అన్వేషించండి

ప్రసవం తర్వాత బాలింత చీపురు ఎందుకు ముట్టుకోకూడదు? సంప్రదాయం వెనుకున్న ఆరోగ్య రహస్యం!

Postpartum Traditions: ప్రసవం అయిన తర్వాత కొన్ని రోజుల పాటు బాలింత చీపురు ముట్టుకోకూడదు అని చెబుతుంటారు పెద్దలు.. ఎందుకు అని ఎప్పుడైనా ఆలోచించారా? దీనివెనుకున్న ఆధ్యాత్మిక, ఆరోగ్య రహస్యాలేంటో తెలుసా?

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ప్రసవం తర్వాత తల్లి అపవిత్రంగా భావించబడి, చీపురు ముట్టకూడదు.
  • ఊడ్చడం వెన్నునొప్పి, రక్తస్రావం పెంచుతుంది; విశ్రాంతి అత్యవసరం.
  • సంప్రదాయాలు తల్లి, బిడ్డ ఆరోగ్య రక్షణకే ఉద్దేశించబడ్డాయి.

గర్భిణిగా ఉన్నప్పటి నుంచి ప్రసవం అయ్యేవరకు...ఆ తర్వాత కూడా చాలా నియమాలు పాటించాలని సూచిస్తుంటారు పెద్దలు. అలాంటి నియమాల్లో ఒ‍కటి ప్రసవం తర్వాత చీపురు ముట్టుకోవద్దని చెప్పడం. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత స్త్రీ శరీరం , మనసు అత్యంత సున్నితంగా ఉంటాయి. అందుకే భారతయ సంస్కృతి హిందూ సంప్రదాయాల్లో ప్రసవానంతరం కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటిస్తారు. వాటిలో ఒకటి చీపురు ముట్టుకోవద్దు, ఇల్లు ఊడ్చొద్దు అని.. ఇది కేవలం ఆధ్యాత్మిక విశ్వాసమే కాదు ఆరోగ్య కారణాలు ఉన్నాయ్.

బిడ్డ పుట్టకముందే వస్తువులు కొనొద్దు: మూఢనమ్మకమా, ఆరోగ్య జాగ్రత్తా?

ఆధ్యాత్మిక ధృక్పథంలో 
 
సూతిక సమయంలో తల్లి శరీరం ఆధ్యాత్మికంగా అపవిత్ర స్థితిలో ఉంటుందని నమ్మతారు. వేదకాలం నుంచి ఈ విశ్వాసాన్ని పాటిస్తున్నారు.. ఎందుకంటే.. ప్రసవ సమయంలో తల్లి శరీరం నుంచి రక్తం, ద్రవాలు వెలువడడం వల్ల శక్తుల సమతుల్యం కోల్పోతారు. చీపురును లక్ష్మీదేవితో సమానంగా భావిస్తారు - శుభ్రత, సంపదకు చిహ్నం. సూతిక స్త్రీ దాన్ని తాకితే ఇంటి సంపద పోతుందని , దుష్టశక్తులు ప్రవేశిస్తాయని నమ్మకం. కొన్ని ప్రాంతాల్లో చీపురు మంచం కింద ఉంచడం ద్వారా దుష్టశక్తులు దరిచేరవని నమ్ముతారు. శక్తి రక్షణకు సంకేతం అని, బాలింత చీపురు పట్టి తుడవడం వల్ల ఇంటి సానుకూల శక్తి నశిస్తుందని ఆధ్యాత్మికవేత్తలు చెబుతారు. 

Mirror Superstition: పిల్లలకు అద్దం ఎందుకు చూపించకూడదు? సైన్స్, ఆధ్యాత్మికం, ఆరోగ్య రహస్యం!

ఆయుర్వేదం ప్రకారం 

ఆయుర్వేదం ప్రకారం సూతిక పరిచర్యలో భాగంగా 40 నుంచి 60 రోజులు విశ్రాంతి తప్పనిసరి. ప్రసవం తర్వాత గర్భాశయం సంకోచం చెందుతూ, శరీరం వాతం దోషం పెచుతుంది. చీపురుతో ఉడ్చడం, కిందకు వంగి లేవడం, బరువులు ఎత్తడం లాంటివి చేస్తే వెన్నునొప్పి పెరుగుతుంది. ప్రసవానంతరం రక్తస్రావం మరింత పెరిగే ప్రమాదం ఉంది. ఇంకా ఇన్ఫెక్షన్లు, హెర్నియా వంటి సమస్యలు రావొచ్చు.  
 
ఆధునిక వైద్యం
 
ఆధునిక వైద్యం ప్రకారం కూడా..ప్రసవం తర్వాత మొదటి 4 నుంచి 6 వారాలు ఇంటి పనులు నివారించాలని సూచిస్తున్నారు వైద్యులు. తల్లిని సంరక్షించడం ద్వారా ఆమె మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది, చిన్నారికి ఇచ్చే బ్రెస్ట్ మిల్క్ పెరుగుతాయని చెబుతారు. చీపురు అంటే దుమ్ము,బ్యాక్టీరియా, ఫంగల్ ఉంటాయి. ప్రసవం తర్వాత స్త్రీ శరీరం ..ముఖ్యంగా గర్భాశయం చాలా సెన్సిటివ్ గా ఉంటుంది.  ఇన్ఫెక్షన్ వస్తే ప్రమాదం..అందుకే బాలింతను శుభ్రమైన గదిలో ఉంచేవారు. పైగా 40 రోజుల పాటు వేరే ఇతర పనులేమీ పెట్టుకోకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవడం , బిడ్డతో అనుబంధాన్ని పెంచుకోవడంపైనే ఉండాలనే ఆంతర్యం కూడా. 

