News
News
X

Ratha Saptami 2023 Wishes In Telugu: జనవరి 28 శనివారం రథసప్తమి సందర్భంగా శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి

రథసప్తమి శుభాకాంక్షలు 2023: జనవరి 28 శనివారం రథసప్తమి. ఈ సందర్భంగా ఆయురారోగ్యాలను ప్రసాదించే ఆదిత్యుడి జన్మతిథి సందర్భంగా మీ బంధుమిత్రులకు ఈ శ్లోకాలతో శుభాకాంక్షలు తెలియజేయండి

FOLLOW US: 
Share:

Ratha Saptami 2023 Wishes In Telugu:   ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడి జన్మదినమే రథసప్తమి. ప్రాణులకు చలిని తొలగించి, నూతనోత్తేజం నింపే పర్వదినమిది. ఈ రోజు నుంచి పగటి సమయం ఎక్కువగా రాత్రి సమయం తక్కువగా ఉంటుంది. మాఘశుద్ధ సప్తమి నాడు ఆదిత్యకశ్యపులకు సూర్యుడు జన్మించాడు.అందుకే ఈ రోజు సూర్య భగవానుడిని తమ శక్తికొలది పూజిస్తారు. రథసప్తమి సందర్భంగా మీ బంధుమిత్రులకు ఇలా శుభాకాంక్షలు తెలియజేయండి

సూర్య భగవానుడి ఆశీస్సులుతో 
మీకు అంత శుభం జరగాలని కోరుకుంటూ 
రథసప్తమి శుభాకాంక్షలు

సూర్యభగవానుడు మీకు శాంతి, ఆనందం, సంపద, ఆరోగ్యం
ప్రసాదించాలని కోరుకుంటూ రథ సప్తమి శుభాకాంక్షలు 

ఓం భాస్కరాయ విద్మహే, మహర్ద్యుతికరాయ ధీమహి
తన్నో ఆదిత్య ప్రచోదయాత్
మీకు మీ కుటుంబ సభ్యులకు రథసప్తమి శుభాకాంక్షలు

Also Read: ధనస్సు నుంచి మకరంలోకి బుధుడు, ఈ మూడు రాశులకు మినహా అందరికీ బావుంది

యదా జన్మకృతం పాపం మయాజన్మసు జన్మసు,
తన్మీరోగంచ శోకంచ మాకరీ హంతు సప్తమీ
మీకు మీ కుటుంబ సభ్యులకు రథసప్తమి శుభాకాంక్షలు

జయాయ జయభద్రాయ హర్యశ్వాయ నమో నమః
నమో నమః సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః
నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః
నమః పద్మప్రబోధాయ మార్తాండాయ నమో నమః
రథసప్తమి శుభాకాంక్షలు

సప్త సప్త మహా సప్త, సప్త ద్వీపా వసుంధరా
సప్తార్క పర్ణ మాధాయ సప్తమి రధ సప్తమి
రథసప్తమి శుభాకాంక్షలు

ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమభాస్కర|
దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే||
రథసప్తమి శుభాకాంక్షలు

కాలాత్మా సర్వభూతాత్మా వేదాత్మా విశ్వతోముఖః |
జన్మమృత్యుజరావ్యాధిసంసారభయనాశనః 
రథసప్తమి శుభాకాంక్షలు

బ్రహ్మస్వరూప ఉదయే మధ్యాహ్నే తు మహేశ్వరః |
అస్తకాలే స్వయం విష్ణుః త్రయీమూర్తిర్దివాకరః |
మీకు మీ కుటుంబ సభ్యులకు రథసప్తమి శుభాకాంక్షలు

నమః సూర్య శాన్తాయ సర్వరోగ నివారిణే
ఆయు రారోగ్య మైశ్వైర్యం దేహి దేవః జగత్పత్తే ||
మీకు మీ కుటుంబ సభ్యులకు రథసప్తమి శుభాకాంక్షలు

Also Read: కుజ దోషం, శని దోషం నుంచి బయటపడేసే సూర్యభగవానుడి ఆలయం

ఉదయగిరి ముపేతం భాస్కరం పద్మహస్తాం ||
సకల భువన నేత్రం నూ త్నరత్నోపధేయం
తిమిరకరి మృగేంద్రం బోధకం పద్మినీ నాం
సురవరమభి వంద్యం, సుందరం, విశ్వరూపం ||
రథసప్తమి శుభాకాంక్షలు

ఓ సూర్యా! సహస్రాంశో తేజోరాశీ జగపతే ।
కరుణాకరే దేవ్ గృహాణాధ్య నమోస్తుతే
రథసప్తమి శుభాకాంక్షలు

సప్తవిధం పాపం స్నానామ్నే సప్త సప్తికే
సప్తవ్యాధి సమాయుక్తం హరమాకరి సప్తమి
మీకు మీ కుటుంబ సభ్యులకు రథసప్తమి శుభాకాంక్షలు

