘటనపై దూకుడు రాజకీయం !
Ap Elections: ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులు - కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులు - కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
TSGENCO Exams: జెన్‌కోలో ఏఈ, కెమిస్ట్‌ నియామక పరీక్షలు వాయిదా - కొత్త షెడ్యూలు ఎప్పుడంటే?
జెన్‌కోలో ఏఈ, కెమిస్ట్‌ నియామక పరీక్షలు వాయిదా - కొత్త షెడ్యూలు ఎప్పుడంటే?
CJI: సీజేఐకు 600 మంది లాయర్ల లేఖ - కారణం ఏంటంటే.?
సీజేఐకు 600 మంది లాయర్ల లేఖ - కారణం ఏంటంటే.?
Embed widget