పేదరాసి పెద్దమ్మ ఎవరు? ఆమె నిజంగా ఉండేదా? ఆమె గురించి పుస్తకాల్లో ఏముంది? 

సంప్రదాయాలు పూర్తిగా అంధవిశ్వాసాలు కావు

సంప్రదాయాలను పాటించడం అంటే అవన్నీ పూర్తిగా అంధవిశ్వాసాలు కావు. అవి తల్లి-శిశు ఆరోగ్యాన్ని రక్షించే వ్యవస్థ. ఆధ్యాత్మిక విశ్వాసాలను గౌరవిస్తూ , వైద్య సలహాలను కూడా పాటించాలి. బాలింత చీపురు తాకొద్దు అనేది ప్రసవం తర్వాత ఆమె ఆరోగ్యాన్ని సంరక్షించడంలో ఓ భాగం. తల్లి ఆరోగ్యంగా ఉంటే బిడ్డ ఆరోగ్యంగా ఉంటుంది...తద్వారా కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుందన్నదే అసలు ఆంతర్యం. 

వంట నుంచి సైన్స్  కోడింగ్ వరకు ప్రాచీన భారతదేశంలో 14 విద్యలు, 64 కళలు: శ్రీకృష్ణుడి అద్భుత జ్ఞాన రహస్యం!

గమనిక: ఆధ్యాత్మికవేత్తలు సూచించిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల్లో పొందుపరిచిన సమాచారం ఆధారంగా అందించిన కథనం ఇది. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.  దీనిని అనుసరించేముందు మీరు విశ్వశించే పండితుల సలహాలు స్వీకరించగలరు

Frequently Asked Questions

ప్రసవం తర్వాత బాలింత చీపురు ముట్టుకోకూడదని పెద్దలు ఎందుకు చెబుతారు?

ప్రసవం తర్వాత తల్లి శరీరం, మనసు అత్యంత సున్నితంగా ఉంటాయి. ఆధ్యాత్మిక, ఆరోగ్య కారణాల దృష్ట్యా విశ్రాంతి, సంరక్షణ కోసం ఈ నియమాన్ని పాటిస్తారు.

ఆధ్యాత్మికంగా బాలింత చీపురు ముట్టుకోకపోవడం వెనుక ఉన్న నమ్మకాలు ఏమిటి?

ప్రసవించిన తల్లి అపవిత్రంగా ఉంటుందని, లక్ష్మీదేవి స్వరూపమైన చీపురును తాకితే సంపద పోతుందని, దుష్టశక్తులు ప్రవేశిస్తాయని నమ్ముతారు.

బాలింత చీపురు ముట్టుకోకపోవడం వెనుక ఉన్న ఆరోగ్య కారణాలు ఏమిటి?

ఆయుర్వేదం ప్రకారం వాతం దోషం పెరుగుతుంది, వెన్నునొప్పి వస్తుంది. ఆధునిక వైద్యం ప్రకారం బరువులు ఎత్తడం వల్ల ఇన్ఫెక్షన్లు, రక్తస్రావం పెరిగే ప్రమాదం ఉంది.

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

21-08-2026 శుక్రవారం మీ రాశిఫలాలు! ధనస్సు, మకరం, కుంభం, మీన రాశుల దినఫలాలు!
21-08-2026 శుక్రవారం మీ రాశిఫలాలు! ధనస్సు, మకరం, కుంభం, మీన రాశుల దినఫలాలు!
21-08-2026 శుక్రవారం మీ రాశిఫలాలు! సింహం, కన్య, తుల, వృశ్చికం మీ భవిష్యత్ తెలుసుకోండి!
21-08-2026 శుక్రవారం మీ రాశిఫలాలు! సింహం, కన్య, తుల, వృశ్చికం మీ భవిష్యత్ తెలుసుకోండి!
21-08-2026 శ్రావణ శుక్రవారం మీ రాశిఫలాలు! మేషం, వృషభం, మిథునం, కర్కాటక రాశుల దినఫలాలు!
21-08-2026 శ్రావణ శుక్రవారం మీ రాశిఫలాలు! మేషం, వృషభం, మిథునం, కర్కాటక రాశుల దినఫలాలు!
వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు : అష్టలక్ష్ముల అనుగ్రహంతో మీ ఇంట సిరిసంపదలు!
వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు : అష్టలక్ష్ముల అనుగ్రహంతో మీ ఇంట సిరిసంపదలు!
Advertisement

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
PV Sindhu Says World Badminton Drama.!: సింధు నిష్క్రమణ.. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! 
పోరాడి ఓడిన సింధు .. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! వరల్డ్ చాంపియన్షిప్ టోర్నీ
Vizag Crime News: విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
Nara Lokesh vs YS Jagan: వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
బైక్ కాదు, కారు కాదు.. హైడ్రోజన్‌తో నడిచే రోబోటిక్ గుర్రం - కవాసకి ప్రయోగం
హైడ్రోజన్‌తో పరుగులు తీసే కీలుగుర్రం.. తయారు చేస్తున్న కవాసకి
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
Embed widget