నమః సూర్యాయ శాంతాయ సర్వరోగ నివారిణే! 
ఆయురారోగ్య ఐశ్వర్యo దేహి దేహిదేవః జగత్పతే!! 
మీకు మీ కుటుంబ సభ్యులకు రథసప్తమి శుభాకాంక్షలు

జయాయ జయభద్రాయ హర్యశ్వాయ నమో నమః |
నమో నమ స్సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః ॥
రథసప్తమి శుభాకాంక్షలు

ఈరోజు సూర్యభగవానుడిని ఎర్రటి పూలతో పూజించాలి. సూర్య నమస్కారములు చేయాలి. ఏ విధం గా సూర్యుడు లోకానికి ఉపయోగపడి లోక బాంధవుడు అయ్యాడో అదే విధంగా లోకానికి ఉపయోగపడే మంచి పుత్రుడిని ఇమ్మని కోరుకుంటూ  రధసప్తమి రోజు స్త్రీలు వ్రతం ఆచరిస్తారు. ఈ రోజు గొడుకు, చెప్పులు, ఎరుపు వస్త్రం, ఆవుపాలు, ఆవునెయ్యి దానం చేయడం మంచిది.  రథసప్తమి రోజున సూర్యుడిని పూజించే అవకాశం లేనివారు ఎదో ఒక ఆదివారం రోజున పూజించినా సత్ఫలితం ఉంటుందని పండితులు చెబుతున్నారు.

Published at : 28 Jan 2023 06:23 AM (IST) Tags: Ratha Saptami 2023 2023 Ratha Saptami Date and Time Significance of Surya Puja importance of Ratha Saptami special on Ratha Saptami Ratha Sapthami 2023 Slokas in telugu

సంబంధిత కథనాలు

ఈ తేదీన రాహు-చంద్ర గ్రహణ యోగం – ఈ 4 రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే..

ఈ తేదీన రాహు-చంద్ర గ్రహణ యోగం – ఈ 4 రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే..

భద్రాచల రాములోరి పెండ్లికి ఈసారి చేస్తున్న ఏర్పాట్లివే! మంత్రికి వివరించిన అధికారులు

భద్రాచల రాములోరి పెండ్లికి ఈసారి చేస్తున్న ఏర్పాట్లివే! మంత్రికి వివరించిన అధికారులు

ఇంట్లో అద్దం ఇక్కడ పొరపాటున పెట్టినా సమస్యలు తప్పవు

ఇంట్లో అద్దం ఇక్కడ పొరపాటున పెట్టినా సమస్యలు తప్పవు

Chanakya Neethi: ఇలాంటి ఇంట్లో లక్ష్మి నిలవదు, ఆర్థికంగా నష్టపోతారు - చాణక్యుడు చెప్పిన కఠోర వాస్తవాలు

Chanakya Neethi: ఇలాంటి ఇంట్లో లక్ష్మి నిలవదు, ఆర్థికంగా నష్టపోతారు - చాణక్యుడు చెప్పిన కఠోర వాస్తవాలు

Ugadi Panchangam in Telugu (2023-2024): శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో ఈ రాశివారికి ఏలినాటి శని ఉన్నప్పటికీ అన్నీ అనుకూల ఫలితాలే!

Ugadi Panchangam in Telugu (2023-2024): శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో ఈ రాశివారికి ఏలినాటి శని ఉన్నప్పటికీ అన్నీ అనుకూల ఫలితాలే!

టాప్ స్టోరీస్

KCR Message: మీరే నా బలం! మీరే నా బలగం!! బీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ ఆత్మీయ సందేశం

KCR Message: మీరే నా బలం! మీరే నా బలగం!! బీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ ఆత్మీయ సందేశం

ఏపీ ప్రభుత్వ హైస్కూల్స్‌లో 5388 'నైట్ వాచ్‌మెన్' పోస్టులు, ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

ఏపీ ప్రభుత్వ హైస్కూల్స్‌లో 5388 'నైట్ వాచ్‌మెన్' పోస్టులు,  ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

Visakha Metro Rail : విశాఖ మెట్రో ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదు, జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం క్లారిటీ!

Visakha Metro Rail : విశాఖ మెట్రో ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదు, జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం క్లారిటీ!

బాలయ్య మంచి మనసు - తారకరత్న పరిస్థితి మరెవ్వరికీ రాకూడదని కీలక నిర్ణయం, సెల్యూట్ చేస్తున్న ఫ్యాన్స్

బాలయ్య మంచి మనసు - తారకరత్న పరిస్థితి మరెవ్వరికీ రాకూడదని కీలక నిర్ణయం, సెల్యూట్ చేస్తున్న ఫ్యాన్స్